E-Paper
Advertisement

Upcoming Hybrid Models 2026: కియా To మహీంద్రా.. కొత్త ఏడాది సరికొత్తగా అడుగు పెట్టబోతున్న హైబ్రిడ్ కార్ల!

Upcoming Hybrid Models 2026: కియా To మహీంద్రా.. కొత్త ఏడాది సరికొత్తగా అడుగు పెట్టబోతున్న హైబ్రిడ్ కార్ల!
Advertisement

Hybrid Models 2026: ఈ ఏడాది అందించిన జోష్ తో 2026లో జోరు కొనసాగించాలని భావిస్తున్నాయి ఆటో మోబైల్ కంపెనీలు. వినియోగదారులను ఆకట్టుకునేలా సరికొత్త హైబ్రిడ్ కార్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నాయి. ప్రధానంగా స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీపై ఫోకస్ చేస్తూ, మైలేజ్, పర్యావరణ అనుకూలత, అఫోర్డబుల్ ధరల్లో ఈ మోడల్స్ విడుదలకానున్నాయి. ఇంతకీ, ఆ కార్లు ఏవి? లాంచింగ్ ఎప్పుడు? స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

⦿Honda Elevate Hybrid

ఈ కారు 2026 మిడ్ ఇయర్ లో ఈ కారు విడుదలకానుంది. దీని ధర సుమారు రూ.14-20 లక్షలు ఉంటుంది. పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, 1.5-లీటర్ అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజిన్ + డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్స్,  e-CVT ట్రాన్స్‌ మిషన్ తో వస్తుంది. 20-26 kmpl  మైలేజ్, 5 సీటింగ్ కెపాసిటీ, SUV బాడీ టైప్, మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్స్,  6 ఎయిర్ బ్యాగ్స్ తో అందుబాటులోకి రానుంది. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, వైర్‌లెస్ ఛార్జింగ్, 360-డిగ్రీ కెమెరా, హోండా సెన్సింగ్ ADAS, ABS లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. .

⦿Maruti Suzuki Fronx Hybrid

Advertisement

ఈ కారు 2026 ఫస్ట్ క్వార్టర్ లో విడుదలకానుంది.  1.2-లీటర్ Z12E సిరీస్ హైబ్రిడ్, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ + ఎలక్ట్రిక్ అసిస్ట్, ఆటోమేటిక్ (e-CVT స్టైల్)లో రానుంది. 24-32 kmpl మైలేజ్, 5 సీటింగ్ కెపాసిటీ, కాంపాక్ట్ SUV బాడీ, డ్యుయెల్ ఎయిర్‌బ్యాగ్స్ తో రానుంది. ESC, హిల్ హోల్డ్ అసిస్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది. అంచనా ధర రూ. 8-12 లక్షలు.

⦿Toyota Urban Cruiser Taisor Hybrid

ఈ కారు 2026 ఎండింగ్ లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఫ్రాంక్స్ సిరీస్ హైబ్రిడ్ సెటప్ (1.2-లీటర్ పెట్రోల్ + ఎలక్ట్రిక్ మోటార్) పవర్ ట్రెయిన్ తో వస్తుంది. 25-30 kmpl మైలేజ్, 5 సీటింగ్ కెపాసిటీ, SUV బాడీ సెటప్ ఉంటుంది. లెవల్ 2 ADAS, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. అంచనా ధర రూ. 0-15 లక్షలు ఉంటుంది.

⦿Kia Seltos Hybrid (సెకండ్-జెన్)

Advertisement

ఈ కారు  2026 ఎండింగ్ లో లేదంటే 2027 ఫస్ట్ క్వార్టర్ లో విడుదలకానుంది. దీని ధర సుమారు రూ. 15-26 లక్షలు ఉంటుంది. 1.5-లీటర్ పెట్రోల్ (NA/టర్బో/డీజిల్) + ఎలక్ట్రిక్ మోటార్ (స్ట్రాంగ్ హైబ్రిడ్), ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్ తో రానుంది. మైలేజ్ 20-30 kmpl, సీటింగ్ కెపాసిటీ 5, SUV బాడీ,  6 ఎయిర్‌బ్యాగ్స్, 140 hp కంబైన్డ్ తో రానుంది. పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా, డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, ట్రినిటీ పనోరమిక్ డిస్‌ ప్లే, లెవల్ 2 ADASను కలిగి ఉంటుంది.

⦿Hyundai Creta Hybrid

ఈ కారు 2026 మిడ్ ఇయర్ లో లాంచ్ కానుంది.  ధర రూ. 16-19 లక్షలు ఉంటుంది. 1.5-లీటర్ పెట్రోల్ + హైబ్రిడ్ అసిస్ట్, ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ ను కలిగి ఉంటుంది. 20-23 kmpl మైలేజ్, 5 సీటింగ్ కెపాసిటీ, SUV బాడీతో రానుంది. ట్రాక్షన్ కంట్రోల్, సిక్స్ ఎయిర్‌బ్యాగ్స్, ABS లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

⦿Mahindra XUV 3XO Hybrid

ఈ కారు 2026 ఫస్ట్ క్వార్టర్ లో లాంచ్ కానుంది. 1.2-లీటర్ పెట్రోల్ + హైబ్రిడ్ (పెట్రోల్ + ఎలక్ట్రిక్)  పవర్‌ ట్రెయిన్, 20-25 kmpl మైలేజ్, 5 సీటింగ్ కెపాసిటీ, కాంపాక్ట్ SUV, ఎయిర్‌ బ్యాగ్స్ 6 ఉంటాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, 10-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్, హైయర్ వేరియంట్లలో ADAS ఉంటుంది. అంచనా ధర రూ. రూ.11-17 లక్షలు ఉంటుంది.

⦿Renault Duster Hybrid (నెక్స్ట్-జెన్)

ఈ కారు 2026 ఎండింగ్ లో లేదంటే 2027 ఫస్ట్ క్వార్టర్ లో లాంచ్ కానుంది. 1.6-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ (పెట్రోల్ + టూ ఎలక్ట్రిక్ మోటార్స్ + 1.2kWh బ్యాటరీ), ఆటోమేటిక్ పవర్ ట్రెయిన్ తో వస్తుంది. 18-22 kmpl మైలేజ్, 5  సీటింగ్ కెపాసిటీ,  మిడ్ సైజ్ SUVగా రానుంది. ESP, సిక్స్ ఎయిర్‌ బ్యాగ్స్, 360-డిగ్రీ కెమెరా లాంటి ఫీచర్లను కలిగి ఉంది. అంచనా ధర రూ.13-17 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు.

⦿Maruti Suzuki Swift Hybrid

ఈ కారు కూడా 2026 ఫస్ట్ క్వార్టర్ లో విడుదలయ్యే అవకాశం ఉంది.1.2-లీటర్ పెట్రోల్ (91PS, 118Nm) + ఎలక్ట్రిక్ మోటార్ (13.5PS, 30Nm); స్ట్రాంగ్ హైబ్రిడ్; 5-స్పీడ్ AMT పవర్‌ట్రెయిన్ తో రానుంది. 30-35 kmpl మైలేజ్, సీటింగ్ కెపాసిటీ  5, హ్యాచ్‌బ్యాక్ బాడీతో రానుంది. ప్యాడిల్ షిఫ్టర్స్, ESC, స్టెబిలిటీ కంట్రోల్ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. అంచనా ధర రూ. 8-10 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు.

Read Also: స్కోడా కుషాక్ To మహీంద్రా XUV700.. ఏకంగా రూ.2.5 లక్షల డిస్కౌంట్!

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×