E-Paper
Advertisement

గ్లాంజా To ఇన్నోవా హైక్రాస్.. టయోటా నుంచి రాబోతున్న 3 క్రేజీ కార్లు ఇవే!

గ్లాంజా To ఇన్నోవా హైక్రాస్.. టయోటా నుంచి రాబోతున్న 3 క్రేజీ కార్లు ఇవే!
Advertisement

Toyota Upcoming Cars 2026: భారతీయ కార్ల మార్కెట్‌పై టయోటా మరింత ఫోకస్ పెట్టింది. మరికొద్ది రోజుల్లో ఏకంగా  మూడు కీలక మోడళ్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇందులో గ్లాంజా ఫేస్‌లిఫ్ట్, ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్, నెక్స్ట్ జనరేషన్ ఫార్చ్యూనర్ ఉన్నాయి. ఈ మూడు కార్లు వేర్వేరు సెగ్మెంట్లలో కొనసాగుతున్నప్పటికీ.. కొత్త డిజైన్, క్యాబిన్ అప్‌డేట్లు, అదనపు ఫీచర్లతో మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నెక్స్ట్ జెన్ ఫార్చ్యూనర్‌ లో మాత్రం భారీ మార్పులు ఉండనున్నాయి.

కొత్త లుక్‌తో గ్లాంజా

మారుతీ సుజుకి బాలెనోకు అప్‌డేట్ రాబోతున్న నేపథ్యంలో టయోటా గ్లాంజాను కూడా కొత్త లుక్ లో తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఫేస్‌ లిఫ్ట్ గ్లాంజాలో ముందు భాగంలో కొత్త డిజైన్ గ్రిల్, క్రోమ్ ఎలిమెంట్స్ కనిపించే అవకాశం ఉంది. టయోటా లోగో స్థానంలో కూడా మార్పులు ఉండొచ్చని సమాచారం. కొత్త అల్లాయ్ వీల్స్, సన్‌రూఫ్ లాంటి ఫీచర్లు కూడా జోడించే అవకాశం ఉంది. క్యాబిన్‌లో కొత్త అప్‌హోల్స్టరీ, ట్రిమ్ మార్పులు, యాంబియంట్ లైటింగ్ లాంటి అప్‌డేట్లు రావచ్చు. అయితే, ఇంజిన్, గేర్‌బాక్స్ విషయంలో మాత్రం పెద్ద మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది.

ఇన్నోవా హైక్రాస్‌కు కొత్త టచ్

Advertisement

ఫ్యామిలీ కోసం ఎక్కువగా ఉపయోగించే ఇన్నోవా హైక్రాస్‌కు కూడా ఫేస్‌లిఫ్ట్ రాబోతోంది. ఇప్పటికే టెస్ట్ వెహికల్ భారత రోడ్లపై కనిపించింది. కొత్త హైక్రాస్ ముందు భాగం ఇటీవల వచ్చిన టయోటా హిలక్స్ డిజైన్ మాదిరిగా ఉంటుందని తెలుస్తోంది. కొత్త గ్రిల్, పెద్ద లోయర్ ఎయిర్ ఇన్‌టేక్, కొత్త అల్లాయ్ వీల్స్ లాంటి మార్పులు కనిపించవచ్చు.ఇంటీరియర్‌లో కూడా కొన్ని అప్‌డేట్లు ఉంటాయని తెలుస్తోంది. కొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పవర్డ్ ఫ్రంట్ ప్యాసింజర్ సీట్, మెరుగైన వైర్‌లెస్ ఛార్జర్ లాంటి ఫీచర్లు రావచ్చు. మెకానికల్‌గా మాత్రం పెద్ద మార్పులు ఉండకపోవచ్చని అంచనా.

2027లో నెక్స్ట్ జెన్ ఫార్చ్యూనర్

టయోటా తీసుకురాబోయే మూడు మోడళ్లలో నెక్స్ట్ జనరేషన్ ఫార్చ్యూనర్ పై ఎక్కువ ఆసక్తి ఉంది. ఈ కొత్త SUV 2027 మధ్యలో భారత్‌లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గ్లాంజా, ఇన్నోవా హైక్రాస్‌లకు కేవలం ఫేస్‌లిఫ్ట్ మాత్రమే వస్తుండగా.. ఫార్చ్యూనర్ మాత్రం పూర్తిగా కొత్త తరంగా మారనుంది. కొత్త హిలక్స్ లాంటి డిజైన్‌తో మరింత షార్ప్‌ గా కనిపించే అవకాశం ఉంది.  కొత్త ఫార్చ్యూనర్ క్యాబిన్‌లో కూడా భారీ మార్పులు ఉండొచ్చు. 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ వంటి ఫీచర్లు అందించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్, మరిన్ని USB టైప్-C పోర్టులు, డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు రావచ్చు. లేన్ డిపార్చర్ అలర్ట్, డైనమిక్ రాడార్ క్రూయిజ్ కంట్రోల్ వంటి భద్రతా ఫీచర్లను కూడా మరింత మెరుగుపరచవచ్చని తెలుస్తోంది.

Advertisement

Read Also: చిన్న EV.. పెద్ద రేంజ్.. సుజుకి e స్కై ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

Tags

Related News

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

కారులో రాకెట్ టెక్నాలజీ.. స్పేస్‌ ఎక్స్‌ తో టెస్లా కొత్త ప్రయోగం చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా XUV 3XO సరికొత్త రికార్డు.. 5 లక్షలు దాటిన సేల్స్!

మారుతి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ. 1.65 లక్షల తగ్గింపు!

హ్యుందాయ్ క్రెటా సరికొత్త రికార్డు.. 15 లక్షలు దాటిన అమ్మకాలు!

ట్రాక్షన్ కంట్రోల్, ఫాస్ట్ ఛార్జింగ్‌.. అప్ డేటెడ్ టీవీఎస్ రైడర్ లో అదిరిపోయే ఫీచర్లు!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

Big Stories

Advertisement
×