E-Paper
Advertisement

New Bike: కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా? ఈ 10 విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోండి!

New Bike: కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా? ఈ 10 విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోండి!
Advertisement

కొత్త బైక్ కొనడం అంటే, ఎవరికైనా సరదాగానే ఉంటుంది. ఎంతో సంతోషం కలుగుతుంది.  కానీ, బైక్ కొనుగోలు విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. దేశంలో ట్రాఫిక్, రోడ్లు, ఇంధన ధరలు లాంటి పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని ఈ 10 అంశాలను గుర్తుంచుకోవాలి.

⦿ అవసరాలు, ఉపయోగం

బై కొనే ముందు ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం ఇది. బైక్‌ను ఎందుకు కొనాలనుకుంటున్నారో దానికి అనుగుణంగా ఉండే మోటార్ సైకిల్ ను ఎంపిక చేసుకోవాలి. డైలీ సిటీ కమ్యూటింగ్, లాంగ్ టూర్స్, ఆఫ్ రోడ్, పిలియన్‌ తో రైడ్ లాంటి అవసరాల కోఒసం కమ్యూటర్ బైక్ (110-150cc) సిటీకి బెస్ట్, అడ్వెంచర్ బైక్ లాంగ్ రైడ్స్‌ కు సూట్ అవుతుంది.

⦿ బడ్జెట్

Advertisement

బైక్ ధరతో పాటు ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్, ఆన్ రోడ్ ఖర్చులు కలిపి ప్లాన్ చేయండి. EMI ఆప్షన్ ఉంటే వడ్డీ ఖర్చు కూడా యాడ్ చేయాలి. ఫెస్టివల్ సీజన్‌లో డిస్కౌంట్స్  లభిస్తాయి.

⦿ ఇంజిన్ కెపాసిటీ, మైలేజ్

సిటీ రైడ్‌కు 125-150cc (మైలేజ్ 50-60 kmpl), పవర్ కోసం 200cc+ (మైలేజ్ తక్కువ) చాలు. ఇంధన ధరలు పెరుగుతున్నందున మైలేజ్ కు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది.

⦿ కంఫర్ట్, ఎర్గోనామిక్స్

Advertisement

బైక్ మీ హైట్, వెయిట్‌కు సరిపడాలి. సీట్ హైట్, హ్యాండిల్ పొజిషన్ చెక్ చేయాలి. లాంగ్ రైడ్స్‌ కు కంఫర్ట్ కీలకం.

⦿ టెస్ట్ రైడ్ తప్పనిసరి

బైక్ కొనుగోలు చేయడానికి షోరూమ్‌ కు వెళ్లినప్పుడు, రోడ్‌ మీద కాసేపు టెస్ట్ రైడ్ చేయాలి. హ్యాండ్లింగ్, బ్రేకింగ్, ఇంజిన్ ఫీల్ చెక్ చేయండి.

⦿ సేఫ్టీ ఫీచర్లు

2025లో ABS (డ్యూయల్ ఛానల్ బెటర్), డిజిటల్ కన్సోల్, LED లైట్స్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. హెల్మెట్, గ్లవ్స్, జాకెట్ లాంటివి కూడా ప్లాన్ చేసుకోవాలి.

⦿ సర్వీస్, మెయింటెనెన్స్

బ్రాండ్ సర్వీస్ సెంటర్లు మీ ఏరియాలో ఉన్నాయా? స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ, సర్వీస్ ఖర్చు ఎంత అవుతుంది? అనే పూర్తి వివరాలను తెలుసుకోవాలి.

⦿ ఇన్సూరెన్స్

ఇండియాలో బైక్స్ కు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. కాంప్రిహెన్సివ్ పాలిసీ (థెఫ్ట్, యాక్సిడెంట్ కవర్) తీసుకోండి. కొత్త బైక్‌కు జీరో డిప్రిసియేషన్ ఆడ్ ఆన్ మంచిది.

⦿ రీసేల్ వాల్యూ

Hero, Honda, Bajaj, TVS వంటి పాపులర్ బ్రాండ్స్ బైక్స్ రీసేల్‌లో మంచి వాల్యూ ఇస్తాయి. రెగ్యులర్ సర్వీస్ చేస్తే మరింత మంచిది.

Read Also: స్టైలిష్ క్వాంటం ఎనర్జీ స్కూటర్లు, రేంజ్ కూడా బాగానే ఉందండోయ్!

⦿ రివ్యూస్, ఆఫర్స్

ఆన్‌లైన్ రివ్యూస్ చూడాలి. BikeDekho, Zigwheels లాంటి సైట్లలో యూజర్ ఎక్స్‌పీరియన్స్ చదవాలి. ఫెస్టివల్ ఆఫర్స్, ఫ్రీ యాక్సెసరీస్ చూసి కొనడం మంచిది.

పై 10 అంశాలను గుర్తుపెట్టుకుని సరైన బైక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడూ సేఫ్టీ ఫస్ట్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.  మంచి హెల్మెట్ తప్పనిసరి.

Read Also: ప్రపంచంలో అత్యధిక బైక్స్ ఉన్న దేశాలు ఇవే, ఇండియా ర్యాంక్ ఎంతో తెలుసా?

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×