E-Paper
Advertisement

Toyota Mini Land Cruiser: రగ్డ్ డిజైన్, స్మార్ట్ టెక్.. టయోటా మినీ ల్యాండ్ క్రూయిజర్ వచ్చేస్తోంది!

Toyota Mini Land Cruiser: రగ్డ్ డిజైన్, స్మార్ట్ టెక్.. టయోటా మినీ ల్యాండ్ క్రూయిజర్ వచ్చేస్తోంది!
Advertisement

Toyota Mini Land Cruiser 2026: గ్లోబల్ ఆటో మోబైల్ దిగ్గజం టయోటా సరికొత్త కార్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. అందులో భాగంగానే 2026లో టయోటా మినీ ల్యాండ్ క్రూయిజర్ ను లాంచ్ చేయబోతోంది. దీనిని అధికారికంగా ల్యాండ్ క్రూయిజర్ FJగా పిలుస్తున్నారు. టయోటా ల్యాండ్ క్రూయిజర్ సిరీస్ లో కాంపాక్ట్ మోడల్ గా వస్తుంది. రగ్డ్ ఆఫ్ రోడ్ కేపాబిలిటీని చిన్న సైజ్ లో అందిస్తుంది. ఇది అండ్వెంచరస్, డెయిలీ యూజ్ కోసం రూపొందించబడిన కాంపాక్ట్ అయినప్పటికీ 7-సీటర్ కెపాసిటీతో వస్తుంది.

ల్యాండ్ క్రూయిజర్ డిజైన్ లాగే..

టయోటా మినీ ల్యాండ్ క్రూయిజర్ ఐకానిక్ ల్యాండ్ క్రూయిజర్ లాగే డిజైన్ నుంచి ప్రేరణ పొందింది. బాక్సీ మోడల్, బోల్డ్ ఫ్రంట్ గ్రిల్ ఆకట్టుకుంటున్నాయి. LED హెడ్‌ లైట్లు, ప్రొటెక్షన్ క్లాడింగ్, పెరిగిన గ్రౌండ్ క్లియరెన్స్ దాని ఆఫ్ రోడ్ ఆకర్షణను మరంఇత పెంచనుంది. కాంపాక్ట్ సైజ్ సిటీల్లో డ్రైవ్ కు అనుగుణంగా ఉంటుంది.

7-సీట్లతో కూడిన కాంపాక్ట్ సైజు

Advertisement

మినీ ల్యాండ్ క్రూయిజర్ ఏడుగురు ప్రయాణించే సీటింగ్ కెపాసిటీని కలిగి ఉంటుంది. క్యాబిన్ లే అవుట్ ప్లేస్ మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఫస్ట్, సెకెండ్ వరుసలు మంచి లెగ్‌ స్పేస్ ను కలిగి ఉంటాయి.  మూడవ వరుస పిల్లలకు అనుగుణంగా ఉంటుంది. ఫోల్డ్ చేయగలిగే వెనుక సీట్లు కార్గో కోసం అనుగుణంగా ఉంటాయి. ఫ్యామిలీ  రోడ్ ట్రిప్‌లకు అనుగుణంగా ఉంటుంది.

స్మార్ట్ పవర్‌ ట్రెయిన్

టయోటా మినీ ల్యాండ్ క్రూయిజర్‌  మంచి ఇంజిన్ ఆప్షస్స్ తో వస్తుంది.  2.7లీటర్ పెట్రోల్ (160-163 hp), 4WD సిస్టమ్ ను కలిగి ఉంటుంది. లాడర్-ఫ్రేమ్ చాసిస్ (IMV ప్లాట్‌ఫారమ్), ఎక్సలెంట్ ఆఫ్ రోడ్ పెర్ఫార్మెన్స్ ను కలిగి ఉంటుంది. హై గ్రౌండ్ క్లియరెన్స్, మల్టీ టెర్రైన్ మోడ్స్, మాడ్యులర్ బంపర్స్ తో వస్తుంది.

స్మార్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ఇంటీరియర్

Advertisement

టయోటా మినీ ల్యాండ్ క్రూయిజర్ లేటెస్ట్ ఇంటీరియర్‌ను అందిస్తుంది. స్మార్ట్‌ ఫోన్ కనెక్టివిటీ కోసం పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ Apple CarPlay, Android Autoకి సపోర్ట్ చేస్తుంది. డిజిటల్ డ్రైవర్ డిస్‌ ప్లే స్పష్టమైన డ్రైవింగ్ సమాచారాన్ని అందిస్తుంది. వాయిస్ కమాండ్స్, నావిగేషన్ సౌలభ్యాన్ని మెరుగుపరుస్తాయి. మినీ ల్యాండ్ క్రూయిజర్‌లో సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువగా ఉంటాయి. టయోటా అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ లాంటి లేటెస్ట్ సేఫ్టీ టెక్నాలజీ వ్యవస్థను కలిగి ఉంటుంది.

ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ధర ఎంత?  

టయోటా మినీ ల్యాండ్ క్రూయిజర్ పెద్ద SUVలతో పోలిస్తే దాని సరసమైన ధరను కలిగి ఉంటుందని తెలుస్తోంది. టయోటా ఈ కాంపాక్ట్ 7-సీటర్‌ను విస్తృత శ్రేణి కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కారు జపాన్ మార్కెట్ లో 2026 మిడ్ ఇయర్ లో అందుబాటులోకి రానుంది. జపాన్ తర్వాత ఇతర దేశాల్లో అందుబాటులో ఉంటుంది. ఇండియా లాంచ్ గురించి ఎలాంటి ప్రకటన లేదు. ఇండియాలో ఈ మోడల్ లాంచ్ అయితే ఫార్చ్యూనర్ కు కంటే కాంపాక్ట్ ఆప్షన్ అవుతుంది.

Read Also: 4 ఏళ్లలో ఏకంగా 26 మోడల్స్.. 2026లో లాంచ్ కాబోయే హ్యుందాయ్ క్రేజీ కార్లు ఇవే!

Related News

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

Big Stories

Advertisement
×