E-Paper
Advertisement

అదిరిపోయే మారుతి ఇగ్నిస్‌.. మార్కెట్‌ లో ఎందుకు సక్సెస్ కాలేకపోయింది?

అదిరిపోయే మారుతి ఇగ్నిస్‌.. మార్కెట్‌ లో ఎందుకు సక్సెస్ కాలేకపోయింది?
Advertisement

Maruti Suzuki Ignis Discontinued: ఆటో దిగ్గజం మారుతి సుజుకి తయారు చేసిన ఇగ్నిస్ ప్రత్యేకమైన డిజైన్‌ తో మార్కెట్లోకి అడుగు పెట్టింది. విడుదలైనప్పుడు ఇది సాధారణ హ్యాచ్‌ బ్యాక్‌ లతో పోలిస్తే భిన్నంగా కనిపించింది. బాక్సీ స్టైల్, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, ప్రీమియం ఇంటీరియర్ లాంటి లక్షణాలతో యువతను ఆకర్షించేలా రూపొందించింది. దీనికంటూ ఓ ప్రత్యేకత ఉన్నప్పటికీ, పెద్దగా మాస్ మార్కెట్‌లో సక్సెస్ సాధించలేకపోయింది.

ఇగ్నిస్ ఫెయిల్యూర్ కు కారణాలేంటి?

ఇగ్నిస్‌ ను మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ లా సాధారణ కుటుంబ కారుగా డిజైన్ చేయలేదు. కొంచెం ప్రీమియం ఫీలింగ్ కలిగించేలా చిన్న క్రాసోవర్‌ గా రూపొందించబడింది. మంచి క్వాలిటీ క్యాబిన్, ప్రత్యేక డిజైన్, కంఫర్ట్ లాంటి  అంశాలు ఉన్నా, CNG ఆప్షన్ లేకపోవడం వల్ల కొంతమంది కొనుగోలుదారులను కోల్పోయింది. ముఖ్యంగా మనీ వ్యాల్యూ చూసే వినియోగదారులు వాగన్ ఆర్ లాంటి మోడళ్లను ఎంచుకున్నారు.

Advertisement

మరోవైపు ప్రీమియం హ్యాచ్‌ బ్యాక్ సెగ్మెంట్‌ లో మారుతి సుజుకి బాలెనో బలంగా నిలిచింది. దాని స్టైలింగ్, ఫీచర్లు, బ్రాండ్ ఇమేజ్ కారణంగా కొనుగోలుదారులు బాలెనో వైపు ఎక్కువగా ఆకర్షితులయ్యారు. తర్వాత మార్కెట్లోకి వచ్చిన మారుతి సుజుకి  ఫ్రాంక్స్ కూడా మంచి ఆదరణ పొందింది. ఈ నేపథ్యంలో ఇగ్నిస్ అమ్మకాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి.

కేవలం పెట్రోల్ వేరియంట్ కే పరిమితం

మొదట్లో ఇగ్నిస్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉండేది. కానీ, తర్వాత డీజిల్ వేరియంట్‌ను నిలిపివేసి, కేవలం పెట్రోల్ మోడల్‌కే పరిమితమైంది. దీని వల్ల కూడా అమ్మకాలపై ప్రభావం పడింది. ఫేస్‌లిఫ్ట్ చేసిన తర్వాత కొంతకాలం డిమాండ్ పెరిగినా, కొత్త మోడళ్ల పోటీకి తట్టుకోలేక మళ్లీ తగ్గిపోయింది.

డిజైన్ పెద్ద మైనస్

Advertisement

ఇగ్నిస్ ప్రత్యేకంగా నిలవలేకపోవడానికి ప్రధాన కారణం దాని డిజైన్. కొందరికి ఇది ఆకర్షణీయంగా కనిపించినా, చాలామందికి ఇది అసాధారణంగా అనిపించింది. ఒకవైపు తక్కువ ధరలో వ్యాగన్ ఆర్ లాంటి ప్రాక్టికల్ కార్లు ఉండగా, మరోవైపు బాలెనో లాంటి స్టైలిష్ ఆప్షన్లు ఉండటంతో ఇగ్నిస్ మధ్యలోనే నిలిచిపోయింది.

చిన్న SUV సెగ్మెంట్‌ లో కొత్త కార్లు

మారుతి సుజుకి తన భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా కొత్త మోడళ్లపై దృష్టి పెడుతోంది. ముఖ్యంగా చిన్న SUV సెగ్మెంట్‌ లో కొత్త కార్లను తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. దీంతో, ఇగ్నిస్ మోడల్‌ను త్వరలో నిలిపివేసే అవకాశం ఉందని ఆటోమొబైల్ రంగంలో చర్చ జరుగుతోంది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, మార్కెట్ ట్రెండ్ చూస్తే ఈ కారుకు గుడ్‌బై చెప్పే సమయం దగ్గరపడిందని భావిస్తున్నారు.

Read Also: కారు అమ్ముతున్నారా? ఈ 5 విషయాలు అస్సలు మర్చిపోకండి!

Related News

ఈవీ రంగంలో హీరో దూకుడు.. నంబర్ వన్ కోసం అదిరిపోయే ప్లాన్!

నల్లగొండ జిల్లాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ జోరు, ఏడాదిలో 11 వేలకు పైగా కొనుగోళ్లు!

432 కి.మీ రేంజ్.. అరగంటలో ఛార్జింగ్.. 11 వేల కి.మీ నడిపిన తర్వాత క్రెటా EV రివ్యూ!

జావా 42 బాబర్‌కు అదిరిపోయే లుక్.. ఆల్ స్టార్స్ ఎడిషన్ ఏముంది భయ్యా!

ఆగస్టులో అదరగొట్టిన టాప్ 5 కార్లు.. నంబర్ వన్‌ ఏదంటే?

టాటా ఈవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు.. హారియర్ పై ఏకంగా రూ.2.75 లక్షల తగ్గింపు!

మహీంద్రా పేరు వెనుక ఇంత పెద్ద కథ ఉందా? కంపెనీ అసలు పేరు ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

మారుతి కస్టమర్లకు షాక్.. మళ్లీ ధరలు పెంపు, ఈసారి ఎంతంటే?

Big Stories

Advertisement
×