E-Paper
Advertisement

టాటా To టయోటా.. కళ్లు చెదిరే ఎలక్ట్రిక్ కార్లు వచ్చేస్తున్నాయ్!

టాటా To టయోటా.. కళ్లు చెదిరే ఎలక్ట్రిక్ కార్లు వచ్చేస్తున్నాయ్!
Advertisement

Electric Cars Launching in May 2026: భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల రాక మరింత పెరిగింది. ముఖ్యంగా మే 2026లో పలు సూపర్ డూపర్ కార్లు విడుదలకు రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా SUV సెగ్మెంట్‌ లో కొత్త మోడళ్లపై కంపెనీలు ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాయి. కొనుగోలుదారుల అవసరాలు, పెరుగుతున్న పెట్రో ధరలు, గ్రీన్ ట్రావెల్ మీద అవగాహన కారణంగా ఈవీలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అద్భుతమైన కార్లు మార్కెట్లోకి రానున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ టాటా సఫారీ EV

టాటా కంపెనీ తన పాపులర్ మోడల్ సఫారీ EVని విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. ఈ కారు మేలో విడుదల కానుంది. మూడు వరుసల సీటింగ్‌తో వచ్చే ఈ SUV ఫ్యామిలీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రీమియం ఫీచర్లతో పాటు మంచి రేంజ్ ఇస్తుంది. దీని ధర సుమారు రూ.26 లక్షల నుంచి రూ. 30 లక్షల మధ్య ఉంటుందని అంచనా.

⦿ టాటా సియెర్రా EV

Advertisement

వినియోగదారులు ఎంతగానో ఎదురుచూస్తున్న మరో క్రేజీ ఎలక్ట్రిక్ కారు టాటా సియెర్రా EV. పాత సియెర్రా డిజైన్‌కు మోడర్న్ టచ్ ఇచ్చి దీనిని రూపొందిస్తున్నారు. Acti.ev ప్లాట్‌ ఫారమ్‌ పై ఇది తయారవుతోంది. సుమారు రూ.15 నుంచి రూ.20 లక్షల మధ్య ప్రారంభ ధర ఉంటుందని భావిస్తున్నారు. మే నెలలోనే ఈ కారు కూడా విడుదల కానుంది.

⦿ టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా

ఈ కారు మే 20న విడుదలయ్యే అవకాశం ఉంది. ఒకే ఛార్జ్ తో ఈ SUV 500 కిలోమీటర్లకు పైగా రేంజ్ ఇస్తుందని భావిస్తున్నారు. దీని ధర రూ.17 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. టయోటా బ్రాండ్ మీద కొనుగోలుదారులకు మంచి నమ్మకం ఉన్న నేపథ్యంలో ఈ కారుపై అంచనాలు భారీగా ఉన్నాయి.

⦿ హ్యుందాయ్ ఇన్స్టర్

Advertisement

ఈ కారు కాంపాక్ట్ క్రాస్ఓవర్ EVగా వస్తోంది. సిటీలో డ్రైవింగ్‌కు అనుకూలంగా ఉండేలా దీన్ని డిజైన్ చేస్తున్నారు. ఈ కారు ధర సుమారు రూ.12 లక్షల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. మే చివరలో లేదంటే జూన్ మధ్యలో ఈ కారు లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

⦿ టాటా అవిన్యా

ప్రీమియం సెగ్మెంట్‌ ను లక్ష్యంగా పెట్టుకుని ఈ కారును రూపొందిస్తున్నారు. ప్రత్యేక EV ప్లాట్‌ ఫారమ్‌ పై నిర్మిస్తున్న ఈ కారు.. డిజైన్, టెక్నాలజీ పరంగా మరో రేంజ్ లో ఉంటుంది. ఈ కారు మేలో లేదంటే ఆ తర్వాత నెలలో విడుదల కానుంది.

మేలో లాంచ్ కానున్న మరికొన్ని ఈవీ కార్లు

ఈ ఎలక్ట్రిక్ కార్లతో పాటు, మరికొన్ని కంపెనీలు కూడా తమ ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాయి. మారుతి సుజుకి ఇ-విటారా కూడా త్వరలోనే విడుదల కానుంది. ఇది కంపెనీ మొదటి ఎలక్ట్రిక్ SUVగా గుర్తింపు తెచ్చుకోనుంది. మహీంద్రా BE.07, XUV.e8 మోడళ్లు కూడా ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌ లో పోటీ పడబోతున్నాయి. కియా సైరోస్ EV కూడా 2026లోనే మార్కెట్లోకి రానుంది. బాక్సీ డిజైన్‌ తో, కాంపాక్ట్ సైజ్‌లో ఉండే ఈ SUV యూత్ ను ఆకట్టుకోనుంది.

Read Also: టాటా SUVలపై భారీ ఆఫర్లు, ఆ మోడల్ పై ఏకంగా రూ.3.5 లక్షల డిస్కౌంట్!

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×