E-Paper
Advertisement

వైరల్ వీడియో.. పబ్లిక్‌గా ‘బూతు’ పదం వాడేసిన రష్మిక.. నెటిజన్లు ఫైర్!

వైరల్ వీడియో.. పబ్లిక్‌గా ‘బూతు’ పదం వాడేసిన రష్మిక.. నెటిజన్లు ఫైర్!
Advertisement

Rashmika Controversy : రష్మిక మందన్నా…చలో సినిమాతో పొలో మంటూ తెలుగు నాట అడుగెట్టిన ఈ కన్నడ కస్తూరి గీత గోవిందం సినిమాతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపొయింది. ఇక అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప సిరీస్ తో ఒక్కసారిగా నేషనల్ వైడ్ క్రేజ్ కొట్టేసింది.ముఖ్యంగా బాలీవుడ్‌లో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకొని, అక్కడ వరుసగా క్రేజీ ఆఫర్లను దక్కించుకుంటూ టాప్ లీగ్‌లోకి దూసుకెళ్లింది. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే, ఇటీవల తెలుగు స్టార్ హీరో విజయ్ దేవరకొండను పెళ్లాడి ‘తెలుగింటి కోడలిగా’ మారిన రష్మిక.. ప్రస్తుతం ఒక పబ్లిక్ ఈవెంట్లో టంగ్ స్లిప్ అయ్యి కాంట్రవర్సీలో ఇరుక్కుంది.అవును ..రష్మిక నోటి వెంట వచ్చిన ఒక ‘బూతు పదం’ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయిపొయింది.

also read :మీడియాపై మాళవిక మోహనన్ ఫైర్.. ‘దళపతి విజయ్’ టాపిక్ పై సంచలన పోస్ట్!

Advertisement

ఈవెంట్‌లో అసలేం జరిగిందంటే..

విషయంలోకి వెళ్తే బాలీవుడ్‌లో రష్మిక నటిస్తున్న క్రేజీ ఫిలిమ్‘కాక్ టైల్ 2’ (Cocktail 2). చాక్లెట్ బాయ్ షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కూడా మరో హీరోయిన్ గా కనిపించనుంది.ఇక సినిమా రిలీజ్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ లో వేగం పెంచింది మూవీ టీమ్. ఇందులో భాగంగా మూవీ నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ ఆడియన్స్ కి బాగా రీచ్ అయ్యాయి కూడా.ఇక ఇదే క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను తాజాగా ముంబైలో గ్రాండ్‌గా నిర్వహించింది చిత్ర యూనిట్. ఇక ఈవెంట్ కి హీరోతో పాటు రష్మిక, కృతి సనన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలించారు.ఇక ఈ ఈవెంట్ వేదికపై రష్మిక తనతో పాటు కలిసినటించిన కృతి సనన్‌ను తెగ పొగిడేసింది.కృతి గ్లామర్, ఆమె పర్సనాలిటీ గురించి చెబుతూ రష్మిక ఒక్కసారిగా ఎమోషన్ అయిపోయింది. ఆ ఫ్లోలో నోరు జారి ఇంగ్లీష్‌లోని ‘F..’ అనే బూతు పదాన్ని వాడేసింది. “నువ్వు చాలా హాట్ గా ఉంటావు. అది ప్రపంచానికి తెలుసు. నిజంగా నువ్వు ‘Fking Hot’” అంటూ మైక్‌లోనే బిగ్గరగా అనేసింది. ఆ పదం నోటి నుంచి వచ్చి రాగానే తప్పు తెలుసుకున్నరష్మిక వెంటనే నాలుక కరుచుకొని షాక్‌కు గురైంది. “సారీ.. సారీ.. ప్లీజ్ ఆ పదాన్ని సైలెంట్ (మ్యూట్) చేయండి” అంటూ నవ్వుతూ కవర్ చేసే ప్రయత్నం చేసింది మన నేషనల్ క్రష్.ఇక పక్కనే ఉన్న కృతి సనన్, షాహిద్ కపూర్ కూడా రష్మిక రియాక్షన్‌ చూసి నవ్వేసినప్పటికీ, అక్కడ ఉన్న మీడియా కెమెరాల్లో ఈ సీన్ అంతా రికార్డ్ అయిపోయింది.

