E-Paper
Advertisement

8 ఏండ్ల బ్యాటరీ వారంటీ.. ఈవీ కొనాలంటే ఇవే బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు!

8 ఏండ్ల బ్యాటరీ వారంటీ.. ఈవీ కొనాలంటే ఇవే బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు!
Advertisement

దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం వేగంగా పెరుగుతోంది. మంచి రేంజ్, ఎక్కువ ఫీచర్లు, స్టైలిష్ లుక్ లో చాలా మోడల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. అయితే, ఈవీ కొనుగోలు చేసే ముందు బ్యాటరీ వారంటీ గురించి పూర్తిగా తెలుసుకోవడం మంచిది. నిజానికి ఎలక్ట్రిక్ స్కూటర్‌ లో అత్యంత ఖరీదైన భాగం బ్యాటరీ. ఒకసారి బ్యాటరీ మార్చాల్సి వస్తే రూ.40 వేల నుంచి రూ.90 వేల వరకు ఖర్చవుతుంది. అందుకే మంచి బ్యాటరీ వారంటీ ఉన్న స్కూటర్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం మార్కెట్లో కొన్ని కంపెనీలు 5 నుంచి 8 సంవత్సరాల వరకు బ్యాటరీ వారంటీ ఇస్తున్నాయి. వాటిలో టాప్ మోడల్స్ గురించి తెలుసుకుందాం..

⦿  ఓలా S1 సిరీస్‌

ఈ మోడల్ కు ప్రస్తుతం 3 సంవత్సరాలు లేదంటే 40,000 కిలోమీటర్ల స్టాండర్డ్ వారంటీ లభిస్తుంది. మరికొంత మొత్తం చెల్లించి 8 సంవత్సరాల వరకు వారంటీ పొడిగించుకోవచ్చు. ఎంపిక చేసిన ప్లాన్‌ ను బట్టి 80,000 నుంచి 1.25 లక్షల కిలోమీటర్ల వరకు కవరేజ్ ఉంటుంది. అయితే, ఈ సదుపాయం కొన్ని ప్రత్యేక వేరియంట్లకే వర్తిస్తుంది. స్కూటర్ కొనుగోలు చేసిన తర్వాత నిర్ణీత సమయంలోనే ఈ ప్లాన్ తీసుకోవాలి.

⦿  ఏథర్ 450X, రిజ్టా

Advertisement

ఈ మోడళ్లకు కూడా 8 సంవత్సరాల వరకు బ్యాటరీ కవరేజ్ అందుబాటులో ఉంది. కంపెనీ అందించే  Eight70  ప్లాన్ ద్వారా మొత్తం 8 సంవత్సరాలు లేదంటే 80,000 కిలోమీటర్ల వరకు కవరేజ్ పొందొచ్చు. ముఖ్యంగా బ్యాటరీ హెల్త్ 70 శాతం కంటే తగ్గితే కంపెనీ ఉచితంగా బ్యాటరీ మార్చుతుంది. ఈ విషయాన్ని ఏథర్ స్పష్టంగా వెల్లడించింది.

⦿  సింపుల్ వన్ ఎలక్ట్రిక్

ఈ స్కూటర్‌ కు కూడా 8 సంవత్సరాల బ్యాటరీ వారంటీ ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇతర బ్రాండ్ల మాదిరిగా అదనపు టాప్ అప్ అవసరం లేకుండానే ఈ కవరేజ్ లభించే అవకాశం ఉంది. అయితే, కొనుగోలు చేసే ముందు ప్రస్తుత వారంటీ నిబంధనలు డీలర్ దగ్గర కన్ఫార్మ చేసుకోవడం మంచిది.

⦿  హీరో విడా

Advertisement

హీరో విడా V1, V1 ప్రో స్కూటర్లకు 5 సంవత్సరాలు, 60,000 కిలోమీటర్ల బ్యాటరీ వారంటీ లభిస్తుంది. దీనికి ప్రత్యేకంగా అదనపు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ వారంటీని మరో యజమానికి కూడా ట్రాన్స్ ఫర్ చేసే అవకాశం ఉండటం పెద్ద ప్లస్ పాయింట్‌గా చెప్పొచ్చు.

⦿  టీవీఎస్ ఐక్యూబ్‌

ఈ స్కూటర్ కు 3 సంవత్సరాలు, 50,000 కిలోమీటర్ల స్టాండర్డ్ వారంటీ ఉంటుంది. అదనపు ప్లాన్ తీసుకుంటే మొత్తం 5 సంవత్సరాల వరకు కవరేజ్ పొందవచ్చు. టీవీఎస్ బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్  అనే కొత్త విధానాన్ని కూడా అందిస్తోంది. ఇందులో బ్యాటరీ కంపెనీదే ఉంటుంది. వినియోగదారు నెలవారీ చెల్లింపుతో ఉపయోగించుకోవాలి.

Read Also: ఏథర్ To విడా.. 6 నెలల్లో 3 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు వచ్చేస్తున్నాయ్!

Related News

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

కారులో రాకెట్ టెక్నాలజీ.. స్పేస్‌ ఎక్స్‌ తో టెస్లా కొత్త ప్రయోగం చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా XUV 3XO సరికొత్త రికార్డు.. 5 లక్షలు దాటిన సేల్స్!

మారుతి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ. 1.65 లక్షల తగ్గింపు!

హ్యుందాయ్ క్రెటా సరికొత్త రికార్డు.. 15 లక్షలు దాటిన అమ్మకాలు!

ట్రాక్షన్ కంట్రోల్, ఫాస్ట్ ఛార్జింగ్‌.. అప్ డేటెడ్ టీవీఎస్ రైడర్ లో అదిరిపోయే ఫీచర్లు!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

Big Stories

Advertisement
×