Hyderabad: తెలంగాణలో రాజకీయాలు క్రమంగా హీటెక్కుతున్నాయి. వివిధ పార్టీల నేతలు ఒకరి తర్వాత మరొకరు రియాక్ట్ అవుతున్నారు. బుధవారం బండి సంజయ్, గురువారం సీఎం రేవంత్‌రెడ్డి, తాజాగా కేటీఆర్ వంతైంది. శుక్రవారం మీడియా ముందుకొచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
బండి సంజయ్‌పై కేటీఆర్ కామెంట్స్
తెలంగాణ రాజకీయాలు, ప్రజా సమస్యలు, నేతల మాటలపై నోరు విప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేంద్రమంత్రి బండి సంజయ్‌తో మాకు ఎలాంటి వ్యక్తిగత పంచాయితీ లేదని కుండబద్దలు కొట్టేశారు. ఎప్పుడైనా ఎదురుగా కలిస్తే మాట్లాడుతామే తప్పా, అగౌరవంగా వ్యవహరించలేదన్నారు.
ఆయన పనికి మాలిన మాటలు ఆడారని, చివరకు మా తల్లిదండ్రులను ఉద్దేశించి అగౌరవంగా మాట్లాడారని అన్నారు. అయినా సరే తాను మాటలు తూలనాడిన సందర్భం లేదని తెలిపారు. నేరస్తుడు ఎవడైనా నేరస్తుడే అన్నది మా సిద్ధాంతమన్నారు.
ఆ పంచాయితీ లేదు, ఆయనలా పనికి రాని మాటలు ఆడలేదన్న కేటీఆర్
దీనిపై కేంద్రమంత్రి బండిసంజయ్-కేటీఆర్‌పై గురువారం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. వారిద్దరి మధ్య ఏదో పంచాయితీ ఉందని, ఆ పంచాయితీని పిల్లల మీద పెట్టి కేటీఆర్ తీర్చుకోవాలి అనుకుంటున్నారని వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో తనవైపు ఎలాంటి తప్పు లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు కేటీఆర్.
దేశంలో తక్కువ సమయంలో సంచలనం రేపుతోన్న కాక్రోచ్ పార్టీపై మీడియా అడిగిన ప్రశ్నలకు నోరు విప్పారు కేటీఆర్. దేశంలో ప్రధాన ప్రతిపక్షం ఫెయిల్ అయ్యిందని, దానికంటే కాక్రోచ్‌లే మేలని ప్రజలు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
తనపై కేసుల గురించి నోరు విప్పారు కేటీఆర్. తాను పారిపోయేవాడ్ని కాదని, తండ్రి పేరు దాచుకునేటోన్ని కాదని, కొడుకు పేరుకు నాకు సంబంధం లేదు అని చెప్పుకునేవాడ్ని అంతకంటే కాదన్నారు. దయచేసి కొడుకు పేరు-నా పేరు జత చేసి రాయకండి అని గ్యాగ్ ఆర్డర్లు తెచ్చుకునే వ్యక్తిని కాదన్నారు. తాము నిజాయితీగా ఉన్నాము కాబట్టే దేనికీ బయపడమన్నారు.
ALSO READ: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్.. డిజాస్టర్ ప్రెసిడెంట్, పార్టీలో ఏం జరుగుతోంది?
రైతుల సమస్యపై సీఎం రేవంత్ రెడ్డికి గురువారం బహిరంగ లేఖ రాశామన్నారు. సీఎంకు డబ్బు సంచుల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదన్నారు. మంత్రి సొంత జిల్లాల్లో ఓ రైతు చనిపోయారని వివరించారు. రాష్ట్రంలో గన్నీ బ్యాగులు దొరకలేదు గానీ, గన్స్ దొరుకుతున్నాయన్నారు.
రాష్ట్రంలో 35 శాతానికి మించి ధాన్యం కొనుగోలు చేయలేదని, 80 శాతం కొనుగోలు చేశామని సీఎం చెబుతున్నారని అన్నారు. 50 శాతం ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి అంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత కాలం రైతులకు ఇబ్బందులు తప్పవని, టార్పాలిన్ కవర్లు ఇచ్చే దిక్కు లేదన్నారు.
బండి సంజయ్‌కి, నాకు వ్యక్తిగత పంచాయితీ ఏమీ లేదు..
చాలాసార్లు సంజయ్ ఎదురుపడినప్పుడు నేను మాట్లాడా..
సంజయ్ మా తల్లిదండ్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేను ఇప్పటివరకు ఏమీ అనలేదు: KTR https://t.co/3ZMac27xnn pic.twitter.com/odjGHhCzlw
— ChotaNews App (@ChotaNewsApp) May 22, 2026