E-Paper
Advertisement

Upcoming Honda Bikes 2026: హోండా నుంచి రాబోయే క్రేజీ బైక్స్.. ధర, ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

Upcoming Honda Bikes 2026: హోండా నుంచి రాబోయే క్రేజీ బైక్స్.. ధర, ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!
Advertisement

2026లో భారత మార్కెట్‌ లోకి హోండా నుంచి సరికొత్త బైక్‌లు, స్కూటర్లు లాంచ్ కాబోతున్నాయి. వీటిలో ఎక్కువగా లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇంతకీ కొత్త సంవత్సరంలో లాంచ్ కాబోయే మోడల్స్ ఏవి అనే విషయాన్ని ఇప్పుడు తెసుకునే ప్రయత్నం చేద్దాం..

2026లో విడుదల కాబోయే బైకులు 

⦿ Honda Africa Twin: ఫ్లాగ్‌ షిప్ అడ్వెంచర్ బైక్ తిరిగి మళ్లీ మార్కెట్లోకి రాబోతోంది. బేస్, అడ్వెంచర్ స్పోర్ట్స్ వేరియంట్లలో రాబోతున్నట్లు తెలుస్తోంది. దీని ధర ధర సుమారు రూ.15-20 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Advertisement

⦿ Honda Rebel 300: ఈ క్రూయిజర్ స్టైల్ బైక్.. CB300R ఇంజిన్ తో రాబోతోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ 350లకు పోటీగా మార్కెట్లోకి అడుగు పెట్టబోతోంది. దీని ధర సుమారు రూ. 2.2-2.5 లక్షలు ఉంటుందని అంచనా.

⦿ Honda CBR300R: ఈ స్పోర్టీ బైక్.. బిగినర్స్ కోసం అనుకూలంగా ఉంటుంది. మే 2026లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ధర వివరాలను ఇంకా ప్రకటించలేదు.

Advertisement

⦿ Honda CB500F / CBR500R / CL500 Scrambler: మిడిల్ వెయిట్ మోడల్స్ గా అందుబాటులోకి రాబోతున్నాయి.  బిగ్‌ వింగ్ డీలర్‌ షిప్‌ ల ద్వారా వీటిని మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.

⦿ కొత్త 500cc ప్లాట్‌ ఫాం బైక్‌లు: భారత్ స్పెసిఫిక్ రెండు మోడల్స్ (కోడ్‌నేమ్స్ MLHJ, MLWA) అందుబాటులోకి రానున్నాయి. వీటి ధర సుమారు రూ. 2.5 లక్షలు ఉంటుంది.

⦿ Honda CBR600RR: ఈ సూపర్‌ స్పోర్ట్ బైక్ ధర సుమారు రూ. 13-15 లక్షలు ఉంటుంది. ఈ బైక్ 2026 ఫస్ట్ క్వార్టర్ 2026లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

⦿ Honda CB1000R / CB1000 Hornet: ఈ ప్రీమియం నేకెడ్ బైక్‌ల ధర సుమారు రూ.14-17 లక్షలు ఉంటుంది. త్వరలోనే లాంచ్ డేట్ వెల్లడయ్యే అవకాశం ఉంది.

Read Also: మారుతి సుజుకి కార్లు వాడుతున్నారా? అయితే, మీ కోసమే ఈ గుడ్ న్యూస్!

హోండా ఇతర మోడల్:

⦿Activa 7G: పాపులర్ స్కూటర్ అప్‌ డేట్ వెర్షన్ జనవరి 2026లో అందుబాటులోకి రానుంది.

⦿ ADV 160: అడ్వెంచర్ స్టైల్ స్కూటర్ కూడా 2026లో అందుబాటులోకి రానుంది. ఈ బైక్ యమహా ఏరాక్స్‌ కు పోటీగా మార్కెట్లో అడుగు పెట్టనుంది.

⦿ఎలక్ట్రిక్ మోడల్స్: హోండా 10 కొత్త ఈవీలు ప్లాన్ చేస్తోంది. 2026-2027 వరకు ఈ స్కూటర్స్  విడుదల కానున్నాయి. వీటిలో ముఖ్యమైనది హోండా యాక్టివా ఎలక్ట్రిక్. ఈ స్కూటర్ ధర సుమారు రూ. 1-1.2 లక్షలు ఉంటుంది. 2026లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ఇక హోండా తీసుకురాబోయే మోడల్స్ ఎక్కువగా బిగ్‌ వింగ్ ప్రీమియం సెగ్మెంట్‌ ను ఫోకస్ చేస్తున్నాయి.

Read Also: ఎలక్ట్రిక్ To పెట్రోల్.. 2026లో లాంచ్ కాబోతున్న క్రేజీ స్కూటర్లు ఇవే!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×