E-Paper
Advertisement

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసు.. న్యాయస్థానం క్లీన్ చిట్, కవిత ఫస్ట్ రియాక్షన్

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసు.. న్యాయస్థానం క్లీన్ చిట్, కవిత ఫస్ట్ రియాక్షన్
Advertisement

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు న్యాయస్థానంలో బిగ్ రిలీఫ్ లభించింది. ఆమెపై సీబీఐ దాఖలు చేసిన అభియోగాలకు తగిన ఆధారాలు లేవని తేల్చేసింది. ఈ మేరకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఈ కేసు నుండి ఆమెని డిశ్చార్జ్ చేసింది. దీంతో తెలంగాణ జాగృతి నేతలు పెద్ద ఊరట లభించింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు

Advertisement

న్యాయస్థానం తీర్పు తర్వాత హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు కవిత. తెలంగాణ ప్రజలకు తాను మొదటి నుంచి చెబుతున్నానని, కడిగిన ముత్యం వల్లే బయటకు వస్తానని అప్పుడే చెప్పానన్నారు. న్యాయవ్యవస్థపై తాను పెట్టుకున్న నమ్మకం నిలబడిందన్నారు. ఇది కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసని ఎన్నోసార్లు చెప్పానని వివరించారు. ఈ కేసు వల్ల తాను.. నా కుటుంబం కొన్ని నెలలపాటు క్షోభ అనుభవించామని పేర్కొన్నారు.

కష్ట సమయంలో అండగా నిలిచినవారికి ధన్యవాదాలు తెలిపారు కవిత. మరింత ఉత్సాహంతో ప్రజలకు మరింత సేవ చేస్తాన్నారు. నా కుటుంబానికి దూరమై ఐదు నెలలు జైలులో గడిపిన సమయాన్ని ఎవరు తిరిగిస్తారని ప్రశ్నించారు. కోర్టు తీర్పు రాకుండానే కొందరు తనపై అనుచితంగా మాట్లాడారని వ్యాఖ్యానించారు.

Advertisement

23 మంది నిందితులకు న్యాయస్థానం క్లీన్ చిట్, కవిత ఫస్ట్ రియాక్షన్

ఢిల్లీ మద్యం పాలసీ కేసు వ్యవహారం.. ఢిల్లీతోపాటు తెలంగాణను ఓ కుదుపు కుదిపేసింది.  గత అసెంబ్లీ ఎన్నికల ముందు కల్వకుంట్ల కవిత అరెస్టు చేశారు సీబీఐ, ఈడీ అధికారులు. హైదరాబాద్ నేరుగా ఢిల్లీకి ఆమెని తరలించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా దాదాపు 160 రోజుల పాటు తీహార్ జైలులో ఉన్నారు. ఆ తర్వాత పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నాలు చేశారు.

ఛార్జీషీట్లు పూర్తి కావడంతో ఆ తర్వాత ఆమెకి బెయిల్ వచ్చింది. ఈ కేసులో శుక్రవారం ఢిల్లీలోని రౌస్‌ ఎవెన్యూ కోర్టు విచారణ జరిగింది. సరైన ఆధారాలు లేని కారణంగా ఆమెతోపాటు పలువురు ఏఏపీ నేతలకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ మేరకు ప్రత్యేక న్యాయమూర్తి జితేందర్ సింగ్ తీర్పు వెల్లడించారు. ఈ కేసులో 23 మంది నిందితులకు విముక్తి కలిగింది.

ALSO READ: సరిహద్దుల్లో ఉన్న దేవాదాయ భూమి పై సర్కార్ కీలక నిర్ణయం

కవితతోపాటు మాజీ ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నేత మనీష్ సిసోడియాలకు ఊరట లభించింది.  తీర్పు సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. సీబీఐ దర్యాప్తులో తీవ్రమైన లోపాలు ఉన్నాయని వ్యాఖ్యానించింది. వేలాది పేజీల చార్జ్‌షీట్‌లో సాక్ష్యాలకు మద్దతు లేని అంశాలున్నాయని పేర్కొంది.

మనీష్ సిసోడియా, కేజ్రీవాల్‌పై సరైన ఆధారాలు లేకుండా కేసులో ఇరికించారని అభిప్రాయపడింది. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం చట్టపరంగా సరైంది కాదని పేర్కొంది. ప్రధాన నిందితుడు కుల్దీప్‌సింగ్‌పై ఎలాంటి ఆధారాలు లేవని తేల్చేసింది.  సీబీఐ దర్యాప్తు అధికారిపై శాఖాపరమైన విచారణకు న్యాయస్థానం ఆదేశించింది.

Related News

సెక్రటేరియట్ భద్రత అధికారులకు మంత్రి మాస్ వార్నింగ్.. మళ్లీ రిపీట్ కావొద్దంటూ ఫైర్!

ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతులకు.. తెలంగాణ సర్కార్ షాకింగ్ న్యూస్..!

కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనపై కేటీఆర్ విసుర్లు, జెన్ జీ పేరు ప్రస్తావిస్తూ, ట్రోల్ చేయకుండా

తెలంగాణలో 1000 రోజుల పాలన.. సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ పోస్ట్, ప్రయాణంలో తోడుగా నిలిచిన..

తెలంగాణ రాజకీయాల్లో డిజిటల్ వార్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐ పోస్టర్లు, ఇవే రాజకీయాలంటూ ప్రజల చర్చ

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

Big Stories

Advertisement
×