E-Paper
Advertisement

Comedy Drama OTT : అమ్మాయిల వాష్ రూమ్ లో అడ్డంగా బుక్కయ్యే హీరో… కితకితలు పెట్టే మలయాళం కామెడీ డ్రామా

Comedy Drama OTT : అమ్మాయిల వాష్ రూమ్ లో అడ్డంగా బుక్కయ్యే హీరో… కితకితలు పెట్టే మలయాళం కామెడీ డ్రామా
Advertisement

Comedy Drama OTT : మలయాళ సినిమా లవర్స్ కు 2025 చివరి వారంలో మంచి కామెడీ మూవీతో ఈ ఏడాదికి ఎండ్ కార్డు వేయబోతున్నారు. నవంబర్‌లో థియేటర్లలో రిలీజ్ అయిన కొన్ని మూవీస్ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ముఖ్యంగా కామెడీ డ్రామాలు, మిస్టరీ థ్రిల్లర్స్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ వారంలో రిలీజ్ అయిన మలయాళ సినిమాలతో పాటు, వచ్చే రెండు రోజుల్లో రిలీజ్ కానున్న మలయాళం సినిమాలు ఏంటో చూద్దాం. అందులోనూ స్పెషల్ గా ఓ కిరాక్ కామెడీ మూవీ గురించి తెలుసుకుందాం పదండి.

సైనా ప్లేలో స్ట్రీమింగ్

నవంబర్ 7న థియేటర్లలో రిలీజ్ అయిన మలయాళం కామెడీ డ్రామా ‘ఇన్నోసెంట్ (Innocent)’. డిసెంబర్ 29 నుండి సైనా ప్లేలో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. అల్తాఫ్ సలీం (వినోద్ పాత్రలో – ప్రభుత్వ గుమస్తా), అనార్కలి మరికర్ లీడ్ రోల్స్‌లో నటించారు. టాంజానియా ఇన్‌ఫ్లుయెన్సర్ కిలి పాల్ స్పెషల్ రోల్‌లో కనిపిస్తాడు. జోమోన్ జ్యోతిర్, మిథున్ రమేష్, అజీస్ నెడుమంగడ్ ఇతర కీ రోల్స్ పోషించారు. Saina Play ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also : అర్దరాత్రి గజ్జెల సప్పుడు… వ్యామోహంలో ముంచి చంపే పిశాచి… గుండె గట్టిగా ఉన్నవాళ్లే చూడాల్సిన మూవీ

స్టోరీలోకి వెళ్తే..

స్టోరీ వినోద్ (అల్తాఫ్ సలీం) చుట్టూ తిరుగుతుంది. 29 ఏళ్ల రొటీన్ మనిషి ఇతను. కరునగప్పల్లిలో ఉండి, తిరువనంతపురంలో ప్లానింగ్ ఆఫీస్‌ లో జాబ్ చేస్తాడు. రోజూ ట్రైన్ కమ్యూట్, ఆఫీస్ వర్క్ ఇలా తెగ రొటీన్ లైఫ్ అతనిది. రజిత (అనార్కలి మరికర్)తో మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది. ఒకరోజు జర్నీ చేస్తుండగా ఫుడ్ పాయిజనింగ్ వల్ల అనారోగ్యం పాలవుతాడు. KSRTC బస్ స్టాండ్‌లో మహిళల వాష్‌రూమ్ ఉపయోగించాల్సి వస్తుంది. అక్కడ కొంతమంది అతను ఆడవాళ్ళ వాష్ రూమ్ లోకి వెళ్ళి రావడాన్ని రికార్డ్ చేసి, వీడియోను వైరల్ చేస్తారు. దీంతో వినోద్ అవమానం పాలవుతాడు. సోషల్ మీడియాలో ఆ వీడియోను చూసి అందరూ ఎగతాళి చేస్తారు. అతని జాబ్, మ్యారేజ్, లైఫ్ అన్నీ తలక్రిందులవుతాయి. ఇక వినోద్ తన ప్రతిష్ట తిరిగి పొందడానికి చేసే ప్రయత్నాలు కామెడీ, డ్రామాతో సాగుతాయి. సోషల్ మీడియా ఇంపాక్ట్, పబ్లిక్ షేమింగ్ వంటి థీమ్స్ ను డీప్‌ గా చూపించారు. చివరికి వినోద్ తనకు జరిగిన అవమానాన్ని ఎలా డీల్ చేశాడు? తిరిగి ఎలా గౌరవాన్ని పొందాడు? అనేది క్లైమాక్స్.

Advertisement

నవంబర్ 7న ‘ఇన్నోసెంట్‌’తో పాటు రిలీజ్ అయిన మరో మూవీ ఇతిరి నేరం (Ithiri Neram). డిసెంబర్ 31న Sun NXT ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. రోషన్ మాథ్యూ, జరీన్ షిహాబ్ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమాను ప్రశాంత్ విజయ్ డైరెక్ట్ చేశాడు. అలాగే అదే తేదీన ‘ఎకో’ (Echo) నెట్‌ఫ్లిక్స్‌లో, ‘ఒడుం కుతిర చాదుం కుతిర’ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానున్నాయి.

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×