E-Paper
Advertisement

ఏథర్ To విడా.. 6 నెలల్లో 3 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు వచ్చేస్తున్నాయ్!

ఏథర్ To విడా.. 6 నెలల్లో 3 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు వచ్చేస్తున్నాయ్!
Advertisement

Upcoming Electric Scooters 2026: భారత్ లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. పెట్రోల్ ధరలు పెరగడం, తక్కువ రన్నింగ్ ఖర్చు, ప్రభుత్వ ప్రోత్సాహకాల కారణంగా చాలా మంది ఇప్పుడు ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. 2026 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 14 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్ముడయ్యాయి. పెరుగుతున్న మార్కెట్‌ ను దృష్టిలో పెట్టుకుని పలు కంపెనీలు కొత్త మోడళ్లను తీసుకురాబోతున్నాయి. రాబోయే 6 నెలల్లో భారత మార్కెట్లో విడుదల కానున్న మూడు ముఖ్యమైన ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1.ఏథర్ EL01

మొదటగా ఏథర్ కంపెనీ నుంచి కొత్త EL01 ఎలక్ట్రిక్ స్కూటర్ రానుంది. ఇది జూలై లేదంటే ఆగస్టు 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది. బెంగళూరుకు చెందిన ఏథర్ ఎనర్జీ సంస్థ ఈ స్కూటర్‌ను తమ కమ్యూనిటీ డే ఈవెంట్ లో ప్రదర్శించే అవకాశముంది. మాస్ మార్కెట్‌ ను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన స్కూటర్ అయినప్పటికీ, దీని ధర రూ.1 లక్షకు తక్కువగా ఉండదని కంపెనీ ఇప్పటికే స్పష్టం చేసింది.

Advertisement

EL01కు స్టైలిష్ లుక్ ఇవ్వనున్నారు. ముందు భాగంలో 14 అంగుళాల వీల్, వెనుక భాగంలో 12 అంగుళాల వీల్ ఉండే అవకాశం ఉంది. ఈ స్కూటర్‌లో స్వింగ్ ఆర్మ్‌ పై అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. అలాగే అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ సిస్టమ్ లాంటి కొత్త టెక్నాలజీ కూడా ఇవ్వనున్నారు. అదనంగా ఆన్‌బోర్డ్ ఛార్జింగ్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

2.హీరో విడా బడ్జెట్ స్కూటర్

ఇక హీరో మోటోకార్ప్ తమ విడా బ్రాండ్ కింద కొత్త బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకురానుంది. ఇది 2026 ఆగస్టు నాటికి విడుదల కావచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న VX2 మోడల్‌ కు తక్కువ ధరలో మరో కొత్త ఎంపికగా దీనిని తీసుకురానున్నారు. ఈ స్కూటర్‌లో 3.8kWh ఫిక్స్‌డ్ బ్యాటరీ ప్యాక్ ఉండే అవకాశం ఉంది. దీని ధర రూ.1 లక్షలోపు ఉండవచ్చని అంచనా.

Advertisement

హీరో ఇప్పటికే బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ మోడల్‌ తో తక్కువ ధరలో స్కూటర్లను అందిస్తోంది. కొత్త మోడల్‌ ను కూడా అందుబాటులో ధరలో తీసుకురావాలని చూస్తోంది. ఈ స్కూటర్ కోసం కంపెనీ శ్రీ సిటీ ప్లాంట్‌ లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతోంది. అయితే, ఈ మోడల్‌లో ఖరీదైన అడ్వాన్స్‌ డ్ రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లు వచ్చే అవకాశం తక్కువగా ఉంది.

3.సింపుల్ ఎనర్జీ అరైవ్

అటు సింపుల్ ఎనర్జీ సంస్థ తమ కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయనుంది. దీనికి ‘అరైవ్’ అనే పేరు పెట్టే అవకాశం ఉందని సమాచారం. ఈ స్కూటర్ 2026 సెకెండాఫ్ లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇటీవల ఈ స్కూటర్  టెస్టింగ్ సమయంలో కనిపించడం ఆసక్తి కలిగిస్తోంది. ఈ స్కూటర్‌కు సాధారణ కుటుంబ వినియోగదారులకు సరిపోయే డిజైన్ ఇవ్వనున్నారు. సింగిల్ పీస్ సీటు, చిన్న విండ్‌ స్క్రీన్, సింపుల్ స్టైలింగ్ తో ఆకట్టుకోనుంది. 3.7kWh, 5kWh బ్యాటరీ ప్యాక్‌లలో ఏదో ఒకటి ఇందులో ఉపయోగించే అవకాశం ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 120 నుంచి 130 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వవచ్చని తెలుస్తోంది.

Read Also: కొత్త టియాగో EV vs పాత టియాగో EV.. నయా మోడల్ లో క్రేజీ అప్ డేట్స్ ఇవే!

Related News

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

కియా సైరోస్ EV vs కియా సైరోస్ ICE.. ఏది బెస్ట్? పూర్తి పోలిక ఇదే!

16 ఏళ్ల తర్వాత నిస్సాన్ మాస్టర్‌ పీస్.. కొత్త ఎల్గ్రాండ్ వచ్చేసింది!

భారత మార్కెట్ లోకి చౌకైన 7-సీటర్‌.. ఏంటీ.. ధర మరీ అంత తక్కువా?

MG కొత్త EV వచ్చేస్తోంది.. 600 కి.మీ రేంజ్‌తో అదిరే ఎంట్రీ!

సింగిల్ ఛార్జ్ తో 500 కి.మీ ప్రయాణం.. మార్కెట్ లో దుమ్మురేపబోతున్న హ్యుందాయ్ ఈవీ!

Big Stories

Advertisement
×