E-Paper
Advertisement

Car Overheating: సమ్మర్‌ లో కారు ఓవర్‌ హీట్ అవుతోందా? సింఫుల్ గా ఈ టిప్స్ ఫాలోకండి!

Car Overheating: సమ్మర్‌ లో కారు ఓవర్‌ హీట్ అవుతోందా? సింఫుల్ గా ఈ టిప్స్ ఫాలోకండి!
Advertisement

Essential Car Maintenance Tips: సమ్మర్ లో కారు నడిపేటప్పుడు చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్యల్లో ఒకటి ఇంజిన్ వేడెక్కడం. సాధారణంగా మన దేశంలో సమ్మర్ లో 40-45°C వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ సమయంలో కారు వినియోగదారులు ఓవర్ హీటింగ్ సమస్యను ఎదుర్కొంటారు. నిజానికి  ఇది చిన్న విషయం అనిపించినా.. పట్టించుకోకపోతే పెద్ద ఇబ్బందులకు దారితీస్తుంది.

సమ్మర్ లో ఇంజిన్ ఎందుకు ఓవర్ హీట్ అవుతుంది?

సాధారణంగా కారు ఇంజిన్ పని చేసేటప్పుడు సహజంగానే వేడి ఉత్పత్తి అవుతుంది. ఈ వేడిని కూలింగ్ సిస్టమ్ నియంత్రిస్తుంది. కూలెంట్ ఆయిల్ ఇంజిన్‌ లో తిరుగుతూ వేడిని రేడియేటర్‌ కి తీసుకెళ్లి బయటకు పంపిస్తుంది. కానీ, వేసవిలో బయట వేడి ఎక్కువగా ఉండటం, ట్రాఫిక్‌ లో ఎక్కువసేపు ఉండటం వల్ల ఈ కూలింగ్ సిస్టమ్‌పై ఒత్తిడి పెరుగుతుంది.

కూలెంట్ తక్కువగా ఉండటం!

Advertisement

ఇంజిన్ వేడెక్కడానికి ప్రధాన కారణాల్లో ఒకటి కూలెంట్ ఆయిల్ తక్కువగా ఉండటం. కూలెంట్ సరిపడా లేకపోతే వేడి బయటకు వెళ్లదు. అందుకే, అప్పుడప్పుడు కూలెంట్ లెవల్ చెక్ చేయాలి. అవసరమైతే సరైన కూలెంట్ ను ఫిల్ చేయాలి. కేవలం నీళ్లు పోయడం సరిపోదు.

రేడియేటర్ సమస్యలు!

ఇంజిన్ ఓవర్ హీటింగ్ కు మరో కారణం రేడియేటర్ సమస్యలు. రేడియేటర్‌ పై దుమ్ము, చెత్త పేరుకుపోతే గాలి సరిగ్గా వెళ్లదు. కూలింగ్ తగ్గిపోతుంది. అలాగే హోస్‌ లో లీకులు ఉన్నా కూలెంట్ బయటకు వెళ్లిపోతుంది. అందుకే, రేడియేటర్‌ను శుభ్రంగా ఉంచడం, హోస్‌ లను తరచుగా చెక్ చేయడం చాలా ముఖ్యం.

ఇంజిన్ ఆయిల్!

Advertisement

ఓవర్ హీటింగ్ సమస్యలో ఇంజిన్ ఆయిల్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కేవలం ఇంజిన్ భాగాల మధ్య ఘర్షణను తగ్గించడమే కాదు, వేడిని కూడా నియంత్రించడంలో సహాయపడుతుంది. ఆయిల్ తక్కువగా ఉన్నా,  పాతదైపోయినా ఇంజిన్ త్వరగా వేడెక్కుతుంది. అందుకే, సమయానికి ఆయిల్ మార్చడం చాలా అవసరం.

ట్రాఫిక్‌ లో ఎక్కువసేపు ఇంజిన్ ఆన్‌లో ఉంచడం

ఇంజిన్ ఓవర్ హీటింగ్ కు మరో సాధారణ కారణం ట్రాఫిక్‌ లో ఎక్కువసేపు ఇంజిన్ ఆన్‌ లో ఉంచడం. ఇది కూడా వేడి పెరగడానికి కారణం అవుతుంది. ఎక్కువసేపు ఆగాల్సి వస్తే, ఇంజిన్ ఆఫ్ చేయడం మంచిది. అదే సమయంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు టెంపరేచర్ గేజ్‌ ను గమనించడం చాలా ముఖ్యం. గేజ్ సాధారణ స్థాయికి మించి పెరిగితే వెంటనే జాగ్రత్త పడాలి. వాహనాన్ని పక్కకు ఆపి, ఇంజిన్‌ను ఆఫ్ చేయాలి. కూలింగ్ ఫ్యాన్ సరిగా ఉందో? లేదో? కూడా చెక్ చేయాలి.

కారు ఇంజిన్ ఓవర్ హీట్ అయితే ఏం చేయాలి?

ఒకవేళ ఇంజిన్ ఎక్కువగా వేడెక్కితే, వెంటనే కారు ఆపి బోనెట్ తెరవాలి. కానీ, వెంటనే రేడియేటర్ క్యాప్ తీయకూడదు. ఎందుకంటే వేడి కూలెంట్ బయటికి వచ్చి గాయాలు చేసే అవకాశం ఉంటుంది. కొంతసేపు చల్లబడిన తర్వాత మాత్రమే చెక్ చేయాలి. ఇంజిన్ వేడెక్కడం అనేది పెద్ద సమస్య కాకపోయినా, నిర్లక్ష్యం చేస్తే పెద్ద సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.

Read Also: ఎలక్ట్రిక్ కార్లలో టైర్లు త్వరగా అరిగిపోతాయా? అసలు మ్యాటర్ ఏంటంటే?

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×