E-Paper
Advertisement

తక్కువ ప్లేస్‌లో ఇమిడిపోయే.. టాప్ వాటర్ ప్యూరిఫైయర్లు!

తక్కువ ప్లేస్‌లో ఇమిడిపోయే.. టాప్ వాటర్ ప్యూరిఫైయర్లు!
Advertisement

Best compact water purifiers for small kitchens: సొంతంగా చిన్న ఇల్లు లేదా అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారా? అయితే.. మీ కిచెన్‌లో స్పేస్ ఎంత విలువైనదో మీకు బాగా తెలుసు. వంట గదిలో మిక్సీ, గ్రైండర్, ఓవెన్ సర్దుకోవడానికే కొన్ని సార్లు స్థలం ఉండదు. అలాంటి సమయంలో పెద్ద సైజు వాటర్ ప్యూరిఫైయర్ గోడకు తగిలిస్తే.. కిచెన్ మరింత ఇరుకుగా అనిపిస్తుంది. ఈ ప్రాబ్లమ్‌కు పర్‌ఫెక్ట్ సొల్యూషన్ ‘కాంపాక్ట్ అండ్ స్లిమ్ వాటర్ ప్యూరిఫైయర్లు. ఇవి చూడటానికి స్టైలిష్‌గా ఉండటమే కాకుండా.. చాలా తక్కువ స్థలం ఆక్రమిస్తాయి. మీ కిచెన్‌ను అందంగా,ఉంచే టాప్-5 కాంపాక్ట్ వాటర్ ప్యూరిఫైయర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1.Kent Pearl Star Water Purifier:

కేటెంట్ బ్రాండ్ అనగానే.. అందరికీ నమ్మకం గుర్తుకొస్తుంది. ఈ మోడల్ అపార్ట్‌మెంట్లలో ఉండే చిన్న కిచెన్ల కోసం చాలా అద్భుతంగా డిజైన్ చేసారు. డిజిటల్ డిస్‌ప్లే, మినరల్ రిటెన్షన్ టెక్నాలజీ అంతే కాకుండా వాల్-మౌంట్ లేదా కౌంటర్‌టాప్ రెండింటికి సెట్ అయ్యే కాంపాక్ట్ డిజైన్ దీని ప్రత్యేకత. దీని ధర కూడా సుమారు రూ .16,999 వరకు ఉంటుంది. క్వాలిటీ, బ్రాండ్ కోరుకునే ఫ్యామిలీలకు ఇది పర్ఫెక్ట్.

2. Aquaguard Delight Water Purifier:

Advertisement

కిచెన్‌లో తక్కువ స్థలం ఉన్నప్పుడు కొనాల్సిన స్లిమ్ ప్యూరిఫైయర్‌లలో ఇది ఒకటి. ఇది గోడపై చాలా తక్కువ స్థలాన్ని తీసుకుంటుంది. టేస్టీ వాటర్ అందించే.. మ్యాజిక్ కార్ట్రిడ్జ్ , ఎల్ఈడీ ఇండికేటర్స్ కూడా దీనిలో ఉంటాయి. అంతే కాకుండా దీని ధర కూడా సుమారు రూ.13,499 వరకు ఉంటుంది. స్టైలిష్ లుక్, బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లు కోరుకునే వారికి ఇది బెస్ట్ మోడల్ అని చెప్పొచ్చు.

3. Eureka Forbes Purifier:

సామాన్యులకు అందుబాటు ధరలో, కాంపాక్ట్ సైజులో లభించే మరో అద్భుతమైన వాటర్ ప్యూరిఫైయర్ ఇది. వివిధ రకాల నీటిని సమర్థవంతంగా ఈ ఫ్యూరిఫైయర్ శుద్ధి చేస్తుంది. దీని డిజైన్ కూడా చాలా కాంపాక్ట్‌గా ఉంటుంది. అంతే కాకుండా దీని ధర సుమారు రూ.9,999 వరకూ ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో చిన్న కిచెన్ కోసం ప్యూరిఫైయర్ వెతుకుతున్న వారికి ఇది చక్కటి ఆప్షన్.

