హైదరాబాద్‌లో కాలుష్యం ఢిల్లీ స్థాయికి చేరుకుంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు ప్రశాంతమైన నగరంలో ఇప్పుడు శివారు ప్రాంతాల్లోనూ పొల్యూషన్ పెరిగింది. నిబంధనలు పాటించకుండా జరుగుతున్న భవన నిర్మాణాలే దీనికి ప్రధాన కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్ కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపుల వ్యవహారంపై గ్రీవెన్స్ కమిటీ విచారణ ముమ్మరం చేసింది. హాస్టల్ మెస్ ఇంచార్జ్ వినోద్ వేధింపుల ఆరోపణల నేపథ్యంలో షీ టీమ్స్, యూనివర్సిటీ గ్రీవెన్స్ కమిటీ ప్రత్యేకంగా విచారణ చేపట్టాయి. ఇందులో భాగంగా షీ టీమ్స్ అధికారులు విద్యార్థుల నుండి స్టేట్‌మెంట్స్ తీసుకున్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో మళ్లీ 13 విమానాలు రద్దు అయ్యాయి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఏడు ఫ్లైట్స్‌లో.. ఐదు ఇండిగో, రెండు ఎయిర్ ఇండియా విమానాలు రద్దు చేశారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు రావాల్సిన ఐదు ఇండిగో ఫ్లైట్స్, ఒక ఎయిర్ ఇండియా విమానం రద్దు అయ్యింది. ఢిల్లీలో వాతావరణం అనుకూలించకపోవడంతోనే రద్దు చేసినట్లు తెలిపారు ఎయిర్ లైన్స్ అధికారులు.
సీఎం చంద్రబాబు నాయుడు నేడు టీడీపీ కార్యాలయానికి రానున్నారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కమిటీలను ఆయన ఖరారు చేయనున్నారు. కమిటీల ఏర్పాటుపై పార్టీ త్రిసభ్య కమిటీతోనూ సీఎం కీలక సమావేశం నిర్వహించనున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంపై దృష్టి సారించారు. ఆయన ఆదేశాల మేరకు వార్డుల పరిధిలో కమిటీలు ఏర్పాటయ్యాయి. స్థానిక విభేదాలు, అసంతృప్తిని తగ్గించేందుకు పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
నేడు మంత్రి నారా లోకేశ్ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్ ఎడ్యుసిటీ అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. రాడిసన్ బ్లూ హోటల్ నుంచి వీటిని వర్చువల్‌గా ప్రారంభిస్తారు.
వరంగల్ జిల్లాలో పంచాయితీ ఎన్నికలు ..బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య కొట్లాట పెట్టాయి. చెన్నారావు మండలం చెరువుకొమ్ము తండాలో అర్ధరాత్రి కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. రేపు ఈ తండాలో మూడో విడత పోలింగ్ జరగనుండగా..రెండు పార్టీల కార్యకర్తలు ఒకరినొకరు కొట్టుకున్నారు. దీంతో తండాలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సోమార్‌పేట్‌లో ట్రాక్టర్ దాడి ఘటనతో 144 సెక్షన్ ఏర్పాటు చేశారు పోలీసులు. ఓడిన BRS అభ్యర్థిపై గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడు దాడి చేయడంతో..ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ దాడిలో చిన్నారి సహా ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
హయత్‌నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో MBBS స్టూడెంట్ ఐశ్యర్య మృతి చెందింది. ఈ ప్రమాదంలో ఐశ్యర్య తండ్రికి తీవ్రగాయాలై.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కూతురు చనిపోయిన విషాద ఘటనను కుటుంబ సభ్యులు తండ్రికి చెప్పలేదు. తీవ్రగాయాలు కావడంతో.. ఐశ్వర్య తండ్రికి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సర్జరీ చేశారు.
ఇవాళ విజయవాడ భవానిపురం జోజినగర్‌కు మాజీ సీఎం జగన్ రానున్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా భవానీపురం జోజినగర్‌కు చేరుకుంటారు. 42 ప్లాట్ల బాధితులతో మాట్లాడి.. కూల్చేసిన ప్లాట్స్‌ను పరిశీలిస్తారు.
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో భీమోలు అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తోంది. అటవీ ప్రాంతంలో పులి తిరుగుతున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. దీంతో గత మూడు రోజులుగా భీమోలు అడవీ ప్రాంతాన్ని ఫారెస్ట్ అధికారులు జల్లెడ పడుతున్నారు. ఆరు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయినా పులి జాడలు చిక్కకపోవడంతో మరికొన్ని ప్రదేశాల్లో కూడా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తామంటున్నారు అధికారులు.
