E-Paper
Advertisement

Upcoming Hyundai Cars: 4 ఏళ్లలో ఏకంగా 26 మోడల్స్.. 2026లో లాంచ్ కాబోయే హ్యుందాయ్ క్రేజీ కార్లు ఇవే!

Upcoming Hyundai Cars: 4 ఏళ్లలో ఏకంగా 26 మోడల్స్.. 2026లో లాంచ్ కాబోయే హ్యుందాయ్ క్రేజీ కార్లు ఇవే!
Advertisement

Upcoming Hyundai Cars 2026: సౌత్ కొరియన్ ఆటో మోబైల్ కంపెనీ హ్యుందాయ్ వరుసగా మోడల్స్ ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. 2030 వరకు ఏకంగా 26 కొత్త మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. అందులో భాగంగానే 2026లో భారత మార్కెట్‌ లో హ్యుందాయ్ నుంచి లాంచ్ కానున్న కొత్త కార్లు, SUVల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. డిసెంబర్ 2025 ఆటోమోటివ్ సోర్సెస్ ప్రకారం ఈ కార్లకు సంబంధించిన ధరలు, ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

2026లో విడుదలయ్యే హ్యుందాయ్ కొత్త మోడల్స్

 

⦿ Hyundai Palisade (ఫుల్-సైజ్ 3-రో ప్రీమియం SUV)

Advertisement

ఈ కారు టయోటా ఫార్చ్యూనర్, MG గ్లోస్టర్, జీప్ మెరిడియన్ కు గట్టి పోటీ ఇవ్వబోతోంది. పనోరమిక్ సన్‌ రూఫ్, వెంటిలేటెడ్/హీటెడ్ సీట్స్, BOSE ఆడియో, అడ్వాన్స్‌డ్ ADAS, 7/8 సీటర్ ఆప్షన్స్ ను కలిగి ఉంటుంది. పెట్రోల్/డీజల్/హైబ్రిడ్ ఆప్షన్స్ తో ఇంజిన్ రాబోతోంది. అంచనా ధర రూ. 40-50 లక్షలు (ఎక్స్-షోరూమ్). 2026 ఫస్ట్ క్వార్టర్ లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

⦿ Hyundai Inster EV (సబ్-కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV)

ఈ కారు టాటా పంచ్ EV, సిట్రోయెన్ eC3కి పోటీగా రానుంది. 42-49 kWh బ్యాటరీ, 300-400 km రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్, డిజిటల్ డిస్‌ప్లే, ADAS ఫీచర్లను కలిగి ఉంది. లోకల్ ప్రొడక్షన్, బడ్జెట్ EVగా గుర్తింపు పొందనుంది. అంచనా ధర రూ. 10-15 లక్షలు. 2026 మిడ్ ఇయర్ లో లాంచ్ అవుతుంది.

⦿ Hyundai Bayon (కాంపాక్ట్ క్రాస్‌ఓవర్ SUV)

Advertisement

ఈ కారు మారుతి ఫ్రాంక్స్, టయోటా టైసర్ కు పోటీగా రానుంది. ఈ కారు కొత్త 1.2L టర్బో పెట్రోల్ (హైబ్రిడ్ రెడీ), డిజిటల్ క్లస్టర్, లార్జ్ టచ్‌స్క్రీన్, ADAS లాంటి ఫీచర్లతో రానుంది. i20 ప్లాట్‌ ఫాం బేస్డ్ గా రూపొందుతుంది. అంచనా ధర రూ.10-15 లక్షలు ఉంటుంది. 2026 మిడ్ ఇయర్ లో లాంచ్ అవుతుంది.

⦿ Hyundai Ioniq 6 (ప్రీమియం ఎలక్ట్రిక్ సెడాన్)

ఈ కారు టెస్లా మోడల్ 3కి పోటీగా రాబోతోంది. 600+ km రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్, అడ్వాన్స్‌ డ్ ఇన్ఫోటైన్‌మెంట్, ఓవర్ ది ఎయిర్ అప్‌డేట్స్ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. అంచనా ధర రూ. 50-65 లక్షలు ఉంటుంది. 2026లో లాంచ్ కానుంది.

⦿ Hyundai Tucson ఫేస్‌లిఫ్ట్ (మిడ్-సైజ్ SUV)

ఈ కారు అప్‌డేటెడ్ డిజైన్, రగ్డ్ లుక్ తో ఆకట్టుకుంటుంది. కర్వ్డ్ డిస్‌ ప్లే, మరిన్ని ఫిజికల్ బటన్స్, అడ్వాన్స్‌డ్ ADAS, పెట్రోల్/డీజల్ ఇంజన్స్ లాంటి ఫీచర్లతో వస్తుంది. అంచనా ధర రూ. 29-35 లక్షలు. 2026లో లాంచ్ అవుతుంది.

 

2026లో రాబోయే ఇతర ఫేస్‌లిఫ్ట్స్

 

⦿ Hyundai Verna ఫేస్‌లిఫ్ట్

ఫీచర్లు: కర్వ్డ్ డ్యూయల్ స్క్రీన్, అప్‌డేటెడ్ ADAS.

అంచనా ధర: రూ.11-18 లక్షలు.

⦿ Hyundai Exter ఫేస్‌లిఫ్ట్

ఫీచర్లు: 12.9-ఇంచ్ టచ్‌స్క్రీన్, Android Automotive OS.

అంచనా ధర: రూ. 6-9 లక్షలు.

⦿ Hyundai Ioniq 5 ఫేస్‌లిఫ్ట్

ఫీచర్లు: మెరుగైన బ్యాటరీ

అంచనా ధర: రూ.50 లక్షలు.

Read Also: అదిరిపోయే ఫీచర్లే, క్రేజీ లుక్.. 2026లో ఎంట్రీ ఇవ్వబోతున్న టాటా కార్లు ఇవే!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×