E-Paper
Advertisement

Trending EV Scooters: ఓలా To టీవీఎస్.. మార్చి 2026లో టాప్ ట్రెండింగ్‌ ev స్కూటర్లు ఇవే!

Trending EV Scooters: ఓలా To టీవీఎస్.. మార్చి 2026లో టాప్ ట్రెండింగ్‌ ev స్కూటర్లు ఇవే!
Advertisement

Trending EV Scooters March 2026:  భారత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి ఎప్పటికప్పుడు సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. సరికొత్త ఫీచర్లు,  ఎక్కువ రేంజ్ ఇచ్చే మోడల్స్‌ అడుగు పెడుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ట్రెండింగ్‌ లో ఉన్న, కొత్తగా లాంచ్ అయిన EV స్కూటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మార్చి 2026లో టాప్ ట్రెండింగ్ EV స్కూటర్లు

⦿ Ola S1 Gen 3 Series: ఓలా థర్డ్ జెనరేషన్ ఈవీ స్కూటర్లను మార్కెట్లోకి తెచ్చింది. ఇవి మరింత మెరుగైన బ్యాటరీ మేనేజ్‌మెంట్, AI ఆధారిత ఫీచర్లతో అందుబాటులోకి వస్తున్నాయి. వీటి రేంజ్ సింగిల్ ఛార్జ్‌ పై సుమారు 200 కి.మీ వరకు ఉంటుంది.

Advertisement

⦿ TVS iQube కొత్త వేరియంట్: టీవీఎస్ తన iQube శ్రేణిలో కొత్త  ST  వేరియంట్లను మార్కెట్ లోకి తీసుకొచ్చింది.  బడ్జెట్ ధరలో ఉండే వెర్షన్లను వినియోగదారులకు పరిచయం చేసింది. దీని బిల్డ్ క్వాలిటీ, ఫ్యామిలీ ఫ్రెండ్లీ డిజైన్ వల్ల ఇది ఎప్పుడూ ట్రెండింగ్‌ లోనే ఉంటుంది.

⦿ ఏథర్ 450 అపెక్స్: ఏథర్ నుంచి వచ్చిన హై పెర్ఫార్మెన్స్  అపెక్స్ మోడల్‌ తో పాటు, ఫ్యామిలీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త రిజ్టా సిరీస్ ప్రస్తుతం మార్కెట్లో బాగా అమ్ముడవుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఈ బైక్ లు ట్రెండ్ అవుతున్నాయి.

Advertisement

⦿ హోండా యాక్టివా ఎలక్ట్రిక్: చాలా కాలంగా వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదరు చూస్తున్న హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వెర్షన్ 2026 ప్రారంభంలో లాంచ్ అయింది. హోండా బ్రాండ్ వ్యాల్యూ, స్వాపబుల్ బ్యాటరీ టెక్నాలజీ కారణంగా ఇది ట్రెండింగ్ లో నిలిచింది.

⦿ బజాజ్ చేతక్ ప్రీమియం: బజాజ్ కంపెనీ తన పాపులర్ మోడల్ చేతక్ ను మరింత ప్రీమియం ఫీచర్లతో తీసుకొచ్చింది. మెటల్ బాడీ, మరింత రేంజ్‌ తో అప్‌ డేట్ అయ్యింది. ఈ స్కూటర్ కూడా బాగా ట్రెండ్ అవుతోంది.

ఈ స్కూటర్లు ట్రెండ్ కావడానికి కారణాలు

⦿ ఎక్కువ మైలేజీ: ఇప్పుడు వస్తున్న స్కూటర్లు సింగిల్ ఛార్జ్‌ పై కనీసం 120 నుంచి 150 కి.మీ ప్రయాణించే అవకాశం ఉంది.

⦿ టెక్నాలజీ: గూగుల్ మ్యాప్స్ నేవిగేషన్, మ్యూజిక్ కంట్రోల్, మొబైల్ యాప్ కనెక్టివిటీ లాంటివి కామన్ అయ్యాయి.

⦿ ఛార్జింగ్ నెట్‌ వర్క్: దేశ వ్యాప్తంగా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి రావడంతో ప్రజలు వీటిపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

మొత్తంగా ఈ టాప్ 5 స్కూటర్లు మార్చి 2026లో ట్రెండింగ్ లో ఉన్నాయి. వీటిలో మీకు ఏది నచ్చిందో చెప్పండి!

Read Also: రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 కొంటున్నారా? ఈ 5 విషయాలు తెలుసుకోండి!

Related News

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

Big Stories

Advertisement
×