E-Paper
Advertisement

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!
Advertisement

TVS Upcoming Bikes 2026: భారత టూ వీలర్ మార్కెట్‌ లో TVS  బైక్స్ మరోసారి సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. గత కొంతకాలంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు, కొత్త బైక్స్ తో టీవీఎస్ సత్తా చాటుతోంది. ఇప్పుడు మరో మూడు కొత్త మోడళ్లను తీసుకురానుంది. వీటిలో అపాచీ RR 450, అపాచీ RTR 450, జూపిటర్ CNG మోడల్స్ ఉన్నాయి. ఈ మూడు టూ వీలర్స్ వేర్వేరు సెగ్మెంట్ వినియోగదారులను టార్గెట్ గా చేసుకుని రూపొందుతున్నాయి.

అపాచీ RR 450

అపాచీ RR 450 TVS నుంచి రాబోతున్న స్పోర్ట్స్ బైక్‌. ఇందులో కొత్త 450 సీసీ ట్విన్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది. ఇదే ఇంజిన్ BMW F 450 GSలో కూడా ఉపయోగించనున్నారు. ప్రస్తుతం ఉన్న అపాచీ RR 310 కంటే ఇది మరింత పవర్ ఫుల్ గా ఉండనుంది. హై పర్‌ ఫార్మెన్స్ బైక్‌ను కోరుకునే రైడర్లను దృష్టిలో పెట్టుకుని ఈ మోడల్‌ను తయారు చేస్తున్నారు. స్పోర్టీ డిజైన్, ఆధునిక ఎలక్ట్రానిక్ ఫీచర్లు, మెరుగైన రైడింగ్ ఎక్స్ పీరియెన్స్ ను అందించనుంది.

అపాచీ RTR 450  

Advertisement

ఇదే ప్లాట్‌ ఫారమ్ ఆధారంగా అపాచీ RTR 450 కూడా మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఇది నేకెడ్ స్ట్రీట్‌ ఫైటర్ స్టైల్‌ లో రూపొందించబడుతోంది. RR 450లోని ఇంజిన్, ప్రధాన మెకానికల్ భాగాలను ఇందులో కూడా ఉపయోగించే అవకాశం ఉంది. అయితే, రైడింగ్ పొజిషన్ మరింత సౌకర్యవంతంగా ఉండేలా రూపొందిస్తారు. సిటీలో రోజువారీ వినియోగంతో పాటు హైవే రైడింగ్‌కు కూడా అనుకూలంగా ఉండొచ్చు. తక్కువ ధరలో విడుదలైతే KTM 390 Duke, Triumph Speed 400 లాంటి బైక్‌లకు గట్టి పోటీ ఇవ్వనుందని తెలుస్తోంది.

జూపిటర్ CNG స్కూటర్

మరోవైపు TVS కొత్త మోడల్ ను అందుబాటులోకి తీసుకురానుంది. కంపెనీ ఇప్పటికే జూపిటర్ CNG స్కూటర్ కాన్సెప్ట్‌ ను ప్రదర్శించింది. ఇది దేశంలో ఫ్యాక్టరీ నుంచి నేరుగా విడుదలయ్యే తొలి CNG స్కూటర్‌ గా నిలిచే అవకాశం ఉంది. పెట్రోల్‌ తో పోలిస్తే తక్కువ ఖర్చుతో ప్రయాణించే అవకాశం ఉంది. దేశంలోని పలు నగరాల్లో CNG స్టేషన్లు పెరుగుతున్న నేపథ్యంలో ఈ స్కూటర్‌కు మంచి ఆదరణ లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారికి అనుకూలంగా ఉంటుంది.

Advertisement

ఇటీవలి కాలంలో TVS మంచి పర్ఫార్మెన్స్ కలిగిన బైక్‌లతో పాటు కొత్త టెక్నాలజీలపై కూడా దృష్టి పెడుతోంది. ఒకవైపు స్పోర్ట్స్ బైక్‌ లను తీసుకువస్తూనే, మరోవైపు ప్రత్యామ్నాయ ఫ్యూయెల్ వాహనాలను కూడా అభివృద్ధి చేస్తోంది. దీంతో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తన మోడల్స్ ను విస్తరించే ప్రయత్నం చేస్తోంది. మొత్తంగా.. TVS నుంచి రానున్న ఈ మూడు కొత్త మోడల్స్ భారత ద్విచక్ర వాహన మార్కెట్‌ లో కొత్త జోష్ ను తీసుకురానున్నాయి.

Read Also: టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×