E-Paper
Advertisement

TVS ఆర్బిటర్ V1, V2.. రెండింటిలో ఏది బెస్ట్ అంటే?

TVS ఆర్బిటర్ V1, V2.. రెండింటిలో ఏది బెస్ట్ అంటే?
Advertisement

TVS Orbiter Variants V1 vs V2 Comparison: ప్రముఖ టూవీలర్ కంపెనీ టీవీఎస్ మోటార్ కంపెనీ క్రేజీ ఈవీ స్కూటర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో ముఖ్యమైనది అర్బిటర్. ఇది V1, V2 అనే రెండు వెర్షన్లలో విడుదల అయ్యింది. కంపెనీ EV శ్రేణిలో అత్యంత సరసమైన మోడల్స్ గా ఇవి గుర్తింపు తెచ్చుకున్నాయి. మొదట ఒకే వేరియంట్‌ తో ప్రారంభమైన ఈ స్కూటర్, తర్వాత రెండు వేరియంట్లతో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు V1, V2 అనే రెండు ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ రెండింటి మధ్య తేడాల గురించి తెలుసుకుందాం..

V1 వేరియంట్ గురించి..

V1 వేరియంట్ అనేది బేసిక్ మోడల్‌. ఇందులో 1.8kWh సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంటుంది.  ఇది ఒకే ఛార్జ్ తో సుమారు 86 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. చిన్న బ్యాటరీ ఉండటం వల్ల ఛార్జింగ్ టైమ్ కూడా తక్కువగా ఉంటుంది. 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ కావడానికి సుమారు 2 గంటల 20 నిమిషాల సమయం పడుతుంది. ఇందులో 2.8kW  సామర్థ్యం కలిగిన BLDC మోటార్ ఉంటుంది. ఇది గరిష్టంగా గంటకు 68 కిలోమీటర్ల వేగాన్ని అందిస్తుంది. బ్యాటరీ చిన్నదైనా, ఫీచర్లలో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. V1లో కలర్ LCD డిస్‌ ప్లే, క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్ లాంటి ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఫ్రంట్ 14 అంగుళాల వీల్, వెనుక 12 అంగుళాల వీల్ ఉంటుంది. ధర విషయానికి వస్తే, V1 ధర సుమారు రూ. 84,500. అయితే బ్యాటరీ యాజ్ ఎ-సర్వీస్(BaaS) పద్ధతిలో తీసుకుంటే రూ.49,999 నుంచి ప్రారంభమవుతుంది, ఇది బడ్జెట్ కొనుగోలుదారులకు అనుకూలంగా ఉంటుంది.

V2 వేరియంట్ గురించి..

Advertisement

V2 వేరియంట్ అనేది కాస్త ప్రీమియం సెలెక్షన్ గా చెప్పుకోవచ్చు. ఇందులో 3.1kWh బ్యాటరీ ఉంటుంది. ఇది ఎక్కువ రేంజ్‌ ను అందిస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 158 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అయితే, బ్యాటరీ పెద్దది కావడంతో ఛార్జింగ్ టైమ్ కూడా ఎక్కువగా ఉంటుంది. 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ కావడానికి దాదాపు 4 గంటల 10 నిమిషాలు పడుతుంది.

ఫీచర్లు, డిజైన్ విషయంలో V2 కూడా V1 మాదిరిగానే ఉంటుంది. మోటార్, టాప్ స్పీడ్, డిస్‌ ప్లే, క్రూయిజ్ కంట్రోల్ లాంటి  అంశాలు ఒకేలా ఉంటాయి. సీటు కింద స్టోరేజ్ స్పేస్, ఫ్లోర్‌ బోర్డ్ సైజు, సీటు పొడవు కూడా సేమ్ ఉంటాయి. V2లో కలర్ ఆప్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఆరు కలర్ ఆప్షన్లలో లభిస్తే, V1 కేవలం రెండు రంగుల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ధర విషయానికి వస్తే, V2 వేరియంట్ సుమారు రూ. 99,900గా ఉంటుంది. ఎక్కువ రేంజ్ కావాలనుకునే వారికి ఇది సరైన ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

Advertisement

మొత్తంగా రోజువారీ తక్కువ ప్రయాణాలకు, తక్కువ ఖర్చుతో EV కావాలనుకునే వారికి V1 సరిపోతుంది. ఎక్కువ రేంజ్, మరింత సౌకర్యం కోరుకునేవారు V2ను ఎంచుకోవచ్చు.

Read Also: బ్యాటరీ అయిపోయినా ప్రయాణం ఆగదు, విన్ ఫాస్ట్ నుంచి క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్!

 

Related News

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

Big Stories

Advertisement
×