E-Paper
Advertisement

చిన్న EV.. పెద్ద రేంజ్.. సుజుకి e స్కై ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

చిన్న EV.. పెద్ద రేంజ్.. సుజుకి e స్కై ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
Advertisement

Suzuki New Compact EV e-Sky: ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో రోజుకో కొత్త మోడల్ పరిచయం అవుతోంది. ఈ నేపథ్యంలో  సుజుకి అదిరిపోయే చిన్న ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. e స్కై పేరుతో ఈ కాంపాక్ట్ EVని ఆవిష్కరించింది. చిన్న సైజులో ఉన్నప్పటికీ సూపర్ రేంజ్‌ను అందిస్తోంది. తక్కువ బరువు, మంచి రేంజ్‌ తో పాటు అత్యాధునిక ఫీచర్లను కూడా ఇందులో అందించారు.

బరువు కేవలం 1,030 కిలోలు

సుజుకి e స్కై బరువు కేవలం 1,030 కిలోలు. సాధారణంగా ఎలక్ట్రిక్ కార్లలో బ్యాటరీ కారణంగా బరువు ఎక్కువగా ఉంటుంది. అయితే, ఈ కారును మాత్రం కాంపాక్ట్‌ గా, తక్కువ బరువుతో రూపొందించారు. చిన్న సైజు కారణంగా సిటీల్లో  డ్రైవింగ్ చేయడానికి ఈ కారు అనుకూలంగా ఉంటుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సులభంగా నడపడం, పార్కింగ్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది.

ఒక్క ఛార్జ్‌ తో 310 కి.మీ రేంజ్

Advertisement

e స్కైలో ఆకట్టుకునే అంశం రేంజ్. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 310 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని సుజుకి వెల్లడించింది. రోజువారీ అవసరాలకు, ముఖ్యంగా నగర ప్రయాణాలకు ఈ రేంజ్ అనుకూలంగా ఉంటుంది.

సూపర్ ఫీచర్లు

కారు చిన్నదే అయినా ఫీచర్ల విషయంలో మాత్రం సుజుకి ఎక్కడా తగ్గలేదు. ఇందులో 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ అందించారు. పెద్ద స్క్రీన్ కారణంగా ఇన్ఫోటైన్‌మెంట్, ఇతర కంట్రోల్స్‌ ను ఈజీగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. చిన్న కారు అయినప్పటికీ అత్యాధునిక ఇంటీరియర్, టెక్నాలజీ ఫీచర్లను అందించడం ద్వారా యంగ్ కస్టమర్లను ఆకర్షించేలా e స్కైని రూపొందించినట్లు తెలుస్తోంది

V2L ఫీచర్ కూడా..

Advertisement

ఈ చిన్న EVలో మరో ఆసక్తికరమైన ఫీచర్ V2L సామర్థ్యం. దీని ద్వారా కారు బ్యాటరీలో నిల్వ ఉన్న విద్యుత్‌ను ఇతర ఎలక్ట్రిక్ పరికరాలకు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అవసరమైన సమయంలో కారు బ్యాటరీని పవర్ సోర్స్‌ గా ఉపయోగించుకోవడం ఈ ఫీచర్ ప్రత్యేకత. దీంతో e స్కై కేవలం ప్రయాణానికి ఉపయోగించే వెహికల్ మాత్రమే కాకుండా.. అవసరమైనప్పుడు అదనపు పవర్ సోర్స్‌ గా కూడా ఉపయోగపడే అవకాశం ఉంది.

భారత్‌లోకి వస్తుందా?

ప్రస్తుతం సుజుకి e స్కైను జపాన్ మార్కెట్ కోసం దీనిని రూపొందించింది. భారత్‌లో ఈ చిన్న ఎలక్ట్రిక్ కారును విడుదల చేస్తారా? లేదా? అన్నది ఇంకా స్పష్టత లేదు. మన దేశంలో కాంపాక్ట్, సరసమైన ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో e స్కై ఇక్కడికి వస్తే మంచి ఆదరణ దక్కే అవకాశం ఉంటుంది. అయితే, భారత మార్కెట్‌లో విడుదలపై సుజుకి నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read Also: సింగిల్ ఛార్జ్‌ తో 301 కి.మీ రేంజ్.. ఓలా S1Z స్కూటర్ వచ్చేసింది!

Tags

Related News

మారుతి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ. 1.65 లక్షల తగ్గింపు!

హ్యుందాయ్ క్రెటా సరికొత్త రికార్డు.. 15 లక్షలు దాటిన అమ్మకాలు!

ట్రాక్షన్ కంట్రోల్, ఫాస్ట్ ఛార్జింగ్‌.. అప్ డేటెడ్ టీవీఎస్ రైడర్ లో అదిరిపోయే ఫీచర్లు!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

హ్యుందాయ్ బేయాన్ N లైన్ వచ్చేసింది.. టర్బో పెట్రోల్‌తో పాటు హైబ్రిడ్ ఆప్షన్ కూడా!

డెంజా D9 ఇండియన్ లాంచ్‌కు రెడీ.. ధర ఎంతో తెలుసా?

కవాసకి వెర్సిస్ 900 వచ్చేసింది, భారత్‌లోకి ఎంట్రీ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×