E-Paper
Advertisement

అల్ట్రావయోలెట్ టెసరాక్ట్ రిలీజ్ డిలే.. కారణం ఏంటంటే?

అల్ట్రావయోలెట్ టెసరాక్ట్ రిలీజ్ డిలే.. కారణం ఏంటంటే?
Advertisement

New Ultraviolette Electric Scooter: అల్ట్రావయోలెట్ కంపెనీ తయారు చేసిన టెసరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై మార్కెట్లో ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. ఈ స్కూటర్‌ ను మొదటగా 2025లో ఇండియన్ మార్కెట్ లోకి తీసుకురావాలని కంపెనీ భావించింది. కానీ, అనివార్య కారణాలతో విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ స్కూటర్ ప్రొడక్షన్ వెర్షన్ జూన్ 2026 తర్వాతే పూర్తిగా బయటకు రానుంది. నవంబర్ 2026లో ఇటలీలోని మిలన్‌లో జరిగే ఆటో షో EICMAలో   దీనిని ప్రదర్శించే అవకాశం ఉందని తెలుస్తోంది.

2026 మిడ్ ఇయర్ లో అందుబాటులోకి వస్తుందనుకున్నా..

Advertisement

ఈ స్కూటర్‌ను 2026 తొలి అర్ధభాగంలోనే మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ భావించింది. కానీ ఫీచర్లు, పనితీరు మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతో కంపెనీ అదనపు సమయం తీసుకుంటోంది. వినియోగదారులకు మంచి అనుభవం ఇవ్వాలన్నదే ఈ ఆలస్యానికి ప్రధాన కారణం అని కంపెనీ వెల్లడించింది.

ఫీచర్ల గురించి..

టెసరాక్ట్ స్కూటర్ చాలా అడ్వాన్స్‌ గా ఉంటుంది. ఇందులో బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ఓవర్‌ టేక్ అలర్ట్, కొలిజన్ అలర్ట్ లాంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇవి రైడింగ్ సమయంలో ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడతాయి. ముందు భాగంలో ఫ్లోటింగ్ DRLలతో కూడిన డ్యూయల్ LED ప్రొజెక్టర్ హెడ్‌ ల్యాంప్ ఉంటుంది. ఇది రాత్రి ప్రయాణంలో మంచి విజిబిలిటీ ఇస్తుంది. పెద్ద TFT టచ్‌ స్క్రీన్ డిస్‌ ప్లే ఉంటుంది. దీనిలో కనెక్టివిటీ ఫీచర్లు, రైడ్ అనలిటిక్స్ లాంటి సమాచారం అందుబాటులో ఉంటుంది. రైడర్‌ కు ప్రయాణానికి సంబంధించిన వివరాలు సులభంగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. కీలెస్ యాక్సెస్, పార్క్ అసిస్ట్, హిల్ హోల్డ్, క్రూయిజ్ కంట్రోల్, నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్ లాంటి ఫీచర్లు కూడా అందిస్తున్నారు.

అదిరిపోయే పర్ఫార్మెన్స్

Advertisement

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ స్కూటర్‌ లో 21bhp శక్తిని అందించే ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.9 సెకన్లలోనే అందుకుంటుంది. ఇది ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంచి వేగంగా చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే గరిష్టంగా 261 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. బ్యాటరీ ఎంపికల విషయానికి వస్తే, ఇందులో మూడు వేరియంట్లు ఉంటాయి. 3.5kWh, 5kWh, 6kWh సామర్థ్యాలతో బ్యాటరీలు లభిస్తాయి. మీరు ఎంచుకునే బ్యాటరీ పరిమాణాన్ని బట్టి స్కూటర్ రేంజ్ కూడా మారుతుంది. ఎక్కువ సామర్థ్యం ఉన్న బ్యాటరీ తీసుకుంటే మరింత దూరం ప్రయాణించవచ్చు.  అల్ట్రావయోలెట్ టెసరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లు, పనితీరు పరంగా చాలా ఆకర్షణీయంగా ఉంది. విడుదల కొంచెం ఆలస్యమైనా, మెరుగైన క్వాలిటీతో మార్కెట్లోకి రావడం వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి ఉన్నవారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా నిలిచే అవకాశముంది.

Read Also: రూ.5 లక్షల లోపు బెస్ట్ బడ్జెట్ కార్లు.. ఫస్ట్ టైమ్ బయ్యర్స్‌ కు టాప్ ఛాయిస్!

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×