4. LG PuriCare Water Purifier:

Advertisement

ఎల్‌జీ బ్రాండ్ నుంచి వచ్చిన ఈ ప్యూరిఫైయర్ దాని అల్ట్రా-స్లిమ్ డిజైన్‌కు పేరుగాంచింది. కిచెన్ కౌంటర్‌ టాప్‌పై లేదా గోడపై ఎక్కడైనా ఇది చక్కగా ఇమిడిపోతుంది. 100% స్టేన్‌లెస్ స్టీల్ వాటర్ ట్యాంక్, డిజిటల్ శానిటైజేషన్, రొటేటింగ్ ట్యాప్ దీని ప్రత్యేకతలు. అంతే కాకుండా దీని ధర సుమారు రూ.21,990 వరకూ ఉంటుంది.
ప్రీమియం లుక్, హైజీన్, మోడ్రన్ కిచెన్ కోరుకునే వారికి ఇది సూపర్ ఛాయిస్ అని చెప్పొచ్చు.

Also Read: రూ.7890కే 7 కేజీ వాషింగ్ మెషీన్..డోంట్ మిస్

5. Livpure Bolt Star CopperInfusion:

లిప్‌బూర్ నుంచి వచ్చిన ఈ కాంపాక్ట్ మోడల్ ఆరోగ్యానికి కాపర్ ను కలిపి అందిస్తుంది. కాపర్ మినరల్ కార్ట్రిడ్జ్, అడ్వాన్స్డ్ 7-స్టేజ్ ప్యూరిఫికేషన్, స్పేస్ సేవింగ్ డిజైన్ దీని సొంతం.
దీని ధర సుమారు. రూ. 10,499 వరకూ ఉంటుంది. ఆరోగ్య స్పృహ ఎక్కువై..తక్కువ స్థలంలో పట్టే ప్యూరిఫైయర్ కావాలనుకునే వారికి బెస్ట్.

ప్యూరిఫైయర్ కొనేటప్పుడు ఈ టిప్స్ పాటించండి:

మౌంటింగ్ ఆప్షన్: గోడకు తగిలించుకోవడానికివీలుండేలా చూస్తే కిచెన్ కౌంటర్ ఖాళీగా ఉంటుంది.

ట్యాంక్ కెపాసిటీ: చిన్న ఫ్యామిలీ అయితే 6 నుంచి 7 లీటర్ల ట్యాంక్ సరిపోతుంది.

మెయింటెనెన్స్: ఫిల్టర్ మార్చడం ఈజీగా ఉండే బ్రాండ్లను ఎంచుకోండి.

Tags

Related News

ఖరీదైన టీవీ ఇప్పుడు తక్కువ ధరలో..ఈ సూపర్ డీల్ మిస్ కావద్దు!

హోటళ్లు,ఫుడ్ బిజినెస్ కోసం బెస్ట్ డీప్ ఫ్రీజర్లు..ఇప్పుడు డిస్కౌంట్‌లోనే!

ఇంట్లో తేమతో విసిగిపోయారా? ఈ డిహ్యూమిడిఫైయర్లపై ఓ లుక్కేయండి

రూ.1037కే మిక్సీ గ్రైండరా? ఫ్లిప్‌కార్ట్ ఇస్తున్న ఈ క్రేజీ ఆఫర్ అసలు మిస్ కావద్దు!

క్షణాల్లోనే ఈజీగా కేకులు,పిజ్జాలు రెడీ.. పిజియన్ ఓటీజీ స్పెషల్స్ ఇవే!

రూ.7890కే 7 కేజీ వాషింగ్ మెషీన్..డోంట్ మిస్

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్..ఫాస్ట్‌ట్రాక్ ఆప్టిమస్ ప్రో స్పెషల్స్ ఇవే!

Big Stories

Advertisement
×