E-Paper
Advertisement

Best Mileage Maruti Suzuki Cars: సెలెరియో To స్విఫ్ట్.. బెస్ట్ మైలేజ్ ఇచ్చే మారుతి సుజుకి CNG కార్లు!

Best Mileage Maruti Suzuki Cars: సెలెరియో To స్విఫ్ట్.. బెస్ట్ మైలేజ్ ఇచ్చే మారుతి సుజుకి CNG కార్లు!
Advertisement

Best Mileage Maruti Suzuki CNG Cars: వాస్తవానికి హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్లు చాలా ఖరీదైనవి. అందుకే చాలా మంది  మధ్య తరగతి ప్రజలు ఇప్పటికీ వాటిని కొనుగోలు చేసేందుకు కాస్త తక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. CNG కార్లు పేద, మధ్య తరగతి కుటుంబ ప్రయాణాలకు అనుకూలంగా ఉన్నాయి. అందుకే, ఈ కార్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. పెట్రోల్ కంటే CNG చౌకైనది మాత్రమే కాదు, ఈ కార్లు అద్భుతమైన మైలేజీని కూడా ఇస్తాయి. భారత్ లో మంచి మైలేజీ ఇచ్చే మారుతి సుజుకి టాప్ 5 CNG కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ మారుతి సుజుకి సెలెరియో

మంచి మైలేజ్ ఇచ్చే మారుతి సుజుకి కార్లలో సెలెరియో ఒకటి. ఈ కారు CNG విభాగంలో దేశంలో మైలేజ్ ఛాంపియన్ గా కొనసాగుతోంది. ఇది కిలో CNGకి ఏకంగా 34.43 కి.మీ మైలేజ్ ఇస్తుంది. దీని VXI CNG మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 5.98 లక్షలు. తక్కకువ ధరలో మంచి లుక్, ఫీచర్లను కోరుకుంటే  ఈ కారు బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

⦿ మారుతి సుజుకి వ్యాగన్ R

Advertisement

మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఇష్టపడే కారు మారుతి సుజుకి వ్యాగన్ R. ఇది రెండు CNG వేరియంట్లలో వస్తుంది.  కిలో CNGకి 34 కి.మీ మైలేజీని అందిస్తుంది. LXI CNG మోడల్ ధర రూ. 5.89 లక్షలు కాగా, VXI CNG మోడల్ ధర రూ.6.42 లక్షలుగా ఉంది.

⦿ మారుతి సుజుకి ఆల్టో K10

మారుతి సుజుకి ఆల్టో K10 దేశంలో రెండవ అత్యంత చౌకైన CNG కారుగా గుర్తింపు తెచ్చుకుంది.  ఈ కారు ఎంట్రీ లెవల్ హ్యాచ్‌ బ్యాక్ కోసం చూస్తున్న ఎవరికైనా బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఈ కారు కిలో CNGకి 33.85 కి.మీ మైలేజీని ఇస్తుంది. LXI S-CNG వేరియంట్  రూ. 4.82 లక్షలకు, VXI S-CNG వేరియంట్ రూ.5.32 లక్షలకు అందుబాటులో ఉంది.

⦿ మారుతి సుజుకి డిజైర్

Advertisement

సెడాన్ విభాగంలో మారుతి సుజుకి డిజైర్ అత్యధికంగా అమ్ముడవుతోంది. ఇది CNG ఎంపికతో కూడా లభిస్తుంది. ఈ కారు  కిలో CNGకి 33 కి.మీ మైలేజీని అందిస్తుంది. VXI CNG మోడల్ ధర రూ. 8.03 లక్షలు కాగా, ZXI CNG వేరియంట్ ధర  రూ. 9.04 లక్షల వరకు ఉంది.

Read Also: ఫిబ్రవరిలో ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల జోష్, టాప్ లో టీవీఎస్, ఏడో స్థానానికి పడిపోయిన ఓలా!

⦿ మారుతి సుజుకి స్విఫ్ట్

ప్రీమియం హ్యాచ్‌ బ్యాక్ విభాగంలో మారుతి సుజుకి స్విఫ్ట్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. దీని CNG వెర్షన్ కిలో CNGకి  32 కి.మీ మైలేజీని ఇస్తుంది. VXI CNG మోడల్ ధర రూ. 7.45 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ ఎండ్ ZXI CNG మోడల్ ధర రూ.8.39 లక్షల వరకు ఉంటుంది.

Read Also: టాటా నెక్సాన్ To MG విండ్సర్.. రూ. 20 లక్షల్లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Related News

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

కియా సైరోస్ EV vs కియా సైరోస్ ICE.. ఏది బెస్ట్? పూర్తి పోలిక ఇదే!

16 ఏళ్ల తర్వాత నిస్సాన్ మాస్టర్‌ పీస్.. కొత్త ఎల్గ్రాండ్ వచ్చేసింది!

భారత మార్కెట్ లోకి చౌకైన 7-సీటర్‌.. ఏంటీ.. ధర మరీ అంత తక్కువా?

MG కొత్త EV వచ్చేస్తోంది.. 600 కి.మీ రేంజ్‌తో అదిరే ఎంట్రీ!

సింగిల్ ఛార్జ్ తో 500 కి.మీ ప్రయాణం.. మార్కెట్ లో దుమ్మురేపబోతున్న హ్యుందాయ్ ఈవీ!

Big Stories

Advertisement
×