E-Paper
Advertisement

కొత్త కైనెటిక్ DX+ ఈ-స్కూటర్ కొనాలనుకుంటున్నారా? కచ్చితంగా ఈ 5 విషయాలు తెలుసుకోండి!

కొత్త కైనెటిక్ DX+ ఈ-స్కూటర్ కొనాలనుకుంటున్నారా? కచ్చితంగా ఈ 5 విషయాలు తెలుసుకోండి!
Advertisement

Kinetic DX+ Electric Scooter: భారతీయ స్కూటర్ మార్కెట్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కైనెటిక్ స్కూటర్.. ఇప్పుడు సరికొత్త అవతార్ లో విడుదల అయ్యింది. కైనెటిక్ DX+ పేరుతో రోజువారీ వినియోగానికి అనుకూలంగా ఉండేలా ఎలక్ట్రిక్ స్కూటర్ ను తయారు చేశారు. స్టాండర్డ్ మోడల్‌ తో పోలిస్తే, ఇందులో ఎక్కువ ఫీచర్లు, మెరుగైన టెక్నాలజీ, వినియోగదారులకు ఉపయోగపడే సౌకర్యాలు ఉన్నాయి. ముఖ్యంగా కనెక్టెడ్ ఫీచర్లు, బ్యాటరీ పనితీరు, సులభమైన ఛార్జింగ్ లాంటి అంశాలున్నాయి. ఒకవేళ మీరు కూడా ఈ స్కూటర్ ను కొనాలనుకుంటే కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి.

⦿ కనెక్టెడ్ టెక్నాలజీ

ఈ స్కూటర్‌ లో కనెక్టెడ్ టెక్నాలజీ స్పెషల్ అట్రాక్షన్. టెలికైనెటిక్ సిస్టమ్ ద్వారా రియల్ టైమ్‌లో రైడ్ డేటా తెలుసుకోవచ్చు. అలాగే వెహికల్ ఎక్కడ ఉందో ట్రాక్ చేయడం, జియో ఫెన్సింగ్ సెటప్ చేయడం, అనుమానాస్పద కదలికలు ఉంటే అలర్ట్‌ చేయడం లాంటి సౌకర్యాలు ఉన్నాయి.  ఫైండ్ మై కైనెటిక్ అనే ఫీచర్ ద్వారా స్కూటర్‌ ను ఈజీగా గుర్తించే అవకాశం ఉంటుంది. వాయిస్ గైడెడ్ నావిగేషన్, మ్యూజిక్ ప్లేబ్యాక్ కోసం స్పీకర్ కూడా ఇవ్వడం వల్ల ఇది సాధారణ స్కూటర్ కంటే కొంచెం స్మార్ట్‌ గా అనిపిస్తుంది.

⦿ ఆన్ బోర్డ్ ఛార్జర్

Advertisement

ఇంకో ముఖ్యమైన ఫీచర్ ఆన్-బోర్డ్ ఛార్జర్. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాలకు బయట ఛార్జర్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. కానీ DX+లో ఛార్జింగ్ కేబుల్ స్కూటర్‌ లోనే ఉంటుంది. అవసరమైనప్పుడు బయటకు తీసి నేరుగా ప్లగ్ చేసుకోవచ్చు. ఇది రోజువారీ వినియోగంలో చాలా సౌకర్యంగా ఉంటుంది. అలాగే వెనుక కూర్చునే వ్యక్తి కోసం ఫుట్‌ రెస్ట్‌ ను ఒకే బటన్‌తో తెరవగల  ఈజీ ఫ్లిప్ సౌకర్యం కూడా ఉంది.

⦿ లిథియం ఐరన్ ఫాస్ఫేట్

బ్యాటరీ విషయానికి వస్తే, ఇందులో 2.6 kWh సామర్థ్యం కలిగిన లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ఉంటుంది.  ఈ రకం బ్యాటరీలు ఎక్కువ కాలం పనిచేస్తాయి. భద్రత పరంగా బాగుంటాయి. ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 116 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. దీని లైఫ్ సైకిల్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల దీర్ఘకాలంలో వినియోగదారులకు లాభం ఉంటుంది.

⦿ మంచి వేగం

Advertisement

పనితీరు పరంగా DX+ మంచి బ్యాలెన్స్ ఇస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 6.4 bhp శక్తిని ఇస్తుంది. గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగం అందుకోగలదు. రైడర్ అవసరాన్ని బట్టి రేంజ్, పవర్, టర్బో అనే మూడు మోడ్‌లు ఉన్నాయి.   రీజెనరేటివ్ బ్రేకింగ్ కూడా ఉండటం వల్ల బ్రేక్ వేస్తే కొంత శక్తి తిరిగి బ్యాటరీలోకి వెళ్తుంది.

⦿ మంచి బిల్డ్ క్వాలిటీ

హార్డ్‌ వేర్ పరంగా మంచి స్థాయిలో ఉంటుంది. ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక సర్దుబాటు చేసే షాక్ అబ్జార్బర్ ఉన్నాయి. బ్రేకింగ్ కోసం ముందు డిస్క్, వెనుక డ్రమ్ బ్రేక్‌లను ఇచ్చారు. కాంబి బ్రేకింగ్ సిస్టమ్ ఉండటం వల్ల భద్రత పెరుగుతుంది. మెటల్ బాడీ నిర్మాణం దీన్ని బలంగా ఉంచుతుంది. సీటు కింద 37 లీటర్ల స్టోరేజ్ ఉండటం రోజువారీ పనులకు ఉపయోగపడుతుంది.

Read Also: క్రూజ్ కంట్రోల్, హీటెడ్ సీట్‌.. కళ్లు చెదిరే జోంటెస్ స్కూటర్ లాంచ్!

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×