E-Paper
Advertisement

టాటా SUVలపై భారీ ఆఫర్లు, ఆ మోడల్ పై ఏకంగా రూ.3.5 లక్షల డిస్కౌంట్!

టాటా SUVలపై భారీ ఆఫర్లు, ఆ మోడల్ పై ఏకంగా రూ.3.5 లక్షల డిస్కౌంట్!
Advertisement

April Deals on Tata SUVs: ఏప్రిల్ నెలలో కార్లు కొనాలనుకునే వారికి టాటా మోటార్స్ మంచి ఆఫర్లను అందిస్తోంది. ముఖ్యంగా SUV సెగ్మెంట్‌ లో కంపెనీ భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. కొన్ని మోడళ్లపై ఏకంగా  రూ. 3.50 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది.

టాటా ప్రస్తుతం భారత మార్కెట్లో పంచ్, నెక్సాన్, కర్వ్, హారియర్, సఫారీ లాంటి పలు SUVలను అమ్ముతోంది. ఎలక్ట్రిక్ వాహనాల్లో కూడా పంచ్.ev, నెక్సాన్.ev, కర్వ్.ev లాంటి మోడళ్లతో ఈవీ మార్కెట్ లోనూ సత్తా చాటుతోంది.ఈ ఏడాది చివర్లో సియెర్రా.ev కూడా మార్కెట్లోకి రానుంది.

టాటా కర్వ్ ఈవీపై రూ. 3.5 లక్షల తగ్గింపు

Advertisement

ఈ ఆఫర్లలో భాగంగా ఎలక్ట్రిక్ SUV అయిన టాటా కర్వ్ ఈవీ మీద ఎక్కువ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ మోడల్‌ పై గరిష్టంగా రూ. 3.50 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో టాటా కర్వ్ పై సుమారు రూ. 55,000 వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ డిస్కౌంట్ అనేది కన్స్యూమర్ ఆఫర్, గ్రీన్ బోనస్, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బెనిఫిట్, లాయల్టీ బోనస్ సహా పలు రకాలుగా అందిస్తుంది. వీటిని కలిపితే మొత్తం తగ్గింపు భారీగా ఉంటుంది.

కర్వ్ మోడల్ ధరల గురించి..

కర్వ్ SUV ధర సుమారు రూ. 9.70 లక్షల నుంచి రూ. 19.10 లక్షల మధ్య ఉంది. అదే కర్వ్.ev ధర రూ. 17.49 లక్షల నుంచి రూ. 22.24 లక్షల వరకు ఉంటుంది. ఈ SUVలో మూడు ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. టర్బో పెట్రోల్, డైరెక్ట్ ఇంజెక్షన్ పెట్రోల్, డీజిల్. ఇవన్నీ మంచి పవర్, పనితీరును అందిస్తున్నాయి. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ ఎంపికలు కూడా ఉన్నాయి.

Advertisement

ఎలక్ట్రిక్ వేరియంట్‌ లో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. 45kWh, 55kWh. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 330 నుంచి 425 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇది రోజువారీ ప్రయాణాలకు, అలాగే సుదూర ప్రయాణాలకు కూడా సరిపోతుంది.

Read Also: ఆహా ఏం అమ్మకాలు భయ్యా.. ఈవీ సేల్స్ లో పంచ్, విండ్సర్ రికార్డ్!

ఏకార్లతో పోటీ పడుతుందంటే?

ఇక మార్కెట్లో పోటీ విషయానికి వస్తే, మారుతి సుజుకి, హ్యుండాయ్ మోటార్ ఇండియా, హోండా కార్స్ ఇండియా లాంటి కంపెనీలు కూడా తమ కార్లపై ఏప్రిల్‌లో ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి. ఏప్రిల్ లో  టాటా నుంచి భారీ ఆఫర్ పొందాలనుకుంటే కర్వ్.ev బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. మంచి డిస్కౌంట్, ఆధునిక ఫీచర్లు,  ఎలక్ట్రిక్ డ్రైవింగ్ ప్రయోజనాలతో కొనుగోలుదారులను ఆకట్టుకుంటుంది.

Read Also: ఫ్యూయెల్ ఖర్చు తగ్గించుకోవాలా? ఈ ఐదు కార్లను ట్రై చేయండి!

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×