E-Paper
Advertisement

విన్‌ ఫాస్ట్ To టయోటా.. 2027 నాటికి లాంచ్ కానున్నక్రేజీ 7 సీటర్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

విన్‌ ఫాస్ట్ To టయోటా.. 2027 నాటికి లాంచ్ కానున్నక్రేజీ 7 సీటర్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
Advertisement

Upcoming 7-Seater Electric Cars: భారత్ లో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ రోజు రోజుకు మరింత వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు చిన్న సైజ్ ఈవీలు ఎక్కువగా కనిపించగా, ఇప్పుడు పెద్ద ఫ్యామిలీ కార్లపై కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. ముఖ్యంగా 7 సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు, ఎంపీవీల కోసం డిమాండ్ పెరుగుతోంది. కుటుంబ ప్రయాణాలకు అనువుగా ఉండే విశాలమైన క్యాబిన్, ఎక్కువ రేంజ్, ఆధునిక ఫీచర్లతో కొత్త మోడళ్లను తయారీ సంస్థలు సిద్ధం చేస్తున్నాయి. 2027 నాటికి కొత్త 7 సీటర్ ఎలక్ట్రిక్ వాహనాలను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి పలు టాప్ బ్రాండ్లు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఇంతకీ ఆ మోడల్స్ ఏవంటే..

⦿ Tata Safari EV

టాటా ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో మంచి స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు సఫారీ ఈవీ ద్వారా పెద్ద ఫ్యామిలీ ఎస్‌యూవీ సెగ్మెంట్‌ లోకి అడుగుపెట్టనుంది. ఈ మోడల్ ఈ ఏడాది పండుగ సీజన్ లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణ సఫారీ మాదిరిగానే డిజైన్ ఉండే ఈ ఎలక్ట్రిక్ వెర్షన్‌ లో క్లోజ్డ్ గ్రిల్, కొత్త LED లైట్లు, ఏరోడైనమిక్ వీల్స్ లాంటి మార్పులతో రానుంది. లోపల ట్రిపుల్ స్క్రీన్ సెటప్, పనోరమిక్ సన్‌ రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, కనెక్టెడ్ టెక్నాలజీ లాంటి ప్రీమియం ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. పెద్ద బ్యాటరీ వేరియంట్‌ లో 600 కిలోమీటర్లకు పైగా రేంజ్ అందించే అవకాశముంది.

⦿ Maruti Suzuki YMC

Advertisement

మారుతి సుజుకి రూపొందిస్తున్న తొలి ఎలక్ట్రిక్ ఎంపీవీ ఇది. ప్రస్తుతం ఉన్న ఎర్టిగా కంటే పెద్దదిగా ఉండనుంది.5-సీటర్, 7-సీటర్ ఎంపికలతో ఈ వాహనం వచ్చే అవకాశం ఉంది.  ఈ ఎంపీవీలో డ్రైవర్ సీటు, పెద్ద టచ్‌ స్క్రీన్, 360 డిగ్రీ కెమెరా, ADAS భద్రతా ఫీచర్లు, పనోరమిక్ గ్లాస్ రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు లాంటి ఫీచర్లు ఉండవచ్చని భావిస్తున్నారు. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించనున్నట్లు తెలుస్తోంది.

⦿ Toyota YMC

ఇది కూడా మారుతి YMC ప్లాట్‌ ఫారమ్ ఆధారంగా రూపొందుతోంది. మారుతి YMCతో బ్యాటరీ, పవర్‌ ట్రెయిన్ ఒకేలా ఉన్నా, డిజైన్ పరంగా టయోటా ప్రత్యేక మార్పులు చేయనుందని సమాచారం.

⦿ Tata Avinya X

Advertisement

ఇక టాటా నుంచి రాబోతున్న ప్రీమియం మోడల్ ఇది. 5, 6, 7 సీటర్ వెర్షన్లలో వచ్చే అవకాశం ఉంది. దాదాపు 5 మీటర్ల పొడవుతో ఉండే ఈ వాహనంలో భవిష్యత్ తరహా డిజైన్, కొత్త టెక్నాలజీ ఫీచర్లు ఉండనున్నాయి.

⦿ VinFast Limo Green

వియత్నాం కంపెనీ విన్ ఫాస్ట్ కూడా భారత మార్కెట్‌ పై ఫోకస్ పెట్టింది. ఈ సంస్థ పేరుతో 7 సీటర్ ఎలక్ట్రిక్ ఎంపీవీని తీసుకురావాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇది ముఖ్యంగా ఫ్లీట్ సర్వీసులు, క్యాబ్ మార్కెట్‌ ను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. రాబోయే రెండేళ్లలో భారతీయ మార్కెట్లో పెద్ద ఎలక్ట్రిక్ ఫ్యామిలీ కార్ల పోటీ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Read Also: టాటా మెగా ప్లాన్.. మూడు కళ్లు చెదిరే ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లు వచ్చేస్తున్నాయ్!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×