E-Paper
Advertisement

బుధవారం ఆ పనులు అసలు చేయకూడదట

బుధవారం ఆ పనులు అసలు చేయకూడదట
Advertisement

Wednesdays:  బుధవారం రోజు ఆ పనులు అసలు చేయకూడదట. తెలిసి చేసినా తెలియక చేసినా ప్రతికూల ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుందట. అయితే బుధవారం చేయకూడని పనులేవో చేయాల్సిన పనులేవో ఇప్పుడు తెలుసుకుందాం.

బుధవారం జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధ గ్రహానికి, వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన రోజట. ఈ రోజున కొన్ని పనులు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని, మరికొన్ని పనులు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని పండితులు చెప్తున్నారు. అయితే బుధవారం చేయాల్సిన చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

అస్సలు చేయకూడని పనులు (Don’ts): శాస్త్రాల ప్రకారం బుధవారం నాడు ఈ పనులు చేయడం వల్ల ఆర్థిక నష్టాలు లేదా మానసిక ఒత్తిడి కలగవచ్చని పండితులు సూచిస్తున్నారు. అందులో మొదటిది అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం.. బుధవారం రోజు ధన లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని..  ముఖ్యంగా అప్పు ఇవ్వడం వల్ల తిరిగి రావడం కష్టమవుతుందని చెప్తున్నారు పండితులు. జ్యోతిష్య పరిభాషలో బుధవారం ఉత్తర దిశలో ‘దిక్శూల’ ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఉత్తర దిశగా సుదీర్ఘ ప్రయాణాలు చేయడం అంత మంచిది కాదట.

ఒకవేళ తప్పనిసరైతే, కొంచెం బెల్లం తిని బయలుదేరడం మంచిదని సూచిస్తున్నారు. ఇక బుధుడు సౌమ్య గ్రహం. ఈ రోజున ఆడపిల్లలను, సోదరీమణులను లేదా అత్తగారిని బాధపెట్టడం వల్ల ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందట. అలాగే స్టాక్ మార్కెట్ లేదా రిస్క్ ఉన్న ఇతర రంగాల్లో ఆలోచించకుండా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ఈ రోజు అంత శ్రేయస్కరం కాదని పండితులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా జాతకంలో బుధుడు బలహీనంగా ఉన్నప్పుడు అసలు చేయకూడదట. అలాగే వీలైనంత వరకు ఈ రోజు నలుపు రంగు దుస్తులను ధరించకపోవడం మంచిదని సూచిస్తున్నారు.

Advertisement

ఖచ్చితంగా చేయాల్సిన పనులు (To-Do List): బుధవారం నాడు ఆ పనులు చేయడం వల్ల బుధ గ్రహ దోషాలు తొలగి, తెలివితేటలు మరియు సంపద పెరుగుతాయట. అందులో మొదటిది  గణపతి ఆరాధన చేయడం. బుధవారం ఉదయాన్నే వినాయకుడిని దర్శించుకోవడం లేదా ఇంట్లోనే ఓం గం గణపతయే నమః అని జపించడం చాలా మంచిదట.  అలాగే బుధవారం రోజు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం లేదా కనీసం ఆకుపచ్చ రుమాలు దగ్గర ఉంచుకోవడం వల్ల బుధుడు ప్రసన్నమవుతాడట. ఇక పెసరపప్పు (Green Gram) లేదా ఆకుపచ్చని వస్తువులను పేదలకు దానం చేయడం శుభకరమట. కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవడానికి, మార్కెటింగ్ పనులకు మరియు అకౌంట్స్ సరిచూసుకోవడానికి ఈ రోజు చాలా అనుకూలమట. ఇంకా చదువు ప్రారంభించడానికి లేదా కొత్త విషయాలు నేర్చుకోవడానికి బుధవారం ఉత్తమమైన రోజని పండితులు సూచిస్తున్నారు.

బుధ గ్రహ ప్రభావం పెరగడానికి: బుధవారం నాడు ఆవుకు పచ్చి గడ్డిని తినిపించడం వల్ల మీ జాతకంలో బుధుడు బలపడతాడట. దీనివల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడమే కాకుండా, చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

 ALSO READ: మంగళవారం ఆ పనులు అసలు చేయకూడదట..?

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×