E-Paper
Advertisement

Himalayan 450: హిమాలయన్ 450 కావాలా? EMIలో కొనేయండి బ్రో

Himalayan 450: హిమాలయన్ 450 కావాలా? EMIలో కొనేయండి బ్రో
Advertisement

Royal Enfield Himalayan 450: 350 cc కేటగిరీలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బాగా ప్రజాదరణ పొందినప్పటికీ, 450 cc, 650 cc మోడళ్లతో పెద్ద బైక్ విభాగంలో సత్తా చాటేందుకు బాగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది పూర్తిగా రీడిజైన్ చేసిన అడ్వెంచర్ బైక్. హిమాలయన్ 411కి కొనసాగింపుగా అందుబాటులోకి వచ్చింది.

హిమాలయన్ 450 గురించి..

రాయల్ ఎన్‌ఫీల్డ్ 450లో రాయల్ ఎన్‌ఫీల్డ్ మొట్టమొదటి లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అయిన షెర్పా 450ని అమర్చారు. దీనిని సరికొత్త ట్విన్ స్పార్ స్టీల్ ఫ్రేమ్‌ మీద నిర్మించారు. ఈ మోటార్‌సైకిల్‌కు 452 cc, లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్, DOHC, ఫోర్ వాల్వ్ ఇంజన్ శక్తిని అందిస్తుంది. ఇది స్లిప్, అసిస్ట్ క్లచ్‌ తో కూడిన ఆరు స్పీడ్ గేర్‌ బాక్స్‌ కు జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ 8,000 rpm దగ్గర 39.5 bhp గరిష్ట శక్తిని, 5,500 rpm దగ్గర 40 Nm గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది.

హిమాలయన్ 450 ధర ఎంత అంటే?

Advertisement

సెలెక్ట్ చేసుకున్న కలర్ వేరియంట్‌ను బట్టి, రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 ధర రూ. 305,736 నుంచి రూ. 337,036 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది. మీరు రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 కొనాలని ప్లాన్ చేస్తే.. ఇప్పుడు EMIలో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అయితే, ఈ పద్దతిలో ఎంత ఖర్చు అవుతుంది? నెలల నెల ఎంత చెల్లించాల్సి ఉంటుంది? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

నెలకు ఎంత EMI చెల్లించాలంటే?

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 కోసం నెలవారీ EMI ఎంత కట్టాలనేది బైక్ టాప్ ఎండ్ ధర అయిన రూ. 337,036 (ఎక్స్ షోరూమ్)ను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అప్పు ఎక్స్ షోరూమ్ ధరలో 100%గా పరిగణించబడుతుంది.   వడ్డీ రేటు 9.5%గా ఉంటుంది.  తిరిగి చెల్లించే టైమ్ పీరియడ్ 12 నెలలు, 24 నెలలు, 36 నెలలుగా మూడు రకాలు ఉంటుంది.

Advertisement

Read Also:  కవాసకీ నింజాపై క్రేజీ ఆఫర్.. 28 వేల తగ్గింపు, ఫ్రీ KYT హెల్మెట్!

ఏ టైమ్ పీరియడ్ కు ఎంత కట్టాలంటే?

తాజాగా లెక్కల ప్రకారం 12 నెలల EMI సెలెక్ట్ చేసుకుంటే, నెలవారీ EMI రూ. 29,553 చెల్లించాల్సి ఉంటుంది. అటు 24 నెలల తిరిగి చెల్లింపు కాలపరిమితి విషయంలో రూ. 15,475కి తగ్గుతుంది. 36 నెలల తిరిగి చెల్లింపు కాలపరిమితికి వెళ్తే  మరింతగా తగ్గి రూ. 10,796కి చేరుతుంది. ఇంకెందుకు ఆలస్యం. మీరూ EMIలో ఈ బైక్ ను కొనుగోలు చేసేయండి.  అనుకూలమైన EMI ఆప్షన్ ను ఎంచుకోండి.

Read Also: పైసా లేకున్నా రాయల్ ఎన్‌ ఫీల్డ్ క్లాసిక్ 650 కొనొచ్చు, ఎలాగో తెలుసా?

Related News

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

కియా సైరోస్ EV vs కియా సైరోస్ ICE.. ఏది బెస్ట్? పూర్తి పోలిక ఇదే!

16 ఏళ్ల తర్వాత నిస్సాన్ మాస్టర్‌ పీస్.. కొత్త ఎల్గ్రాండ్ వచ్చేసింది!

భారత మార్కెట్ లోకి చౌకైన 7-సీటర్‌.. ఏంటీ.. ధర మరీ అంత తక్కువా?

MG కొత్త EV వచ్చేస్తోంది.. 600 కి.మీ రేంజ్‌తో అదిరే ఎంట్రీ!

సింగిల్ ఛార్జ్ తో 500 కి.మీ ప్రయాణం.. మార్కెట్ లో దుమ్మురేపబోతున్న హ్యుందాయ్ ఈవీ!

Big Stories

Advertisement
×