TVS Jupiter Prices Hiked: టీవీఎస్ మోటార్ సైకిల్స్ కంపెనీ నుంచి విడుదల అయిన మోస్ట్ పాపులర్ మోడల్ జుపిటర్. ఈ మోడల్ కు దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. అమ్మకాల పరంగానూ సత్తా చాటింది. ఇప్పటికీ అమ్మకాల్లో దూకుడు కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలోనే పాపులర్ మోడల్ గురించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టీవీఎస్ తన బ్రాండ్ కు సంబంధించిన పలు బైక్స్ ధరలు పెంచింది. తాజాగా జుపిటర్ ధరను పెంచుతున్నట్లు వెల్లడించింది. జూపిటర్ 110 దాని వేరియంట్ లైనప్ లో రూ. 3,250 వరకు ధర పెరిగింది. ఫ్యామిలీ ఓరియెంటెడ్ స్కూటర్ ఇప్పుడు గతంతో పోల్చితే కాస్త ఎక్కువ ధరకు అందుబాటులో ఉంటుంది. జుపిటర్ తాజాగా ధరలకు సంబంధించిన వివరాలను కంపెనీ ప్రకటించింది.
⦿ డ్రమ్: ఈ వేరియంట్ గతంలో ధర రూ. 72,650 ఉండగా, ఇప్పుడు రూ. 75,600కి చేరింది. అంటే, రూ. 2,950 అదనంగా పెరిగింది.
⦿ డ్రమ్ అల్లాయ్: ఈ స్కూటర్ ధర గతంలో రూ. 77,450 ఉండగా, ఇప్పుడు రూ. 79,835కి చేరింది. ఈ వేరియంట్ మీద రూ. 2,385 హైక్ అయ్యింది.
⦿ డ్రమ్ SXC: దీని ధర గతంలో రూ. 81,250 ఉండగా, ఇప్పుడు రూ. 84,000కి పెరిగింది. ఈ వేరియంట్ మీద రూ. 2,750 పెరిగింది.
⦿ డిస్క్ SXC: ఈ బైక్ ధర గతంలో రూ. 84,750 ఉండగా, ఇప్పుడు రూ. 87,750కి చేరింది. ఈ వేరియంట్ మీద రూ. 3,000 పెరిగింది.
⦿ స్పెషల్ ఎడిషన్: ఈ బైక్ ధర ప్రస్తుతం రూ. 85,650 ఉండగా, ఇప్పుడు రూ. 88,900కి చేరింది. దీని మీద రూ. 3,250 పెరిగింది.
Read Also: వినియోగదారులకు టీవీఎస్ షాక్.. ఆ రెండు బైక్ ధరలు పెంపు!
టీవీఎస్ ఎన్ టార్క్ 125 లాంటి ఇతర మోడళ్ల మీద చూసిన ధరల సవరణలతో పోలిస్తే జుపిటర్ లైనప్ అంతటా ధరల పెరుగుదల భారీగా ఉంది. ఉత్పత్తి ఖర్చులు పెరగడం వల్ల ధర పెరుగుదల తప్పలేదని కంపెనీ వెల్లడించింది. టీవీఎస్ తన బైక్, స్కూటర్ లైనప్ లో ధరలను సవరిస్తోంది. ఇటీవల, టీవీఎస్ రేడియన్, స్టార్ సిటీ ప్లస్ ధరలను పెంచింది. ధరల పెరుగుదల పక్కన పెడితే, జుపిటర్ స్కూటర్ లో ఇతర మార్పులు లేవు. ఇప్పటికీ అదే 113.3cc, ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ మోటారుతో పవర్ ను పొందుతుంది. ఇది 7.91bhp పవర్, 9.80Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
Read Also: మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కు గుడ్ న్యూస్, జస్ట్ 34 వేలకే క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్!