Advertisement

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

ఇక ఇదే ఈవెంట్లో రష్మిక మాట్లాడుతుండగా పక్కనే ఉన్న బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ఆమె భుజంపై చేయి వేయబోతుండగా రష్మిక అసౌకర్యంగా ఫీల్ అవుతూ తప్పించుకుంది.కానీ పక్కనే ఉన్న మరో ఆర్టిస్ట్ రష్మిక భుజం మీద చేయి వేసినా ఏమనకపోవడం ఇక్కడ గమనార్హం.

సోషల్ మీడియాలో నెటిజన్ల ఫైర్..

ఇక రష్మిక ఇలా నోరు జారిందో లేదో ఒక్కసారిగా ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ లో తెగ వైరల్ అయిపొయింది. దీంతో ఈ వీడియో పై రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు. ముఖ్యంగా తెలుగు వారు స్పందిస్తూ గతంలో నువ్ ఒక హీరోయిన్ గా ఏమన్నా ఎలా ఉన్నా చెల్లింది.కాని ఇపుడు విజయ్ దేవర కొండని పెళ్లి చేసుకున్నావు. ముఖ్యంగా తెలుగింటి కోడలివి. మన సంస్కృతి, సాంప్రదాయాల ప్రకారం పబ్లిక్‌లో మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడాలి. ఇలాంటి బూతు పదాలు వాడితే అత్తవారింటికి, అటు దేవరకొండ కుటుంబానికి చెడ్డపేరు వస్తుంది”గట్టిగానే హిత బోధ చేస్తున్నారు. ఇక నేషనల్ క్రష్ ఫ్యాన్స్ మాత్రం కృతి సనన్ అందాన్ని చూసి మురిసిపోయి ప్రేమతో, క్యాజువల్‌గా ఆ మాట అనేసిందని.. కావాలని ఎవరినీ కించపరచడానికి అనలేదు కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలంటూ సపోర్ట్ కామెంట్స్ వదులుతున్నారు. ఇంగ్లీష్ కాన్వ‌ర్జేష‌న్స్‌లో ఈ పదం ఈ రోజుల్లో కామన్ అయిపోయిందని కవరప్ చేయడానికి ట్రై చేస్తున్నారు..ఇక ఆమధ్య జాక్ సినిమా ఈవెంట్ లో వైష్ణవీ కూడా ఇలాగే టంగ్ స్లిప్ అయిన సంగతి తెల్సిందే.

వరుస సినిమాలతో బిజీగా రష్మిక..
ఈ కాంట్రవర్సీ సంగతి పక్కన పెడితే రష్మిక కెరీర్ ప్రస్తుతం పీక్ స్టేజ్‌లో ఉందనే చెప్పాలి. డిసెంబర్ 2024 లో వచ్చిన పుష్ప ది రూల్(Pushpa 2) తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ బ్యూటీ, ప్రస్తుతం మైసా (Mysaa) లేడీ ఓరియెంటెడ్ ప్యాన్-ఇండియా యాక్షన్ డ్రామాతో పాటు రణబలి (Ranabaali)లో విజయ్ దేవరకొండ కి జోడీగా జయమ్మ’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తున్న సంగతి తెల్సిందే.వీటితో పాటు AA22xA6 అయిన రాకాలో కీ రోల్ పోషిస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి .కాని కన్ఫాం కావాల్సి ఉంది.చూడాలి మరి ఇకనైనా మైక్ పట్టుకోగానే,రెచ్చిపోకుండా జాగ్రత్తగా ఉంటుందో లేక ఎప్పటిలాగే టంగ్ స్లిప్ అవుతుందో !

also read :‘పెద్ది’ ట్రైలర్ చూసి కంట్రోల్ తప్పిన చిరంజీవి.. డైలాగ్ లీక్ చేస్తూ ఊరమాస్ రివ్యూ!

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×