E-Paper
Advertisement

అమరావతికి చట్టబద్ధత ప్రజా విజయం.. వైసీపీ రూటే వేరు, ప్లాన్ బీ అంటూ కొత్త నాటకం-సీఎం చంద్రబాబు

అమరావతికి చట్టబద్ధత ప్రజా విజయం.. వైసీపీ రూటే వేరు, ప్లాన్ బీ అంటూ కొత్త నాటకం-సీఎం చంద్రబాబు
Advertisement

CM Chandrababu: అమరావతి చట్టబద్దత బిల్లు ఆమోదం ప్రజా విజయమన్నారు సీఎం చంద్రబాబు. ప్రజా రాజధానికి దక్కిన గౌరవమన్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లో అమరావతి బిల్లుకు వైసీపీ మినహా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయన్నారు. దేశంలో అన్ని పార్టీలది ఒకదారైతే.. వైసీపీది మరొక దారి అని అన్నారు.

అమరావతికి చట్టబద్ధత ప్రజా విజయం-సీఎం చంద్రబాబు

Advertisement

పార్లమెంటు ఉభయసభల్లో ఏపీ రాజధాని అమరావతి బిల్లుపై ఆమోదం పొందడంపై సీఎం చంద్రబాబు శుక్రవారం మధ్యాహ్నం ఉండవల్లిలో మీడియా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, కీలక విషయాలు ప్రస్తావించారు. ఈ బిల్లు ఆమోదానికి సహకరించిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, స్పీకర్‌ ఓం బిర్లా, ఛైర్మన్‌ సీపీ రాధాకృష్ణన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

అలాగే బిల్లుకు మద్దతిచ్చిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు.  ఇదే సమయంలో వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజధాని అమరావతి విషయంలో దేశంలో అన్ని పార్టీలది ఒక దారైతే వైసీపీ మరొక దారన్నారు. ప్రజల చేత ఓట్లు వేయించుకుని రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారన్నారు. రాష్ట్రం నాశనమైపోయినా పర్వాలేదని భావించి ఆ పార్టీ ముందుకెళ్లిందన్నారు.

Advertisement

అమరావతిని నాశనం చేయాలని చూశారని అన్నారు. విభజన జరిగినప్పుడు రెండు రాష్ట్రాల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. సమైక్యాంధ్రప్రదేశ్‌లో హైటెక్‌ సిటీ నిర్మించామని, రెండు రాష్ట్రాల ప్రజలకు న్యాయం చేసి విభజన చేయాలని కోరానని అన్నారు. రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విభజించారని పాత విషయాలు వెల్లడించారు.

ప్లాన్ బీ అంటూ వైసీపీ కొత్త నాటకం-ముఖ్యమంత్రి

విజయవాడ-గుంటూరు మధ్య రాజధానికి అనుకూలమని 46 శాతం ప్రజలు చెప్పారని వివరించారు. అభివృద్ధి వికేంద్రీకరణ టీడీపీ సిద్ధాంతమని కుండబద్దలు కొట్టేశారు. రాజధాని ఉంటేనే ఏపీకి భవిష్యత్‌ ఉంటుందని భావించామని, రాష్ట్రానికి మధ్యలో రాజధాని ఏర్పాటు చేశామన్నారు.

రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలోని 7 మండలాలను విలీనం చేయించామని, పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపితేనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పానని తెలిపారు. తెలంగాణకు తానెప్పుడూ వ్యతిరేకం కాదని, తెలుగు ప్రజల కోసం హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామన్నారు. తెలంగాణ ప్రజల గౌరవాన్ని పొగొట్టుకునే పని తాను ఎప్పుడు చేయనన్నారు.

ఆనాడు అసెంబ్లీలో రాజధాని అమరావతిని వైసీపీ సమర్థించిందన్నారు. కనీసం 30 వేల ఎకరాలు ఉండాలని జగన్ మాటలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. గుంటూరు-విజయవాడ మధ్యలో రాజధాని ఏర్పాటు చేయాలని జగన్ అన్నారని తెలియజేశారు. ఒక్క పైసా తీసుకోకుండా అమరావతి మాస్టర్ ప్లాన్ ను సింగపూర్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు.

ALSO READ: వైసీపీ మూడు రాజధానుల వ్యవహారం.. గుట్టు విప్పిన మండలి మాజీ ఛైర్మన్ షరీఫ్, తన పుట్టుకను కూడా

అమరావతి భూసేకరణ విధానాన్ని కేంద్రప్రభుత్వం కూడా అభినందించిందన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే ప్రజావేదిక కూల్చివేశారని తెలిపారు. అంతేకాదు అమరావతి పనులు నిలిపివేశారని, ఏపీసీఆర్డీఏ చట్టం రద్దు చేశారన్నారు. సింగపూర్ సంస్థను తిరిగి పంపించేశారని, చివరకు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూశారన్నారు. మూడు రాజధానుల పేరిట నాటకమాడి ప్రజలను గందరగోళానికి గురి చేశారని వివరించారు.

2022 మార్చి 5న అమరావతి ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలని హైకోర్టు నిర్ణయించిందన్నారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించిందన్నారు.హైకోర్టు జడ్జి బదిలీపై వెళ్తేంటే.. రైతులంతా ఆయనకు గొప్పగా వీడ్కోలు పలికిన సందర్భం ఉందన్నారు. ఇప్పుడు ప్లాన్ బీ అంటూ జగన్ కొత్త నాటక మొదలుపెట్టారని అన్నారు.

ఇలాంటి మనస్తత్వం ప్రవర్తనను తానెప్పుడూ చూడలేదన్నారు. అమరావతికి మద్దతిచ్చిన వాళ్లను తప్పుబడతారా అంటూ ప్రశ్నించారు. ఇలాంటి వారిని చరిత్ర ఎప్పటికీ క్షమించదన్నారు. బెదిరింపులకు దిగితే ఎవరైనా పెట్టుబడులు పెడతారా? ప్రజాహితం కోసం ముందుకెళ్తామే తప్ప వెనుకాడేది లేదన్నారు సీఎం చంద్రబాబు.

 

 

Related News

డీఎస్సీపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ధ్వజం!

అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్.. 12 గంటలు కూర్చో లేకపోతే ఎలా? ఫోన్లు వద్దని ముందే..

విషం కక్కుతున్నారు.. వారిని అస్సలు వదిలిపెట్టం, జగన్‌కు లోకేష్ మాస్ వార్నింగ్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ-తెలంగాణల్లో భారీ వర్షాలు, రాబోయే రెండురోజుల్లో..

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు, రికార్డు స్థాయిలో ఆదాయం

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద ప్రమాదం.. తెగిపోయిన గేటు ఇనుప రోప్

సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. అశోక్, వెంకటరాజు కస్టడీపై కోర్టు ఏం చెప్పిందంటే?

టీడీపీ పార్టీలో చేరాక తొలిసారి స్పందించిన చిన్న శ్రీను.. ఏమన్నారంటే?

Big Stories

Advertisement
×