E-Paper
Advertisement

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?
Advertisement

Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కార్యక్రమం మరికొన్ని గంటలలో ప్రసారం కాబోతోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు ఎంతో ఘనంగా ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ 10 తెలుగు (Bigg Boss 10telugu)కార్యక్రమానికి సంబంధించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే కంటెస్టెంట్లకు సంబంధించిన లిస్ట్ వైరల్ అవుతుంది. అదేవిధంగా కంటెస్టెంట్లకు సంబంధించిన ఇతర వివరాలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

కామనర్స్ కు ఫిక్స్డ్ రెమ్యూనరేషన్..

ఇకపోతే ఈసారి బిగ్ బాస్ 10 కార్యక్రమంలో పాల్గొనబోతున్న కంటెస్టెంట్లకు సంబంధించి రెమ్యూనరేషన్(Remuneration) వివరాలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా అగ్నిపరీక్ష ద్వారా కామనర్స్ ను ఎంపిక చేసే హౌస్ లోకి పంపిస్తున్న విషయం తెలిసిందే. ఇలా కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగ హౌస్ లోకి అడుగుపెడుతున్న వారికి వారానికి 70,000 చొప్పున రెమ్యూనరేషన్ అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే వారి డీలింగ్స్ అలాగే వారికి ఉన్నటువంటి క్రేజ్ దృష్టిలో పెట్టుకుని రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నారు.

వారానికి 4.25 లక్షలు..

Advertisement

ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 10 తెలుగు కార్యక్రమంలో భాగంగా అత్యధికంగా రెమ్యూనరేషన్ అందుకోబోతున్న కంటెస్టెంట్ కి సంబంధించిన వివరాలు కూడా బయటకు వచ్చాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఆటో రాంప్రసాద్ (Auto Ramprasad)అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఈయన కేవలం వారానికి 4.25 లక్షల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ సీజన్లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ బిగ్ బాస్ ఆటో రాంప్రసాద్ కు ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. ఇలా వారానికి 4.25 లక్షల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు.ఇక ఆటో రాంప్రసాద్ కు బయట విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఈయనకు ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందించబోతున్నారని తెలుస్తోంది

జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు..

Advertisement

రాంప్రసాద్ జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా పాల్గొని ఎంతో మంచి ఆదరణను సొంతం చేసుకున్నారు. ఇలా ఈ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇలా బుల్లితెర కార్యక్రమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాంప్రసాద్ సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంటూ బిజీగా ఉన్నారు. ఇక ప్రస్తుతం ప్రసారం కాబోయే బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా కూడా ఈయన ఎంట్రీ ఇవ్వబోతుండటం విశేషం.ఇక బిగ్ బాస్ 10 కార్యక్రమ విషయానికి వస్తే ఈసారి ఈ కార్యక్రమంలో 16 మంది కంటెస్టెంట్లు పాల్గొనబోతున్నట్లు తెలుస్తుంది ఎప్పటిలాగే ఈసారి కూడా బుల్లితెర సీరియల్ నటీనటులతో పాటు కమెడియన్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లూ పాల్గొనబోతున్నారు. ఇక ఈ కార్యక్రమానికి కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్న సంగతి తెలిసిందే.

Also Read: డిజాస్టర్ హీరోయిన్ తో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ… సాహసం చేస్తున్న నందమూరి హీరో?

Related News

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×