E-Paper
Advertisement

KTM 990 RC R: సరికొత్త బైక్ ను లాంచ్ చేసిన KTM, ఇండియాలోకి అడుగు పెట్టేనా?

KTM 990 RC R: సరికొత్త బైక్ ను లాంచ్ చేసిన KTM, ఇండియాలోకి అడుగు పెట్టేనా?

KTM 990 RC R Track Launch: ఆస్ట్రియన్ ఆటోమేకర్ KTM తాజాగా  990 RC R బైక్ ను ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ చేసింది. దీనిని ట్రాక్ ఓన్లీ వెర్షన్‌ గా మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ట్రాక్ యూజ్ కోసం ప్రత్యేకంగా రూపొందించింది. ఈ నాన్ రోడ్ లీగల్ బైక్, కేవలం రేసింగ్ కోసమే తయారు చేసింది. 990 RC R ట్రాక్ స్ట్రీట్ లీగల్ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. కానీ, ట్రాక్‌ కు అవసరమైన మెకానికల్, ఎలక్ట్రానిక్ భాగాలను కలిగి ఉంటుంది.

KTM 990 RC R ట్రాక్ ఇంజిన్

KTM 990 RC R ట్రాక్ వెర్షన్ 947cc సమాంతర ట్విన్ DOHC LC8c ఇంజిన్‌తో వస్తుంది. ఇది 10,000 rpm దగ్గర 133.18 bhp పవర్, 7,000 rpm దగ్గర 105 Nm గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. అదే స్ట్రీట్ లీగల్ KTM 990 RC R 128 bhp, 103 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది.  బైక్‌లో స్టెయిన్‌ లెస్ స్టీల్ అక్రాపోవిక్ ఎగ్జాస్ట్ సిస్టమ్ అమర్చబడింది. ఇది 3 కిలోల బరువు ఉంటుంది. 98.2 Db సౌండ్ ను ప్రొడ్యూస్ చేస్తుంది.

KTM 990 RC R ట్రాక్ రైడర్ ఛాసిస్

KTM 990 RC R ట్రాక్ స్ట్రీట్ లీగల్ 990 RC R లాగానే క్రోమియం మాలిబ్డినం స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్ ఛాసిస్‌ను కలిగి ఉంది. అంతే కాదు, దీనికి అల్యూమినియం సబ్‌ ఫ్రేమ్ కూడా ఉంది. ఇది బైక్ బరువును 181 కిలోలకు తగ్గించడంలో సహాయపడుతుంది. బైక్ హెడ్‌లైట్లు, ABS మాడ్యులేటర్, మిర్రర్స్, సైడ్ స్టాండ్‌తో సహా రోడ్డుపై ఉపయోగించడానికి అవసరమైన భాగాలను తొలగిస్తారు. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం 15.7 లీటర్లు ఉంటుంది.  KTM 990 RC R ట్రాక్ 4.2-అంగుళాల TFT డిస్ ప్లేతో అమర్చబడి ఉంది. ఇది ల్యాప్ టైమింగ్స్ ను కలిగి ఉంటుంది. ట్రాక్‌ పై ప్రయాణించేటప్పుడు అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. ముఖ్యంగా  బైక్ స్ట్రీట్ లీగల్ వెర్షన్‌ తో పోలిస్తే 2 కిలోల బరువు తక్కువగా ఉంటుంది.

KTM 990 RC R ట్రాక్ రైడ్ మోడ్స్, సస్పెన్షన్

KTM 990 RC R మూడు ట్రాక్ మోడ్‌లను కలిగి ఉంది, రైడర్స్ ట్రాక్షన్ కంట్రోల్, యాంటీ స్లిప్ కంట్రోల్, థ్రోటిల్ రెస్పాన్స్ తో వస్తుంది. వీలీ కంట్రోల్, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్‌ ను సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ బైక్ ఫోర్ పిస్టన్ కాలిపర్లతో 320 mm బ్రెంబో హైప్యూర్ ఫ్రంట్ డిస్క్‌ లతో అమర్చబడి ఉంటుంది.  వెనుక భాగంలో 240 mm డిస్క్ ఉంటుంది. 990 RC R ట్రాక్ రెండు చివర్లలో పూర్తిగా సర్దుబాటు చేసే WP అపెక్స్ సస్పెన్షన్‌ ను కలిగి ఉంది.

ఇండియాలోకి వస్తుందా?

ఈ బైక్ ప్రయాణాల కోసం ఉపయోగించేది కాదు. సో, మన దేశంలోకి వస్తే ట్రాక్ వినియోగానికి పరిమితం అవుతుంది. ఇండియాలోకి వస్తుందా? లేదా? అనేది త్వరలో కంపెనీ వెల్లడించనుంది.

Read Also: అమ్మకాల్లో హోండా యాక్టివా నయా రికార్డు, ఒకే రాష్ట్రంలో 50 లక్షల యూనిట్లు సేల్!

Related News

ఇండియన్ మార్కెట్ లోకి యమహా NMax 155 ఎంట్రీ, ఫీచర్లు చూస్తే షాక్!

టీవీఎస్, బజాజ్ జోరు.. ఓలా బేజారు.. ఈవీ స్కూటర్ అమ్మకాల్లో టాప్ 5 మోడల్స్ ఇవే!

ఒకే ఇంజిన్.. రెండు బైక్స్.. బుల్లెట్ 650 vs క్లాసిక్ 650 డిఫరెన్స్ ఇవే!

అవెంజర్ లవర్స్ కు గుడ్ న్యూస్.. రెండు రంగుల్లో స్ట్రీట్ 220 మళ్లీ ఎంట్రీ!

95 కి.మీ క్లెయిమ్.. కానీ, నిజంగా ఇ-యాక్సెస్ ఇచ్చిన రేంజ్ ఎంతో తెలుసా?

టాటా మోటార్స్ మాస్టర్ ప్లాన్.. అవిన్యా X లాంచింగ్ డేట్ ఫిక్స్!

మహీంద్రాను దాటేసిన టాటా.. మే 2026 ఈవీ అమ్మకాల్లో సరికొత్త రికార్డు!

పెట్రోల్‌ తో పాటు ఇథనాల్‌ తోనూ పరుగులు.. కొత్త వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్‌ ప్రత్యేకతలు ఇవే!

Big Stories

×