E-Paper
Advertisement

జూన్‌ నెలలో థియేటర్లలో సందడి చేయనున్న నాలుగు క్రేజీ టాలీవుడ్ చిత్రాలు ఇవే!..

జూన్‌ నెలలో థియేటర్లలో సందడి చేయనున్న నాలుగు క్రేజీ టాలీవుడ్ చిత్రాలు ఇవే!..
Advertisement

June Telugu Releases: సమ్మర్ సీజన్ ముగుస్తున్న వేళ, రాబోయే జూన్ నెలలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‌బస్టర్ ఫైట్ సిద్ధమైంది. విభిన్న జోనర్లు, క్రేజీ కాంబినేషన్లతో ప్రేక్షకులను అలరించడానికి నాలుగు వైవిధ్యభరితమైన చిత్రాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ఆ సినిమాల వివరాలు ఇవే.

Read also-నాగచైతన్య ‘వృషకర్మ ‘ రిలీజ్ డేట్ లాక్.. టైం చూసి దిగితున్నాడే..!

1. పెద్ది (Peddi) – జూన్ 4

Advertisement

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఇది. ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో రామ్ చరణ్ ఒక పల్లెటూరి క్రీడా లెజెండ్‌గా రగ్గడ్ లుక్‌లో కనిపించనున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

2. సింగ్ గీతం (Sing Geetham) – జూన్ 11

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు మళ్లీ మెగాఫోన్ పట్టిన విలక్షణమైన ‘మ్యూజికల్ ఫాంటసీ’ చిత్రం ఇది. ఒక మారుమూల గ్రామంలోని ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయాలకు.. ఆధునిక కాలంలోని సాంకేతిక అభివృద్ధికి మధ్య జరిగే ఆసక్తికరమైన సంఘర్షణ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అహిల్య బమ్రూ, శాలినీ కొండేపూడి, బెనర్జీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

3. మా ఇంటి బంగారం (Maa Inti Bangaram) – జూన్ 19

Advertisement

డైరెక్టర్ బి.వి. నందినీ రెడ్డి, స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు కాంబినేషన్‌లో వస్తున్న అవుట్ అండ్ అవుట్ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ ఇది. పెళ్లయ్యాక అత్తగారింట్లో అమాయకపు కోడలిగా సెట్ అవ్వాలని ప్రయత్నించే ఓ మహిళ, తన కుటుంబానికి సమస్య వచ్చినప్పుడు తనలోని పాత ‘ఎలైట్ కాంబాట్ స్కిల్స్’ ఉపయోగించి ఎలా కాపాడుకుందనేదే ఈ సినిమా కథ. సమంత యాక్షన్, కామెడీ టైమింగ్ ఈ చిత్రానికి హైలైట్ కానున్నాయి.

Read also-బాక్సాఫీస్ వద్ద ‘దృశ్యం 3’ సంచలనం.. వారం రోజుల్లోనే అన్ని కోట్ల వసూళ్లా?..

4. లెనిన్ (Lenin) – జూన్ 26

అఖిల్ అక్కినేని హీరోగా, మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కిన ఎమోషనల్ యాక్షన్ డ్రామా ఇది. కుటుంబ కలహాలు, తండ్రి వారసత్వాన్ని కాపాడుకోవడం, సమాజంలో కీర్తి ప్రతిష్టల కోసం జరిగే పోరాటం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. అఖిల్ మాస్ లుక్‌లో కనిపిస్తుండగా.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా, శివాజీ కీలక పాత్రలో నటిస్తున్నారు.

స్పోర్ట్స్ డ్రామా, ఫాంటసీ, యాక్షన్ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్.. ఇలా ప్రతి వారం ఒక విభిన్నమైన జోనర్ సినిమా జూన్ నెలలో ప్రేక్షకులను పలకరించబోతోంది. మరి ఈ రేసులో ఏ సినిమా విజేతగా నిలుస్తుందో చూడాలి. అంతే కాకుండా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన జన నాయగన్ కూడా ఇదే నెలలో విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాలు ఏ రేంజ్ హిట్ సాధిస్తాయో చూడాలి మరి.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×