E-Paper
Advertisement

Top 5 Safest Cars: రూ.10 లక్షల లోపు 5 బెస్ట్ సేఫెస్ట్ కార్లు ఇవే.. టాప్‌లో ఉన్నది ఏ కారంటే?

Top 5 Safest Cars:  రూ.10 లక్షల లోపు 5 బెస్ట్ సేఫెస్ట్ కార్లు ఇవే.. టాప్‌లో ఉన్నది ఏ కారంటే?
Advertisement

Top 5 Safest Cars Under Rs 10 Lakhs: గత కొద్ది సంవత్సరాలుగా వినియోగదారులు కార్ల విషయంలో ప్రధానంగా రెండు విషయాలను గమనిస్తున్నారు. ఒకటి కారు లుక్, రెండు సేఫ్టీ. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ఉన్న కార్లు చాలా వరకు మంచి సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉన్నాయి. అయితే, రూ. 10 లక్షల లోపు టాప్ 5 సురక్షితమైన కార్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.. వీటన్నింటికీ గ్లోబల్ NCAP, భారత్ NCAP టెస్ట్ లో 5-స్టార్ సేప్టీ రేటింగ్స్ పొందాయి. ఇంతకీ అవేంటంటే..

⦿ హ్యుందాయ్ ఎక్స్‌టర్ (మైక్రో SUV)

ఇది మార్కెట్ ను ఏలుతున్న టాటా పంచ్‌కి మంచి పోటీదారు. దీనికి బేస్ మోడల్ నుంచి 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.  హిల్ అసిస్ట్ లాంటి  భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఇంకా అఫీషియల్ గా 5-స్టార్ టెస్ట్ జరుపుకోలేదు. కానీ, బిల్డ్ చాలా బలంగా ఉంది. అత్యంత సేఫ్ గా ఉంటుందని ఆటో నిపుణులు భావిస్తున్నారు. చూడ్డానికి స్టైలిష్ గా, మంచి ఫీచర్లను కలిగి ఉంటుంది. దీని ధర రూ. 6 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

⦿ టాటా నెక్సాన్ (కాంపాక్ట్ SUV)

Advertisement

ఇండియాలో బాగా పాపులర్ అయిన SUV ఇది. 5 స్టార్‌ రేటింగ్ పొందిన ఫస్ట్ ఇండియన్ కారు. చాలా సురక్షితంగా ఉంటుంది. టాటా పంచ్ కంటే పెద్దది. హైవే డ్రైవింగ్ కు చాలా బాగుంటుంది. సరిపడ ఎయిర్‌ బ్యాగ్‌లు, బలమైన బాడీ ఉన్నాయి. బేస్ ధర రూ.8 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

⦿ మహీంద్రా XUV 3XO (కాంపాక్ట్ SUV)

ఇది స్టైలిష్ కాంపాక్ట్ SUV. దీనికి Bharat NCAPలో 5 స్టార్ రేటింగ్ పొందింది. 6 ఎయిర్‌ బ్యాగ్‌లు ఉంటాయి. పవర్ ఫుల్ బ్రేక్‌లు,  టాప్ వేరియెంట్లలో ADAS లాంటి అదనపు భద్రతా ఫీచర్లను కలిగి ఉంటుంది. మంచి పవర్, ఫీచర్లను కలిగి ఉంటుంది. బేస్ ధర రూ. 8 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

⦿ టాటా ఆల్ట్రోజ్ (హ్యాచ్‌బ్యాక్)

Advertisement

ఇది మంచి హ్యాచ్‌ బ్యాక్ కారు. స్విఫ్ట్ లాగా పెద్దగా ఉంటుంది. భారత్ NCAPలో 5 స్టార్‌ రేటింగ్ ను పొందింది. చాలా సేఫ్టీగా ఉంటుంది. బలమైన బిల్డ్,  6 ఎయిర్‌ బ్యాగ్‌లు, స్మూత్ డ్రైవ్ అవకాశం ఉంటుంది. SUV కాకుండా సాధారణ కారు స్టైల్ ను కోరుకునే వారికి ఇది బెస్ట్. ధర రూ. 6.5-7 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. లోపల ప్రీమియం లుక్ తో ఉంటుంది.

⦿ టాటా పంచ్ (మైక్రో SUV)

ఇది అత్యంత బలంగా, పొడవుగా కనిపించే చిన్న SUV. రూ. 10 లక్షల లోపు మన దేశంలో అత్యంత సురక్షితమైన చిన్న కారు. దీనికి గ్లోబల్ NCAP నుంచి 5 స్టార్‌ రేటింగ్ వచ్చింది. దీనికి బలమైన బాడీ, డ్యూయల్ ఎయిర్‌ బ్యాగ్‌లు, ABS బ్రేక్‌లు ఉంటాయి. ఫ్యామిలీకి సరిపడ బూట్ స్పేస్ ఉంటుంది. దీని ధర రూ. 6-7 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కారణంగా సిటీ రోడ్లకు, గ్రామీణ ప్రాంతాల రోడ్లకు అనుగుణంగా ఉంటుంది.

Read Also: కియా To మహీంద్రా.. కొత్త ఏడాది సరికొత్తగా అడుగు పెట్టబోతున్న హైబ్రిడ్ కార్ల!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×