Top Selling EV Scooters Jan 2026 In India: భారతీయ టూవీలర్ మార్కెట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ల జోష్ పెరుగుతోంది. మంచి రేంజ్, సూపర్ లుక్ తో కూడిన ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లోకి రావడంతో ఎక్కువ మంది ఈవీల కొనుగోలు మొగ్గు చూపుతున్నారు. టాప్ బ్రాండ్లకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మకాల్లో సత్తా చాటుతున్నాయి. జనవరి 2026లో TVS iQube దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ గా గుర్తింపు తెచ్చుకుంది. 2025 చివరి నాటికి 8 లక్షల అమ్మకాలను దాటింది. ఈ నెలలో 30,000 యూనిట్లకు పైగా సాధించింది. మంచి గుర్తింపు, విస్తృతమైన సర్వీస్ నెట్ వర్క్ కారణంగా బజాజ్ చేతక్, ఏథర్ రిజ్టా పోటా పోటీగా అమ్మకాలు జరుపుకుంటున్నారు.
⦿ TVS iQube: ఈ స్కూటర్ డిసెంబర్ 2025లో 35,000 యూనిట్లకు పైగా అమ్మకాలతో మార్కెట్ లో సత్తా చాటింది.
⦿ బజాజ్ చేతక్: ఈ స్కూటర్ కూడా అమ్మకాల్లో మంచి దూకుడు కనబరిచింది. టీవీఎస్ తర్వాత స్థానంలో కొనసాగుతోంది. ఇంచుమించు ఈ స్కూటర్ కూడా 30 వేలకు పైగా అమ్మకాలు కొనసాగించింది.
⦿ ఏథర్ రిజ్టా: ఈ స్కూటర్ కూడా బాగా పాపులర్ అయ్యింది. దేశ వ్యాప్తంగా మంచి ప్రజాదరణ పొందింది. డిసెంబర్ 2025లో 91.6% వార్షిక వృద్ధిని నమోదు చేసింది. ఒకే నెలలో 14,282 యూనిట్లను అమ్మింది.
⦿ ఓలా ఎలక్ట్రిక్: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు కూడా అమ్మకాల్లో దుమ్మురేపుతున్నాయి. ప్రస్తుతం టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా కొనసాగుతోంది.
ఈ నాలుగు కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్ లో దూకుడు కనబరుస్తున్నాయి.
Read Also: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి క్రేజీ బైక్, ఇండియన్ మార్కెట్లోకి వచ్చేది ఎప్పుడంటే?
⦿ అమ్మకాల్లో కొత్త రికార్డు: TVS iQube డిసెంబర్ 2025 చివరి నాటికి మొత్తం అమ్మకాలు 8 లక్షల మార్క్ ను దాటింది.
⦿ మార్కెట్ లో కొత్త రికార్డులు: TVS, బజాజ్ లాంటి లెగసీ తయారీదారులు ప్రారంభ మార్కెట్ లీడర్ ఓలాను అధిగమించాయి. మంచి సర్వీస్ నెట్ వర్క్ ల కారణంగా ఈ మార్పులు చోటు చేసుకున్నాయి.
⦿ ధర & ఫీచర్లు: ఇటీవలి ధర తగ్గింపులు ₹26,000 వరకు మరియు మెరుగైన బ్యాటరీ సామర్థ్యాలు (ST వేరియంట్‌లో 5.1 kWh వరకు) డిమాండ్‌ను పెంచాయి.
⦿ పనితీరు గురించి: TVS iQube ST ఒకే ఛార్జ్ మీద ఏకంగా 150 కి.మీ ప్రయాణిస్తుంది. ఏథర్ లాంటి మోడల్స్ కూడా మంచి రేంజ్ కనబరుస్తుంది.
ఇండియాలో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఇండస్ట్రీ వేగంగా వృద్ధిని సాధిస్తోంది. 2025లో మొత్తం అమ్మకాలు దాదాపు 1.28 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయి. ఇండియాలో ఈవీ ఇండస్ట్రీ రోజు రోజుకు మరింత వృద్ధి చెందుతుందని చెప్పేందుకు ఇదో బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు.
Read Also: హోండా యాక్టివా ఇ vs సుజుకి యాక్సెస్ 125, వీటిలో ఏది బెస్ట్ అంటే?