E-Paper
Advertisement

TVS Orbiter Scooter: అదిరిపోయే డిజైన్, ఆకట్టుకునే మైలేజ్.. TVS నుంచి అదిరిపోయే ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్!

TVS Orbiter Scooter: అదిరిపోయే డిజైన్, ఆకట్టుకునే మైలేజ్.. TVS నుంచి అదిరిపోయే ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్!

TVS Orbiter Electric Scooter: TVS  మోటార్ సైకిల్ కంపెనీ వినియోగదారులను ఆకట్టుకునేలా అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేస్తోంది. ఇప్పటికే పలు ఈవీలను అందుబాటులోకి తీసుకురాగా, రీసెంట్ గా ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను పరిచయం చేసింది. మోడర్న్ లుక్, స్లీక్ డిజైన్‌తో రూపొందించింది. మినిమలిస్టిక్ స్ట్రెయిట్ లైన్ న్యూ ఏజ్ లుక్‌ తో ఆకట్టుకుంటుంది. ఇది బెస్ట్ ఇన్ క్లాస్ ఏరోడైనమిక్స్‌ తో రూపొందించబడింది. ఇది ప్రతి చార్జ్‌ పై 10% మెరుగైన రేంజ్‌ను అందిస్తుంది. క్రిస్టల్ LED హెడ్‌ల్యాంప్స్, ఫ్రంట్, రియర్ కాంబినేషన్ లైట్లు వైబ్రంట్ లుక్,  వైడ్ లైట్ త్రోను అందిస్తాయి. విజర్ డిజైన్ రేంజ్‌ను మెరుగుపరుస్తుంది. క్లియర్ విజిబిలిటీని అందిస్తుంది.

ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ వెయిట్ 112 కేజీలు ఉంటుంది. 34L అండర్‌సీట్ స్టోరేజ్, ఫ్రంట్ స్టోరేజ్ బాక్స్, స్పేషియస్ ఫుట్‌ బోర్డ్ ఉంటుంది. స్టెల్లర్ సిల్వర్, కాస్మిక్ టైటానియం, మార్టియన్ కాపర్, లూనార్ గ్రే, స్ట్రాటోస్ బ్లూ, నియాన్ సన్‌బర్స్ట్ రంగుల్లో అందుబాటులో ఉంది.  కాంపాక్ట్ స్క్వేర్ డిజైన్, అప్‌రైట్ ఫ్లైస్క్రీన్, కనెక్టెడ్ DRLలు (ఇండికేటర్లుగా డబుల్), కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్, గ్రాబ్ రైల్స్, ఫ్రంట్ ఏప్రాన్ బ్యాగ్ హుక్ (3 kg కెపాసిటీ)ను కలిగి ఉంది. ఈ స్కూటర్ సిటీ కమ్యూటింగ్‌కు సౌకర్యవంతమైన, ప్రాక్టికల్ డిజైన్‌ను అందిస్తుంది. మంచి బిల్డ్ క్వాలిటీ, కంఫర్టబుల్ సీటింగ్‌తో వస్తుంది.

ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లు

ఆర్బిటర్ ఫీచర్ లోడెడ్ స్కూటర్. స్మార్ట్, కన్వీనియెంట్ ఫంక్షనాలిటీని కలిగి ఉంటుంది.

⦿ డిస్‌ప్లే, కనెక్టివిటీ: 5.5-ఇంచ్ కలర్ LCD డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, బ్లూటూత్ మొబైల్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్ (GPS), కాల్, SMS అలర్ట్స్, OTA అప్‌డేట్స్, డిజిటల్ స్పీడోమీటర్, డిస్టెన్స్ టు ఎంప్టీ ఇండికేటర్, టూ ట్రిప్‌మీటర్లు, స్టాండ్ అలారం, లో బ్యాటరీ ఇండికేటర్, క్లాక్ ఉంటుంది.

