E-Paper
Advertisement

EV Scooters Mar 2026: యమహా To వెస్పా.. మార్చిలో లాంచ్ అయ్యే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

EV Scooters Mar 2026:  యమహా To వెస్పా.. మార్చిలో లాంచ్ అయ్యే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
Advertisement

మార్చి 2026లో అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల కాబోతున్నాయి. పలు పాపులర్ బ్రాండ్స్ నుంచి కొత్త, హై ప్రొఫైల్ మోడల్స్ లాంచ్ అవుతున్నాయి. మార్కెట్ లో ట్రెండింగ్ లో ఉన్నయమహా, ఏథర్, గొగోరో లాంటి మెయిన్ ప్లేయర్స్ నుంచి ఈ మోడల్స్ పరిచయం కాబోతున్నాయి. ఫ్యామిలీ ప్రయాణాలకు అనుకూలంగా, తక్కువ రన్నింగ్ కాస్ట్ తో ప్రీమియం, హై పర్ఫార్మెన్స్ మోడల్స్ విడుదల అవుతున్నాయి.

మార్చి 2026లో రాబోయే EV స్కూటర్ల  

⦿ యమహా AEROX-E: ఈ స్కూటర్ మార్చి 2026 లాంచ్ కానుంది. అంచనా ధర రూ. 2.50 లక్షలు నుంచి రూ. 2.90 లక్షలు (ఎక్స్ షోరూమ్) ఉంటుంది. స్పోర్టీ లుక్, అధిక పనితీరు గల ఎలక్ట్రిక్ స్కూటర్‌గా పరిచయం కానుంది. ఇది 9.4 kW ఎలక్ట్రిక్ మోటారు, డ్యూయల్ రిమూవబుల్ 3 kWh బ్యాటరీ ప్యాక్‌ లను కలిగి ఉంటుంది. ఇది ఛార్జ్‌ తో దాదాపు 106 కి.మీ పరిధిని అందిస్తుంది. సింగిల్ ఛానల్ ABS, బ్లూటూత్ కనెక్షన్ తో కూడిన 5 అంగుళాల TFT డిస్ ప్లే, స్మార్ట్ కీ సిస్టమ్ ఉంటుంది.

Advertisement

⦿ ఆల్ట్రావాయిలెట్ టెస్రాక్ట్: ఈ స్కూటర్ కూడా మార్చి 2026లో లాంచ్ కానుంది. 2026 సెకెండ్ క్వార్టర్ లో డెలివరీలో ప్రారంభం కానున్నాయి. ఈ స్కూటర్ అంచనా ధర రూ. 1.20 లక్షల నుంచి రూ. 1.45 లక్షల వరకు ఉంటుంది.  ప్రీమియం  ఎలక్ట్రిక్ స్కూటర్ గా రానుంది. అధునాతన, బ్యాటరీతో నడిచే సాంకేతికతను కలిగి ఉంది. 3.5 kWh, 5 kWh, 6 kWh బ్యాటరీ ప్యాక్స్ తో వస్తుంది. ఒకే ఛార్జ్ తో 162 కి.మీ నుంచి 261 కి.మీ వరకు పరిధిని అందిస్తుంది.

⦿  గోగోరో 2 సిరీస్: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా మార్చిలోనే లాంచ్ కానుంది. దీని ధర రూ. 1.50 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ తైవానీస్ మోడల్ బ్యాటరీ రిమూవబుల్ ఆప్షన్ తో వస్తుంది. ఇది ఒకే ఛార్జ్ తో 170 కి.మీ పరిధిని కలిగి ఉంటుంది. గరిష్ట వేగం గంటకు 90 కి.మీ ఉంటుంది. ఇందులో 7 kW మోటార్, స్మార్ట్ కీలెస్ యాక్సెస్, 25 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ తో పట్టణ ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది.

Advertisement

⦿  లైగర్ ఎక్స్: ఈ స్కూటర్ మార్చి 2026లో లాంచ్ కానుంది. అంచనా ధర రూ. 90 నుంచి ప్రారంభం అవుతుంది. ఇది ఒకే ఛార్జ్ తో 100 కి.మీ వరకు పరిధిని అందిస్తుంది. గంటకు 65 కి.మీ గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. 4G కనెక్టివిటీ, మొబైల్ యాప్ ఇంటిగ్రేషన్, అధునాతన భద్రత, క్రాష్ కనెక్ట్ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

⦿ వెస్పా ఎలక్ట్రిక్ స్కూటర్: ఈ స్కూటర్ కూడా మార్చిలోనే విడుదల అవుతుంది. ఈ స్కూటర్ అంచనా ధర రూ. 1.70 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. క్లాసిక్, ఇటాలియన్, డిజైన్ తో వస్తుంది. ఒకే ఛార్జ్ తో 100 కి.మీ అందిస్తుంది. గంటకు 70 కి.మీ గరిష్ట వేగాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. దీనిలో 3.6 kW మోటార్, రీ జెనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థ, స్మార్ట్‌ ఫోన్ ఎనేబుల్డ్, నావిగేషన్ ఉంటుంది.

Read Also: బజాజ్ రికి To మహీంద్రా గోగో.. మార్చిలో లాంచ్ కాబోయే క్రేజీ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు ఇవే!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×