E-Paper
Advertisement

6.6 సెకన్లలో 100 కిమీ స్పీడ్.. స్పోర్టీ లుక్‌ లో మినీ కూపర్ కొత్త ఎడిషన్ అదిరింది!

6.6 సెకన్లలో 100 కిమీ స్పీడ్.. స్పోర్టీ లుక్‌ లో మినీ కూపర్ కొత్త ఎడిషన్ అదిరింది!
Advertisement

Mini Cooper S GP Inspired Edition Launched: లగ్జరీ కార్ లవర్స్ కు గుడ్ న్యూస్.  భారతీయ మార్కెట్లోకి మినీ కూపర్ ఎస్ జీపీ ఇన్‌స్పైర్డ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ ప్రత్యేక హాట్ హ్యాచ్ ధర రూ. 58.90 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే CBU మోడల్‌ గా ఈ కారును తీసుకొచ్చింది. ఈ ఎడిషన్‌ ను కేవలం 30 యూనిట్లకే పరిమితం చేసింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్నడీలర్‌షిప్‌ లలో బుకింగ్‌ లు ప్రారంభమయ్యాయి. కంపెనీ వెంటనే డెలివరీలు కూడా ఇవ్వడం ప్రారంభించింది.

JCW GPకు నివాళిగా..

ఈ కారును మినీ కంపెనీ అత్యంత పవర్‌ ఫుల్ మోడల్ అయిన JCW GPకు నివాళిగా రూపొందించినట్లు తెలిపింది. లిమిటెడ్ ఎడిషన్ కావడంతో ఇది కలెక్టర్స్, ప్రీమియం కార్ల అభిమానులను ఆకట్టుకునే అవకాశముంది.

ఆకట్టుకునేలా డిజైన్

Advertisement

డిజైన్ పరంగా ఈ కారు చాలా స్పోర్టీగా కనిపిస్తుంది. లెజెండ్ గ్రే కలర్‌ తో పాటు చిల్లీ రెడ్ యాక్సెంట్స్ ప్రత్యేక లుక్‌ ను ఇస్తున్నాయి. 18 అంగుళాల JCW అల్లాయ్ వీల్స్, GP స్టైల్ డెకాల్స్,  వెనుక భాగంలో స్పోర్టీ స్పాయిలర్ ఈ కారును మరింత అగ్రెసివ్‌గా చూపిస్తున్నాయి. అలాగే  1/30  అనే స్పెషల్ బ్యాడ్జింగ్ కూడా ఉంది. అంటే, మొత్తం 30 కార్లలో ఇది ఏ నంబర్ మోడల్ అన్న విషయం తెలుస్తుంది.  లైటింగ్ సెటప్ కూడా చాలా బాగుంది. ఇందులో LED హెడ్‌ ల్యాంప్స్, కొత్త మ్యాట్రిక్స్ టెయిల్ ల్యాంప్స్, స్పెషల్ వెల్కమ్ లైటింగ్ ఫంక్షన్లను అందించారు. రాత్రి సమయంలో ఈ కారు మరింత అందంగా  కనిపించేలా డిజైన్ చేశారు.

ప్రీమియం ఇంటీరియర్

ఇంటీరియర్‌ లో కూడా కంపెనీ స్పోర్టీ ఫీల్ ఇచ్చే ప్రయత్నం చేసింది. JCW స్పోర్ట్ సీట్లు, కొత్త స్టీరింగ్ వీల్, ప్యాడిల్ షిఫ్టర్లు,  ప్రత్యేక డోర్ సిల్స్ ఇందులో ఉన్నాయి. లోపల ఉపయోగించిన మెటీరియల్స్‌ పర్యావరణ అనుకూలంగా ఉంటాయని కంపెనీ వెల్లడించింది. రీసైకిల్ చేసిన టెక్స్‌ టైల్ మెటీరియల్స్‌ ను ఉపయోగించినట్లు తెలిపింది.

అత్యాధునిక టెక్నాలజీ

Advertisement

టెక్నాలజీ పరంగా కూడా ఈ కారు చాలా ఆధునికంగా ఉంది. ఇందులో 240 mm OLED టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్‌ ను అందించారు. వైర్‌ లెస్ ఆపిల్ కార్‌ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, హార్మన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, హెడ్ అప్ డిస్‌ ప్లే, నావిగేషన్, వాయిస్ కంట్రోల్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్‌ ఫోన్ ద్వారా కారును అన్‌ లాక్ చేసే డిజిటల్ కీ ఫీచర్ కూడా అందించారు.

ఇంజిన్ గురించి..

ఈ కారులో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 204 హెచ్‌పీ పవర్, 300 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. 7-స్పీడ్ డీసీటీ గేర్‌ బాక్స్‌ తో వచ్చే ఈ కారు కేవలం 6.6 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా గంటకు 242 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో 6 ఎయిర్‌ బ్యాగ్‌ లు, ABS, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ వ్యూ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాదు, క్రూయిజ్ కంట్రోల్, పార్కింగ్ అసిస్టెంట్ లాంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

Read Also: హోండా ZR-V టీజర్ విడుదల.. స్పోర్టీ డిజైన్‌, కళ్లు చెదిరే ఫీచర్లు!

Related News

432 కి.మీ రేంజ్.. అరగంటలో ఛార్జింగ్.. 11 వేల కి.మీ నడిపిన తర్వాత క్రెటా EV రివ్యూ!

జావా 42 బాబర్‌కు అదిరిపోయే లుక్.. ఆల్ స్టార్స్ ఎడిషన్ ఏముంది భయ్యా!

ఆగస్టులో అదరగొట్టిన టాప్ 5 కార్లు.. నంబర్ వన్‌ ఏదంటే?

టాటా ఈవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు.. హారియర్ పై ఏకంగా రూ.2.75 లక్షల తగ్గింపు!

మహీంద్రా పేరు వెనుక ఇంత పెద్ద కథ ఉందా? కంపెనీ అసలు పేరు ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

మారుతి కస్టమర్లకు షాక్.. మళ్లీ ధరలు పెంపు, ఈసారి ఎంతంటే?

కార్నివాల్ హైబ్రిడ్ To న్యూ సోనెట్.. కియా నుంచి రాబోతున్న 10 క్రేజీ కార్లు ఇవే!

కొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లు.. బాలెనో ఫేస్‌లిఫ్ట్ ఏముంది గురూ!

Big Stories

Advertisement
×