E-Paper
Advertisement

క్రెటా To స్కార్పియో-N.. రూ.20 లక్షల్లో బెస్ట్ SUVలు ఇవే!

క్రెటా To స్కార్పియో-N.. రూ.20 లక్షల్లో బెస్ట్ SUVలు ఇవే!
Advertisement

Top SUVs Under Rs 20 Lakh 2026: SUVలకు దేశంలో డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. కారు కొనుగోలుదారులు ఇప్పుడు కేవలం మైలేజ్ మాత్రమే కాకుండా మంచి రోడ్ ప్రెజెన్స్, సేఫ్టీ, సౌకర్యం, ఫీచర్లు, పవర్‌ ఫుల్ ఇంజిన్ లాంటి అంశాలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో రూ.20 లక్షల బడ్జెట్‌లో SUV కొనాలనుకునేవారికి మార్కెట్లో చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో టాప్ మోడల్స్ గురించి ఇప్పుడు చూద్దాం..

హ్యుందాయ్ క్రెటా

మిడ్ సైజ్ SUV సెగ్మెంట్‌ లో హ్యుందాయ్ క్రెటాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మంచి డిజైన్, సౌకర్యవంతమైన క్యాబిన్, ఫీచర్లు, పలు ఇంజిన్ ఆప్షన్లతో కుటుంబ వినియోగానికి అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం క్రెటా ధర రూ.10 లక్షలకుపైగా ప్రారంభమై, కొన్ని వేరియంట్లలో రూ.20 లక్షలకు చేరుతుంది. కాబట్టి రూ.20 లక్షల బడ్జెట్‌లో కొనుగోలు చేసేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

కియా సెల్టోస్

Advertisement

స్టైలిష్ లుక్‌ తో పాటు ఫీచర్లు ఎక్కువగా కావాలనుకునేవారు కియా సెల్టోస్‌ను పరిశీలించవచ్చు. క్యాబిన్‌ లో ప్రీమియం ఫీల్, టెక్నాలజీ ఫీచర్లు,  పలు ఇంజిన్ ఆప్షన్స్, గేర్‌ బాక్స్ ఆప్షన్లు ఈ SUVకి ప్లస్ పాయింట్లు. సెల్టోస్‌లో రూ.20 లక్షల బడ్జెట్‌ కు సరిపోయే వేరియంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

టాటా హారియర్

పెద్ద SUV లుక్, విశాలమైన క్యాబిన్, హైవే ప్రయాణాల్లో మంచి స్టెబిలిటీ కోరుకునేవారికి టాటా హారియర్ బెస్ట్ ఆప్షన్. రూ.20 లక్షల పరిధిలో కొన్ని వేరియంట్లు అందుబాటులో ఉంటాయి. రోజువారీ ప్రయాణాలతో పాటు లాంగ్ డ్రైవ్‌లు చేసే కుటుంబాలకు హారియర్‌ అనుకూలంగా ఉంటుంది.

మహీంద్రా స్కార్పియో N

Advertisement

SUV అంటేనే రఫ్ అండ్ టఫ్ లుక్ గుర్తొచ్చే వారికి స్కార్పియో N ఆకట్టుకునే మోడల్. మంచి రోడ్ ప్రెజెన్స్‌ తో పాటు 6, 7 సీటింగ్ ఆప్షన్లు ఉంటుంది. కుటుంబంతో ఎక్కువగా ప్రయాణించేవారు, పెద్ద SUV కావాలనుకునేవారు ఈ మోడల్‌ను షార్ట్‌ లిస్ట్ చేసుకోవచ్చు. అయితే రూ.20 లక్షల బడ్జెట్‌ లో అన్ని వేరియంట్లు అందుబాటులో ఉండవు.

టయోటా హైరైడర్, మారుతి గ్రాండ్ విటారా

మైలేజ్, తక్కువ రన్నింగ్ కాస్ట్‌కు ప్రాధాన్యం ఇచ్చేవారికి టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా వంటి మోడళ్లను కూడా బాగుంటాయి. ముఖ్యంగా హైబ్రిడ్ ఆప్షన్ ఉన్న వేరియంట్లతో ఫ్యూయల్ ఖర్చును కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది.

మొత్తంగా ఫీచర్లు, కంఫర్ట్ కావాలంటే క్రెటా లేదంటే సెల్టోస్, పెద్ద SUV, హైవే ప్రయాణాలకు హారియర్, రఫ్ అండ్ టఫ్ SUV కావాలంటే స్కార్పియో-N, తక్కువ రన్నింగ్ కాస్ట్‌ పై ఫోకస్ పెడితే హైరైడర్ లేదంటే గ్రాండ్ విటారా లాంటి మోడళ్లను తీసుకోవచ్చు.

Read Also: పెట్రోల్ vs సీఎన్జీ.. రోజు వారీ ప్రయాణాలకు ఏ కారు బెస్ట్?

Tags

Related News

పెట్రోల్ vs సీఎన్జీ.. రోజు వారీ ప్రయాణాలకు ఏ కారు బెస్ట్?

ఈవీని ప్రతిసారి 100% ఛార్జ్ చేయడం మంచిదేనా? ఈ తప్పు అస్సలు చేయకండి!

10 ఏళ్ల తర్వాత కూడా అదిరిపోయే రీసేల్ వ్యాల్యూ.. ఈ కార్లకు ఎప్పుడూ డిమాండే!

ధర తక్కువ.. సేఫ్టీలో నో కాంప్రమైజ్.. రూ.10 లక్షల్లో బెస్ట్ 5 స్టార్ రేటింగ్ కార్లు ఇవే!

పెట్రోల్‌తో పాటు ఇథనాల్‌ తోనూ పరుగులు.. కియా సైరోస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు వచ్చేస్తోంది!

హీరో, హోండాకు టీవీఎస్ షాక్.. ఆగస్టులో నంబర్ వన్ టూ వీలర్ కంపెనీగా రికార్డ్!

కొత్త కలర్స్‌ తో కవాసకి Z సిరీస్.. నయా లుక్ సూపరో సూపరు!

Big Stories

Advertisement
×