CM Chandrababu: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో కొందరి పనితీరుపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారంట. కలెక్టర్లు బాగా పనిచేస్తున్నారని అనుకుంటున్నారని .. కానీ అవుట్‌పుట్ రావడం లేదని.. దాంతో అధికారుల పనితీరు ప్రజలకు నచ్చడం లేదని సీఎం ఒకింత సీరియస్ అయ్యారంట. ఎవరి కోసం పని చేస్తున్నామో… వాళ్లకే మనం నచ్చకపోతే.. సంథింగ్ ఏదో ఉందని.. దానిపై ఆత్మపరిశీలన చేసుకోవాలని దిశానిర్ధేశం చేశారంట… ఒక డిపార్ట్‌మెంట్‌లో అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉందని.. మరో డిపార్ట్‌మెంట్ ఇంకా పికప్ కాలేదన్న చంద్రబాబు.. ప్రతి ఒక్క సిటిజన్ వివరాలు ఆన్‌లైన్ కావాలని ఆదేశించారంట. ఆ క్రమంలో హార్డ్ వర్క్ కాదు.. స్మార్ట్ వర్క్ కావాలని గైడ్ చేశారంట.. చంద్రబాబు పారదర్శకంగా అధికారులతో ముఖాముఖీ తన అభిప్రాయాలు వెల్లడిస్తుంటే… వైసీపీ నేతలు దానిపై విమర్శలు గుప్పిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ యంత్రాంగం శ్రమిస్తున్నప్పటికీ, ప్రజలు ప్రభుత్వ పనితీరును మెచ్చుకోవడం లేదని ఆయన స్పష్టంగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని పరోక్షంగా అంగీకరిస్తూ, ఇది ప్రభుత్వానికి హెచ్చరికగా భావించాలని అధికారులకు సూచించారు.
“మీరు బాగా చేశామని అనుకుంటున్నారు, నేనూ అలాగే అనుకుంటున్నాను. కానీ ఎండ్ అవుట్‌కమ్ కనిపించడం లేదు. ప్రజలు మన పనితీరును మెచ్చడం లేదు. మనం ఏ స్టేక్‌హోల్డర్స్ కోసం పనిచేశామో వాళ్లే సంతృప్తి వ్యక్తం చేయకపోతే, ఎక్కడో లోపం ఉన్నట్టే” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రభుత్వ పనితీరు బాగాలేదని ప్రభుత్వాధినేత అంగీకరించడం సంచలనంగా మారింది. 18 నెలల పరిపాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తి ఉన్నట్లుగా సీఎం స్పష్టం చేయడం చర్చనీయాంశంగా మారింది.
కొన్ని శాఖలు అద్భుతంగా పనిచేస్తున్నాయని, అయితే మరికొన్ని శాఖలు ఇంకా పుంజుకోలేదని సీఎం మరో కీలక వ్యాఖ్య చేశారు. శాఖల మధ్య పనితీరు తేడాలు ప్రభుత్వానికి సమస్యగా మారుతున్నాయని చెప్పారు. ఈ పరిస్థితిని సరిదిద్దాలంటే సమన్వయం, బాధ్యత పెరగాల్సిన అవసరం ఉందని అధికారులను హెచ్చరించారు.
ఇకపై ప్రభుత్వం డేటా డ్రివన్ డెసిషన్ మేకింగ్ గవర్నెన్స్ వైపు అడుగులు వేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. అందులో భాగంగా తాను వ్యక్తిగతంగా ప్రతి వారం నాలుగు గంటల పాటు డేటాను అధ్యయనం చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నానని తెలిపారు. భావోద్వేగాలతో కాకుండా గణాంకాలు, ఫలితాల ఆధారంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడే ప్రజల నుంచి ప్రభుత్వానికి మార్కులు పడతాయని సీఎం చంద్రబాబు చెప్పడం సంచలనంగా మారింది.
చంద్రబాబు వ్యాఖ్యలపై ఎప్పటిలాగే మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు.ప్రజల్లో తన గ్రాఫ్ తగ్గిపోతుంది అందుకు కలెక్టర్ల పనీతీరు కారణమని… కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు చెబుతున్నారు.. కలెక్టర్ల గ్రాఫ్ కాదు స్వామి…ముందుకు నీ గ్రాఫ్ బాగోలేదు..మీకు ఆర్ధంకావడంలేదు … మీ హయంలో ప్రజలకు జరిగిన మంచి ఒక్కటి కూడా లేదని విమర్శించారు. మూడో బడ్జెట్ కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నారు…ప్రజలకు జరిగింది మాత్రం సున్నా అని యద్దేవా చేశారు.
వైసీపీ హయంలో జరిగిన మంచి గతంలో ఏ ప్రభుత్వంలో జరగలేదన,
ఏ నెలలో ఏ పథకం కింద నిధులు ఇస్తున్నామో…ముందుగా క్యాలెండర్ ప్రకటించిన ఘనత వైసీపీదని గొప్పగా చెప్పుకున్నారు. రెండేళ్ల చంద్రబాబు హయంలో సంక్షేమ పథకాలు అగిపోవడం…రాష్ట్రంలో అన్ని వ్యవస్ధలు కుప్పకూలిపోవడం జరిగిందన్నారు. అందుకే చంద్రబాబు గ్రాఫ్ ఎంత లేపినా లేవడంలేదని…అన్ని అబద్దాలు, మోసాలే అని ప్రజలందరికి ఆర్ధమవుతుందని కాబట్టి గ్రాఫ్ పడిపోతుందని సెటైర్లు వేశారు
ఇక జగన్ మెప్పుకోసం పరితపించే మాజీమంత్రి అంబటి రాంబాబు నేను సైతం అంటూ ఈ సీన్‌లోకి వచ్చేశారు. డేటా డ్రైవెన్ బేస్డ్ గవర్నెన్స్ అంటున్న చంద్రబాబు మాటలను పట్టుకుని తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ పెట్టారు. మీది Data driven based governance కాదు “Beta” driven based governance ! అని దెప్పిపొడిచారు. 18 మాసాలకే ప్రజలు మెచ్చలేదని అర్థమవుతుందా? అని చంద్రబాబుని ప్రశ్నించారు. మొత్తానికి ప్రజాక్షేత్రంలో పెద్దగా కనిపించని ఈ వైసీపీ నేతలు సోషల్ మీడియాలో హాడావుడి చేస్తుండటం విమర్శలు మూటగట్టుకుంటోంది.
Story by Ramireddy, Big Tv