E-Paper
Advertisement

ఇంట్లో చీపురును ఆ దిశలో పెడితే.. అప్పుల బాధ తప్పదట, వాస్తుశాస్త్రం ఏం చెబుతోందంటే?

ఇంట్లో చీపురును ఆ దిశలో పెడితే.. అప్పుల బాధ తప్పదట, వాస్తుశాస్త్రం ఏం చెబుతోందంటే?
Advertisement

Vastu Tips: సాధారణంగా ప్రతి ఒక్కరూ ఇల్లు నీట్‌గా ఉండాలనే కోరుకుంటారు. దీనికోసం ప్రతిరోజూ ఇల్లు ఊడవటం, తుడవటం వంటివి చేస్తుంటారు. అయితే ఆ ఇల్లు ఊడ్చే చీపురు విషయంలో మాత్రం చాలాపెద్ద పొరపాటు చేస్తుంటారు. ఇల్లు ఊడవటం అయిపోగానే చీపురును ఏదో ఒక మూల పడేసినట్లు ఉంటుంది కొందరి వ్యవహారం. కానీ మన పెద్దలు, వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారంటే.. చీపురును కేవలం వస్తువులా చూడకూడదట. అది సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి స్వరూపం. అందుకే చీపురును సరైన చోట ఉంచకపోతే ఇంట్లోకి దరిద్రం వస్తుందని, ఉన్న డబ్బు చేజారిపోతుందని అంటుంటారు. ముఖ్యంగా వంటగదిలోనో, బాత్‌రూమ్ పక్కనో అస్సలు ఉంచకూడదు.

ఏ దిశలో ఉంచితే మంచిది?

వాస్తు ప్రకారం చూసుకుంటే చీపురును ఇంటికి నైరుతి లేదా పశ్చిమ దిశలో ఉంచడం చాలా ఉత్తమం. ఎందుకంటే.. ఈ దిశలు ఇంట్లో స్థిరత్వాన్ని పెంచుతాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. చీపురు ఎప్పుడూ ఇతరుల కంట పడకూడదు. మనం డబ్బును బీరువాలో దాచుకున్నట్టే, చీపురును కూడా ఎవరూ చూడని విధంగా ఏదైనా మూలనో లేదా మెట్ల కిందో, స్టోర్ రూమ్‌లోనో భద్రంగా ఉంచాలి. ఇలా దాచి ఉంచడం వల్ల ఇంట్లో ధన నష్టం కలగకుండా అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు.

Advertisement

Also Read: గేమర్స్‌కు పూనకాలే.. లోపలే కూలింగ్ ఫ్యాన్, 8,000mAh భారీ బ్యాటరీతో ‘OPPO K15 Pro’ సిరీస్ లాంచ్!

ఈ తప్పులు చేస్తున్నారా?

మనం చేసే అతిపెద్ద పొరపాటు ఏంటంటే.. చీపురును గోడకు ఆనించి నిలబెట్టడం. ఇలా ఎప్పుడూ చేయకూడదు. చీపురు ఎప్పుడూ నేల మీద పడుకోబెట్టినట్టే ఉండాలి. అలాగే నడుస్తున్నప్పుడు చీపురుకు కాళ్లు తగలడం కానీ, దాని మీద నుంచి దాటడం కానీ చేయకూడదు. అది లక్ష్మీదేవికి అవమానం చేసినట్టు అవుతుంది. ఒకవేళ పొరపాటున కాలు తగిలితే మాత్రం వెంటనే దానికి నమస్కారం చేసుకోవాలి. అలాగే పాడైపోయిన లేదా విరిగిపోయిన చీపుర్లను ఇంట్లో పెట్టుకుంటే.. అవి ప్రతికూల శక్తిని తీసుకొస్తాయి.

కొత్త చీపురు ఏ రోజు కొనాలి?

Advertisement

కొత్త చీపురు కొనడానికి కూడా మన శాస్త్రాల్లో కొన్ని రోజులు చెప్పారు. ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా అమావాస్య నాడు గానీ లేదా మంగళవారం, శనివారం, ఆదివారాల్లో కొత్త చీపురును కొని ఇంటికి తెచ్చుకోవడం మంచిది. ఈ రోజుల్లో తెచ్చుకుంటే ఇంటికి పట్టిన దారిద్ర్యం పోయి, ఆర్థికంగా కలిసి వస్తుందని పెద్దల మాట. చూశారుగా.. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తేనే మన ఇంట్లో ప్రశాంతత, సిరిసంపదలు ఉంటాయి. అందుకే ఇకపై చీపురు విషయంలో కాస్త శ్రద్ధ వహించండి.

Also Read: Vivo V70 FE అరాచకం.. చీకట్లో మెరుస్తుంది, నీటిలోనూ ఫొటోలు తీస్తుంది, కెమెరా పిచ్చ క్లారిటీ బ్రో!

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×