ఏపీని చలి వణికిస్తోంది. ముఖ్యంగా ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. అల్లూరి జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలికి ఏజెన్సీ వాసులు గజగజ వణుకుతున్నారు. గత వారం రోజులుగా ఏజెన్సీలో సింగిల్ డిజిట్‌లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
బాపట్ల జిల్లా పర్చూరు మండలం ఉప్పుటూరు బ్రిడ్జిపై క్షుద్రపూజలు కలకలం రేపాయి. పర్చూరు నుంచి బాపట్ల వెళ్లే మార్గంలో దుండగులు కోడిగుడ్లు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలతో క్షుద్ర పూజలు చేశారు. పర్చూరు తహసిల్దార్ కార్యాలయం, ఐసిడిఎస్ కార్యాలయాలకు కూతవేటు దూరంలో ఈ ఘటన జరిగింది.
మెక్సికోలో సాంకేతిక సమస్య కారణంగా ఒక మినీ ఫ్లైట్ కుప్పకూలింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రయత్నం విఫలమై ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో పది మంది వ్యక్తులు మృతి చెందారు.
బ్రెజిల్‌లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. రియో గ్రాండే డో సుల్ రాష్ట్రంలో తుఫాను అతలాకుతలం చేసింది. గ్వాయిబా నగరంలో ఉన్న రిటైల్ స్టోర్ హవాన్ ముందు ఏర్పాటు చేసిన భారీ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం ఒక్కసారిగా కూలిపోయింది. భీకర గాలుల కారణంగా విగ్రహం నేలకూలింది. ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే విగ్రహం కూలిపోవడంతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. తుఫాను కారణంగా ఈ ప్రాంతంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది.
తాజాగా బెర్లిన్ వేదికగా జరిగిన చర్చలు సఫలీకృతం అయినట్లుగా తెలుస్తోంది. అమెరికా, యూరోపియన్ దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, నాటో నాయకులు, జెలెన్‌స్కీ మధ్య గంటల తరబడి చర్చలు జరిగాయి. ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ సుదీర్ఘ చర్చలు జరిపారు. ట్రంప్ ప్రతిపాదించిన ప్రతిపాదన ఆధారంగా చర్చలు జరిగాయి. మొత్తానికి సుదీర్ఘ చర్చలు విజయవంతమైనట్లుగా ట్రంప్ ప్రకటించారు.
ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండి బీచ్‌లో కాల్పులు జరిపిన ఇద్దరు ఉగ్రవాదులు పాకిస్థానీ జాతీయులని అధికారులు తెలిపారు. లాహోర్‌కు చెందిన తండ్రీకొడుకులు హనుక్కా వేడుకలు జరుపుకునేందుకు బోండి బీచ్‌లో గుమిగూడిన జనంపై ఒక్కసారిగా కాల్పులు జరపడంతో సుమారుగా 15 మంది మృతి చెందారని అధికారుల దర్యాప్తులో తేలింది.
జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేస్ పై ప్రమాదాలను నివారించేందుకు జాతీయ స్థాయిలో మార్గదర్శకాలు అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రహదారుల వెంబడి అక్రమంగా వెలుస్తున్న దాబాలు, రెస్టారెంట్ల కారణంగానే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ అంశంపై విచారణ జరుపుతున్న జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌ల ధర్మాసనం పేర్కొంది.
మార్గదర్శకాలు
భారత క్రికెట్‌లో యంగ్ సెన్సెషన్‌గా మారిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఏసీసీ పురుషుల అండర్-19 ఆసియా కప్ భారత్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్‌లో 95 బంతుల్లోనే 171 పరుగులు సాధించాడు. అందులో 14 సిక్స్‌లు, 9 ఫోర్లు ఉండటం విశేషం.
ధురంధర్ సినిమా విజయంతో ఈ ఏడాదికి ఉత్సాహంగా సెండాఫ్ చెప్పేశారు బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్. ఇప్పుడాయన మరిన్ని వైవిధ్యమైన ప్రాజెక్టులతో 2026కి స్వాగతం పలకడానికి సిద్ధమవుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో ‘ప్రలే’ అనే చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. దీనికి జై మెహతా దర్శకత్వం వహించనున్నారు.