E-Paper
Advertisement

తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్.. బుధవారం ఫలితాలు వెల్లడి, ఇంకెందుకు ఆలస్యం

తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్.. బుధవారం ఫలితాలు వెల్లడి, ఇంకెందుకు ఆలస్యం
Advertisement

TG 10th class Results 2026: ఎట్టకేలకు తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదలకు అంతా రెడీ. ఏప్రిల్ 29న అంటే బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని పరీక్షల విభాగం వెల్లడించింది. ప్రభుత్వ సలహాదారు కేశవరావు ఫలితాలను విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.

తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్

Advertisement

తెలంగాణలో పదో తరగతి ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. మార్చి 14 నుంచి మొదలైన పరీక్షలు ప్రారంభమైన ఏప్రిల్ 13న వరకు జరిగాయి. ఈ పరీక్షలకు దాదాపు 5 లక్షల మందికిపైగా రెగ్యులర్‌ విద్యార్థులు హాజరయ్యారు. ఏప్రిల్ 23 నాటికి జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేశారు అధికారులు.

మూల్యాంకనం పూర్తికావడంతో మే తొలి వారంలో ఫలితాలు అవుతాయని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 29న ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు రెడీ అయ్యారు. ఫలితాలు విద్యార్థులు ఎలా చూసుకోవాలన్నది అసలు ప్రశ్న. వాట్సాప్‌లో ఫలితాలు వస్తాయని అంటున్నారు.

Advertisement

బుధవారం ఫలితాలు వెల్లడి, ఇంకెందుకు ఆలస్యం

ఒకవేళ రాకుంటే విద్యార్థులు ఎస్ఎస్‌సీ బోర్డు అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.inలో ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ సరిగ్గా లేని వారికి వాట్సాప్ ద్వారా రిజల్ట్స్ పొందవచ్చు. అందుకోసం 80969 58096 నంబర్‌కు Hi అని మెసేజ్ పంపితే చాలు. హాల్ టికెట్ నంబర్ నమోదు చేసిన వెంటనే మార్కులు స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఒకవేళ వెబ్‌సైట్ సర్వర్లు బిజీగా ఉన్నా విద్యార్థులు ఏ మాత్రం కంగారు పడాల్సిన పని లేదు.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×