E-Paper
Advertisement

Toyota Urban Cruiser EV: టయోటా అర్బన్ క్రూయిజర్ EV టీజ్ వచ్చేసింది.. రేంజ్ ఎంతో తెలుసా?

Toyota Urban Cruiser EV: టయోటా అర్బన్ క్రూయిజర్ EV టీజ్ వచ్చేసింది.. రేంజ్ ఎంతో తెలుసా?
Advertisement

ప్రసిద్ధ ఆటో మోబైల్ దిగ్గజం టయోటా.. తన అర్బన్ క్రూయిజర్ EVని త్వరలో దేశీ మార్కెట్ లో లాంచ్ చేయబోతోంది. తాజాగా ఈ మోడల్ కు సంబంధించి టీజర్ ను రిలీజ్ చేసింది. ఇది ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంలో బ్రాండ్ నెక్ట్స్ జెనరేషన్ ను సూచిస్తోంది. అర్బన్ క్రూయిజర్ EV దేశంలో టయోటా మొట్టమొదటి మాస్ మార్కెట్ ఎలక్ట్రిక్ SUVగా గుర్తింపు తెచ్చుకోబోతోంది. మారుతి సుజుకి e Vitaraతో సమానంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. తాజా టీజర్ డిజైన్, పవర్‌ ట్రెయిన్ ఆప్షన్స్, పొజిషనింగ్ గురించి ఆసక్తి కలిగిస్తోంది. టయోటా అర్బన్ క్రూయిజర్ EV దేశీ మార్కెట్ లో ఎలాంటి సత్తా చాటే అవకాశం ఉందంటే..

టయోటా అర్బన్ క్రూయిజర్ EV లాంచ్ టైమ్‌

టీజర్ ప్రకారం అర్బన్ క్రూయిజర్ EV జనవరి 2026లోనే లాంచ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇది కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV విభాగంలో అడుగు పెట్టనుంది. ఎంట్రీ లెవల్ EVగా అందుబాటులోకి రానుంది. మిడ్‌ సైజ్ ఎలక్ట్రిక్ SUVలతో పోటీ పడుతుందని భావిస్తున్నారు.

టయోటా అర్బన్ క్రూయిజర్ EV డిజైన్, ప్లాట్‌ఫామ్

Advertisement

టీజర్, గ్లోబల్ ఎంట్రీ ఆధారంగా, అర్బన్ క్రూయిజర్ EV షార్ప్ LED లైటింగ్ ఎలిమెంట్స్, క్లోజ్డ్ ఆఫ్ గ్రిల్, ఎలక్ట్రిక్ వాహనాల విలక్షణమైన ఏరోడైనమిక్ డీటైల్స్ తో కూడిన క్లీన్,  స్ట్రెయిట్ టా ఉండే SUV డిజైన్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. మెరుగైన ప్యాకేజింగ్, ఫ్లాట్ ఫ్లోర్ లే అవుట్, మంచి ఇంటీరియర్ స్పేస్‌ అందించే మారుతి సుజుకి e Vitara ఎలక్ట్రిక్ SUVతో సమానమైన EV ప్లాట్‌ ఫారమ్ ను కలిగి ఉంటుందని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు.

టయోటా అర్బన్ క్రూయిజర్ EV  బ్యాటరీ, రేంజ్

టయోటా అధికారికంగా స్పెసిఫికేషన్‌లను వెల్లడించనప్పటికీ, అర్బన్ క్రూయిజర్ EV పలు బ్యాటరీ ఆప్షన్స్ ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఒక్క ఛార్జ్ మీద 400 కి.మీ రేంజ్ అందిస్తుందని అంచనా వేస్తున్నారు. పవర్‌ ట్రెయిన్ అవుట్‌ పుట్‌లు  మంచి సామర్థ్యం, సిటీ వినియోగానికి ప్రాధాన్యత ఇచ్చేలా ఉంటాయని భావిస్తున్నారు. EV ప్యాకేజీలో భాగంగా ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యం, మల్టీఫుల్ డ్రైవ్ మోడ్‌లు కూడా ఉంటాయని అంచనా వేస్తున్నారు.

టయోటా అర్బన్ క్రూయిజర్ EV  ఫీచర్లు

Advertisement

అర్బన్ క్రూయిజర్ EV పెద్ద టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీతో కూడిన ఆధునిక డాష్‌ బోర్డ్ లేఅవుట్‌ ను కలిగి ఉంటుంది. వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, టాప్ వేరియంట్‌ లో పనోరమిక్ సన్‌రూఫ్, అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌ లాంటి ఫీచర్లు ఉంటాయని భావిస్తున్నారు.

టయోటా అర్బన్ క్రూయిజర్ EV ఏ కార్లతో పోటీ పడుతుందంటే?

టయోటా అర్బన్ క్రూయిజర్ EV టాటా నెక్సాన్ EV, మహీంద్రా XUV400, XUV 3XO EV, మారుతి సుజుకి e విటారా లాంటి  ఎలక్ట్రిక్ SUVలతో పోటీపడుతుందని భావిస్తున్నారు. వేగంగా విస్తరిస్తున్న EV విభాగంలో దాని మార్కెట్ ప్రభావాన్ని నిర్ణయించడంలో ధర కీలక పాత్ర పోషిస్తుంది ఆటో నిపుణులు భావిస్తున్నారు. టయోటా బ్రాండ్ మీద భారతీయ వినియోగదారులకు ఉన్న నమ్మకం, ఈ EVకి అదనపు ప్లస్ అవుతుందని చెప్పొచ్చు.

Read Also: హోండా-సోనీ ఫస్ట్ ఎలక్ట్రిక్ SUV వచ్చేస్తోంది.. టెస్లాకు దెబ్బ తప్పదా?

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×