E-Paper
Advertisement

2026 TVS X: స్పెషల్ ఆర్ట్ ఎడిషన్స్‌ లో TVS X, లుక్ భలే ఉందిగా!

2026 TVS X: స్పెషల్ ఆర్ట్ ఎడిషన్స్‌ లో TVS X, లుక్ భలే ఉందిగా!
Advertisement

New TVS X:  TVS మోటార్ కంపెనీ, 3 వన్ ఆఫ్ డిజైన్ ఆధారిత క్రియేషన్స్‌ లో భాగంగా TVS X కలెక్టర్స్ సోయిరీను ఆవిష్కరించింది. గతంలో ఎప్పుడూ లేని సరికొత్త లుక్ తో దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కస్టమ్ TVS X మెషీన్లను డిజైనర్ మనోవిరాజ్ ఖోస్లా సహకారంతో అభివృద్ధి చేశారు. ఇవి హంపి, చెన్నపట్న హస్తకళ, మైసూరు రాజవంశంతో సహా కర్ణాటక కళాత్మక,  వాస్తు వారసత్వం నుంచి ప్రేరణ పొందాయి. ఈ ప్రాజెక్ట్‌ కు స్పష్టమైన సాంస్కృతిక నేపథ్యాన్ని ఇస్తూ, బేస్ X మోడల్‌ కు మంచి గుర్తింపు తెచ్చింది. అది ఇందులో మరింతగా నొక్కి చెప్పబడింది.

ఈ సోయిరీ మొబిలిటీని ఒక సాంప్రదాయ ఉత్పత్తి ప్రదర్శన సెట్టింగ్‌ లో కాకుండా, డిజైన్, సంస్కృతి, హస్తకళల నేపథ్యంలో నిలపడానికి ఉద్దేశించబడింది. TVS X ఇప్పటికే ఒక నిర్దిష్ట డిజైన్, ఇంజనీరింగ్ ఆధారిత లక్షణాన్ని కలిగి ఉంది. దాని   ప్లాట్‌ ఫామ్, పనితీరు మరింతగా ఆకట్టుకోనున్నాయి.

Advertisement

TVS మోటార్ EV లైనప్‌ లో, TVS X  మరింత ఆకర్షణీయమైన డిజైన్‌పై ఎక్కువ దృష్టి సారించే మోడల్‌ గా నిలిచింది. దాని Xleton ప్లాట్‌ ఫామ్‌పై నిర్మించబడిన ఈ X, ఎక్కువ బలం కలిగిన అల్యూమినియం ఫ్రేమ్‌ ను ఉపయోగిస్తుంది. మంచి బిల్డ్ క్వాలిటీ కోసం ఈ నిర్ణయం తీసకుంది. ఈ స్కూటర్ సింపుల్ అమరిక, ఏరోడైనమిక్ డిజైన్ ను కలిగి ఉంది. ఇలాంటి డిజైన్ ఆధారిత మోడల్స్ కు TVS X మంచి పునాది కాబోతోంది.

Read Also: హిమాలయన్ 450 కావాలా? EMIలో కొనేయండి బ్రో

భారతీయ కళ, సాంస్కృతిక సమ్మేళనం

Advertisement

ప్రత్యేకంగా రూపొందించిన ఈ స్కూటర్, భారతీయ కళ, సాంస్కృతిక సమ్మేళనాలను ముందుకు తీసుకెళ్లడానికి, ఇలాంటి మరిన్ని ప్రయోగాల కోసం TVS Xను ఒక డిజైన్ కాన్వాస్‌ గా ఉపయోగించుకుంటుంది. TVS ఈ మోడల్ పాత్రను రవాణాకు మించి లైఫ్ స్టైల్, డిజైన్ రంగాలకు విస్తరించడానికి ప్రయత్నిస్తోంది. కర్ణాటక స్ఫూర్తితో ఎంచుకున్న థీమ్‌ లు, వేలం ద్వారా వచ్చే ఆదాయంతో కళాకారుల పనికి సపోర్ట్ ఇవ్వడం లాంటి ఈ కార్యక్రమానికి ముందడుగగా నిలువనుంది. త్వరలోనే ఈ స్కూటర్ కు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ వెల్లడించే అవకాశం ఉంది.

Read Also: కవాసకీ నింజాపై క్రేజీ ఆఫర్.. 28 వేల తగ్గింపు, ఫ్రీ KYT హెల్మెట్!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×