E-Paper
Advertisement

Toyota Price Hike: టయోటా షాక్.. ఫార్చ్యూనర్, హైరైడర్ సహా పలు కార్ల ధరలు పెంపు!

Toyota Price Hike: టయోటా షాక్..  ఫార్చ్యూనర్, హైరైడర్ సహా పలు కార్ల ధరలు పెంపు!
Advertisement

Toyota Cars New Prices Explained: ఆటో దిగ్గజం టయోటా కీలక నిర్ణయం తీసుకుంది. పలు కార్ల ధరలను తాజాగా సవరించింది. ఈ ధరల పెంపు వెంటనే అమల్లోకి వస్తుందని కంపెనీ ప్రకటించింది. ఈ జాబితాలో టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ తో పాటు ఫార్చ్యూనర్, ఇన్నోవా హైక్రాస్, ఇన్నోవా క్రిస్టా, హిలక్స్, టైసర్, ల్యాండ్ క్రూయిజర్ లాంటి మోడల్స్ ఉన్నాయి. అయితే, హైరైడర్ విషయంలో కొన్ని వేరియంట్లకు మాత్రమే ధర పెంపును అమలు చేస్తోంది.

హైరైడర్ లో ఎంపిక చేసిన వేరియంట్లు మాత్రమే

హైరైడర్‌లో ఎంపిక చేసిన వేరియంట్లపై సుమారు రూ. 5,000 వరకు ధర పెంచారు. కానీ, అన్ని వేరియంట్లపై ఈ పెంపు లేదు. కొన్ని బేస్, కొన్ని హై ఎండ్ వేరియంట్ల ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. E, S లాంటి ఎంట్రీ లెవల్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్లు, అలాగే కొన్ని CNG, హైబ్రిడ్ వేరియంట్ల ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. కొనుగోలుదారులకు కొన్ని ఆప్షన్లు ఇప్పటికీ పాత ధరలకే అందుబాటులో ఉన్నాయి. మిగిలిన వేరియంట్ల విషయానికి వస్తే, వాటి ధరలు ఒక్కో మోడల్‌పై సమానంగా రూ. 5,000 చొప్పున పెరిగాయి. అయితే, ఎంట్రీ-లెవల్, టాప్ వేరియంట్ ధరలు మారకపోవడంతో మొత్తం ధర శ్రేణి మాత్రం పెద్దగా మారలేదు. ప్రస్తుతం హైరైడర్ ధరలు రూ. 10.99 లక్షల నుంచి రూ. 20.19 లక్షల మధ్య ఉన్నాయి.

Advertisement

Read Also: అదిరిపోయే మారుతి ఇగ్నిస్‌.. మార్కెట్‌ లో ఎందుకు సక్సెస్ కాలేకపోయింది?

ఇక హైరైడర్ లో పవర్‌ ట్రెయిన్ ఎంపికలు ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. హైరైడర్‌ లో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ తో మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ, అదే ఇంజన్‌తో CNG ఆప్షన్, అలాగే స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉన్నాయి. కొంతమంది వినియోగదారుల కోసం ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉంది. పలు రకాల ఇంధన ఎంపికలతో ఈ SUV మార్కెట్లో మంచి డిమాండ్‌ ను కలిగి ఉంది.

ధరల పెంపునకు సంబంధించి కీలక ప్రకటన

Advertisement

ధరల పెంపునకు కారణాలను టయోటా వెల్లడించింది. ఉత్పత్తి ఖర్చులు, మార్కెట్ పరిస్థితులు, డిమాండ్ సప్లై సమతుల్యత లాంటి అంశాల కారణంగా ఈ ధరల పెంపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్లు వివరించింది. చిన్న మొత్తంలో పెంపు అయినప్పటికీ, కొనుగోలుదారులపై పెద్దగా ప్రభావం చూపదని తెలిపింది. టయోటా హైరైడర్ ధరలు కొద్దిగా పెరిగినా, విభిన్న ఇంజన్ ఆప్షన్లు, మంచి మైలేజ్,  బ్రాండ్ విశ్వసనీయత కారణంగా ఇంకా తన సెగ్మెంట్‌లో పోటీగా నిలుస్తోంది. కొత్త ధరలతో కూడా ఈ SUV కొనుగోలుదారులకు ఆకర్షణీయమైన ఎంపికగానే కొనసాగనుంది. మిగతా కార్లల మీద చెప్పుకోతగిన మొత్తంలో పెంపు లేదు.

Read Also: భారత్ లోకి కొత్త టెస్లా కారు, సింగిల్ ఛార్జ్ తో 681 కి.మీ రేంజ్!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×