E-Paper
Advertisement

Child Welfare Dept: సొంత జిల్లాలో ఉద్యోగం చేసే ఛాన్స్.. మంచి వేతనం, పూర్తి వివరాలివే

Child Welfare Dept: సొంత జిల్లాలో ఉద్యోగం చేసే ఛాన్స్.. మంచి వేతనం, పూర్తి వివరాలివే
Advertisement

నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్.. చిత్తూరు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వన్ స్టాప్ సెంటర్‌ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత కలిగిన వారికి గోల్డెన్ ఛాన్స్.. సొంత జిల్లాలో ఉద్యోగం చేసుకునే అవకాశం.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు ప్రక్రియ, తదితర వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

చిత్తూరు జిల్లాలోని నిరుద్యోగ మహిళలకు, సేవా దృక్పథం ఉన్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వన్ స్టాప్ సెంటర్‌లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లా స్త్రీ శిశు సంక్షేమ సాధికారత అధికారి కార్యాలయం (DW&CW&EO) పరిధిలోని వన్ స్టాప్ సెంటర్‌లో ఒప్పంద ప్రాతిపదికన పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. మొత్తం 14 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ అయింది. బాధిత మహిళలకు తక్షణ సహాయం అందించే ఈ కేంద్రంలో వివిధ విభాగాల్లో నిపుణుల అవసరం ఉంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆఫ్‌లైన్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది.

Advertisement

పోస్టుల వివరాలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా సెంటర్ అడ్మినిస్ట్రేటర్ పోస్టు ఒకటి భర్తీ చేస్తున్నారు. పారా లీగల్ పర్సనల్ లేదా లాయర్ విభాగంలో ఒక ఖాళీ ఉంది. పారామెడికల్ పర్సనల్ అలాగే సైకో సోషల్ కౌన్సిలర్ విభాగాల్లో తలో పోస్టు కేటాయించారు. కార్యాలయ నిర్వహణ కోసం ఆఫీస్ అసిస్టెంట్ పోస్టు ఒకటి అందుబాటులో ఉంది. క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు ముగ్గురు కేస్ వర్కర్ల నియామకం చేపడుతున్నారు. వీటితో పాటు ముగ్గురు మల్టీ పర్పస్ స్టాఫ్ (హెల్పర్), ముగ్గురు సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Advertisement

విద్యార్హత:

పోస్టును బట్టి అభ్యర్థులు సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత రంగంలో కనీస పని అనుభవం తప్పనిసరి.

జీతం:

సెంటర్ అడ్మినిస్ట్రేటర్ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు రూ.34,000 వేతనం చెల్లిస్తారు. ఇతర పోస్టులకు బాధ్యతలను బట్టి రూ.13,000 నుంచి రూ.20,000 వరకు గౌరవ వేతనం ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ:

ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల విద్యార్హతలు, అనుభవం ప్రాతిపదికన షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.

ఆసక్తి గల వారు తమ ధృవపత్రాల నకళ్లతో కూడిన దరఖాస్తును చిత్తూరు కలెక్టరేట్‌లోని అంబేడ్కర్ భవనం రెండో అంతస్తులో గల జిల్లా స్త్రీ శిశు సంక్షేమ సాధికారత అధికారి కార్యాలయంలో నేరుగా అందజేయాలి.

మార్చి 9వ తేదీ సాయంత్రం లోపు దరఖాస్తులు కార్యాలయానికి చేరాల్సి ఉంటుంది. ఆలస్యంగా వచ్చే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు.

అఫీషియల్ వెబ్ సైట్: https://chittoor.ap.gov.in/

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×