⦿ సేఫ్టీ, కన్వీనియెన్స్: ఫ్రంట్ USB చార్జింగ్ పోర్ట్, క్రూజ్ కంట్రోల్, రివర్స్ మోడ్, రిజెనరేటివ్ బ్రేకింగ్, పార్కింగ్ అసిస్ట్, స్టార్ట్, స్టాప్ బటన్, యాంటీ థెఫ్ట్ సిస్టమ్, హిల్ అసిస్ట్, జియో-ఫెన్సింగ్, క్రాష్, ఫాల్ అలర్ట్స్, టైమ్ ఫెన్సింగ్, టోయింగ్ అలర్ట్స్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ను కలిగి ఉంటుంది.

⦿ మొబైల్ యాప్: బ్యాటరీ స్టేటస్, లైవ్ చార్జింగ్ స్టేటస్, నియర్‌బై చార్జింగ్ స్టేషన్లు, టో, థెఫ్ట్ నోటిఫికేషన్లు, వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ ను కలిగి ఉంటుంది.

⦿ రైడింగ్ మోడ్స్: ఇకో, సిటీ మోడ్స్ అందుబాటులో ఉంటాయి.

ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ పనితీరు  

ఆర్బిటర్ సిటీ రైడింగ్‌కు సూటబుల్, స్మూత్, ఎఫిషియెంట్ పెర్ఫార్మెన్స్‌ ను కలిగి ఉంటుంది. 2.5 kW BLDC హబ్ మోటర్ (IP67 రేటింగ్) ఉంటుంది. 3.1 kWh లిథియం ఐయాన్ బ్యాటరీ (IP67) ఉంటుంది. ఒక్క ఛార్జ్ తో 158 km రేంజ్ లభిస్తుంది.  టాప్ స్పీడ్ 68 kmph ఇస్తుంది. 0-40 km/h వేగాన్ని 6.8 సెకెన్లలో అందుకుంటుంది. 0-80%  ఛార్జింగ్ 4 గంటల 10 నిమిషాలలో (650W పోర్టబుల్ చార్జర్) అవుతుంది. ఫాస్ట్ చార్జింగ్ లేదు. రైడ్ క్వాలిటీ విషయానికి వస్తే స్మూత్ థ్రాటిల్ రెస్పాన్స్, ఇన్‌స్టంట్ టార్క్, లైట్, అజైల్ హ్యాండ్లింగ్, సిటీ రోడ్లపై స్టేబుల్, హైవేకు సూటబుల్ కాదు. ఈ స్కూటర్ ఫస్ట్-టైమ్ EV బయ్యర్లకు సింపుల్ మరియు ప్రాక్టికల్ ఆప్షన్. TVS ఎలక్ట్రిక్ లైనప్‌లో iQube కంటే లోయర్ పొజిషన్‌లో ఉంది.

Read Also: కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా? ఈ 10 విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోండి!

Related News

ఇండియన్ మార్కెట్ లోకి యమహా NMax 155 ఎంట్రీ, ఫీచర్లు చూస్తే షాక్!

టీవీఎస్, బజాజ్ జోరు.. ఓలా బేజారు.. ఈవీ స్కూటర్ అమ్మకాల్లో టాప్ 5 మోడల్స్ ఇవే!

ఒకే ఇంజిన్.. రెండు బైక్స్.. బుల్లెట్ 650 vs క్లాసిక్ 650 డిఫరెన్స్ ఇవే!

అవెంజర్ లవర్స్ కు గుడ్ న్యూస్.. రెండు రంగుల్లో స్ట్రీట్ 220 మళ్లీ ఎంట్రీ!

95 కి.మీ క్లెయిమ్.. కానీ, నిజంగా ఇ-యాక్సెస్ ఇచ్చిన రేంజ్ ఎంతో తెలుసా?

టాటా మోటార్స్ మాస్టర్ ప్లాన్.. అవిన్యా X లాంచింగ్ డేట్ ఫిక్స్!

మహీంద్రాను దాటేసిన టాటా.. మే 2026 ఈవీ అమ్మకాల్లో సరికొత్త రికార్డు!

పెట్రోల్‌ తో పాటు ఇథనాల్‌ తోనూ పరుగులు.. కొత్త వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్‌ ప్రత్యేకతలు ఇవే!

Big Stories

×