E-Paper
Advertisement

డైలీ ప్రయాణానికి బెస్ట్ చాయిస్, సుజుకి యాక్సెస్.. ధర ఎంతో తెలుసా?

డైలీ ప్రయాణానికి బెస్ట్ చాయిస్, సుజుకి యాక్సెస్.. ధర ఎంతో తెలుసా?
Advertisement

Suzuki Access 125 2026: ఇండియాలో బోలెడు ఫ్యామిలీ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఎక్కువ మంది ఇష్టపడే స్కూటర్  సుజుకి యాక్సెస్ 125 2026. మంచి పనితీరు, చక్కటి మైలేజ్, అందమైన  డిజైన్ ఆకట్టుకుంటుంది. ఈ స్కూటర్ రోజువారీ ప్రయాణాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకునే కొనుగోలుదారులకు ఈ స్కూటర్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

సింఫుల్ డిజైన్..

ఈ స్కూటర్ డిజైన్ చాలా సింఫుల్ గా ఉంటుంది. ఉపయోగించడానికి ఈజీగా ఉంటుంది. వెడల్పాటి సీటు వల్ల ఇద్దరు కంఫర్ట్ గా కూర్చోవచ్చు. విశాలమైన ఫ్లోర్‌ బోర్డ్ కారణంగా కాళ్లు ఉంచుకోవడానికి మంచి స్థలం ఉంటుంది. స్టెప్ త్రూ డిజైన్ ఉండటంతో అన్ని వయసుల వారు సులభంగా వాడే అవకాశం ఉంటుంది. ఈ స్కూటర్ లుక్ సింపుల్‌గా ఉన్నప్పటికీ, లేటెస్ట్ టెక్ టచ్‌ ను కలిగి ఉంటుంది.

ఇంజిన్ గురించి..

Advertisement

సుజుకి యాక్సెస్ 125 ఇంజన్ విషయానికి వస్తే.. 124cc సింగిల్ సిలిండర్ ఇంజన్ ను కలిగి ఉంటుంది. ఇది సుమారు 8.5 PS పవర్, 10 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సిటీ డ్రైవింగ్‌ కు అనుకూలంగా స్మూత్ పనితీరును అందిస్తుంది. ట్రాఫిక్‌లో కూడా ఈ స్కూటర్ సులభంగా నడపవచ్చు. CVT ట్రాన్స్‌ మిషన్ ఉండటంతో గేర్ మార్పుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు, డ్రైవింగ్ అనుభవం మరింత సౌకర్యంగా ఉంటుంది.

మైలేజ్ ఎంత ఇస్తుందంటే?

మైలేజ్ విషయంలో కూడా ఈ స్కూటర్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఒక లీటర్ పెట్రోల్ కు సుమారు 45 నుంచి 50 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది. దీని వల్ల ఫ్యూయెల్ ఖర్చు తగ్గుతుంది. ఫ్యూయల్ ట్యాంక్ పెద్దగా ఉండటంతో తరచుగా పెట్రోల్ నింపాల్సిన అవసరం ఉండదు. రోజూ ఆఫీస్, పనుల కోసం వెళ్లేవారికి  పదే పదే పెట్రోల్ కొట్టించుకోవాల్సిన అవసరం లేకుండా చేస్తుంది.

ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Advertisement

ఫీచర్ల పరంగా చూస్తే, ఈ స్కూటర్‌లో సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ తో వస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, LED హెడ్‌ ల్యాంప్, USB ఛార్జింగ్ పోర్ట్ లాంటి ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఇవి ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చుతాయి. ఈ స్కూటర్ తేలికపాటి బరువు ఉండటం వల్ల ట్రాఫిక్‌ లో సులభంగా మలుపులు తిప్పుకునే అవకాశం ఉంటుంది. సస్పెన్షన్ సిస్టమ్ రోడ్డు మీద గుంతలు ఉన్నా సాఫ్ట్ రైడ్ అందిస్తుంది.

ధర ఎంత అంటే?

ధర విషయానికి వస్తే, సుజుకి యాక్సెస్ 125  ధర సుమారు రూ.78,000 నుంచి రూ. 1.1 లక్షల వరకు (ఎక్స్ షోరూమ్) ఉండే అవకాశం ఉంది. ఈ ధరలో ఇది మంచి ఫీచర్లు, మైలేజ్, పనితీరును అందించడం వల్ల డబ్బుకు తగిన విలువనిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు సరైన స్కూటర్ కోసం చూస్తున్న కుటుంబాలకు ఇది మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

Read Also: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. రూ.11 వేల సబ్సిడీతో ఈ-సైకిళ్లు, ఎలా పొందాలంటే?

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×