దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్ 2026లో మరింత విస్తరించబోతోంది. FAME III సబ్సిడీలు, కొత్త బ్రాండ్ల (Yamaha, Suzuki, VinFast) ఎంట్రీతో మరింత వేగంగా ప్రజాదరణ పొందబోతోంది. 2026లో ఏకంగా 50+ మోడల్స్ మార్కెట్లోకి రాబోతున్నాయి. చాలా వరకు ఎలక్ట్రిక్. పెట్రోల్/CNG మోడల్స్ కూడా ఉన్నాయి. త్వరలో అందుబాటులోకి రాబోతున్న ప్రధాన మోడల్స్, అంచనా ధర, లాంచ్ డేట్, కీలక ఫీచర్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
⦿ Yamaha Aerox E: ఈ స్కూటర్ 2026 ఫస్ట్ క్వార్టర్ లో విడుదలయ్యే అవకాశం ఉంది. ధర రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు ఉంటుంది. 3kWh బ్యాటరీ ఉంటుంది. 100+ km రేంజ్ ను కలిగి ఉంటుంది. 9.4 kW మోటార్, 48 Nm టార్క్, ప్రీమియం డిజైన్, రివర్స్ మోడ్, LCD క్లస్టర్ ఉంటుంది.
⦿ Yamaha EC-06: ఈ స్కూటర్ కూడా 2026 ఫస్ట్ క్వార్టర్ లో అందుబాటులోకి రానుంది. ధర రూ. 1.00 – 1.30 లక్షలు ఉంటుంది. 4 kWh బ్యాటరీ, 160 km రేంజ్, 4.5 kW మోటార్, థ్రీ రైడింగ్ మోడ్స్, టెలిమాటిక్స్ ను కలిగి ఉంటుంది.
⦿ Ather EL01: ఈ స్కూటర్ 2026 సెకండ్ హాఫ్లో రానుంది. దీని ధర రూ. 1 లక్ష వరకు ఉంటుంది. లో కాస్ట్ ఫ్యామిలీ స్కూటర్, AEBS బ్రేకింగ్, AtherStack 7.0, వాయిస్ కమాండ్స్, ఆన్ బోర్డ్ ఛార్జర్, 100+ km రేంజ్ ను కలిగి ఉంటుంది.
⦿ Suzuki e-Access: ఇది కూడా 2026 ఫస్ట్ క్వార్టర్ లో అందుబాటులోకి రానుంది. దీని ధర రూ. 1 లక్ష నుంచి రూ. 1.10 లక్షలు ఉంటుంది. 3.07 kWh బ్యాటరీ, 95 km రేంజ్, ఫాస్ట్ ఛార్జ్ (2 గంటలు), మల్టీ మోడ్స్, రీజెనరేటివ్ బ్రేకింగ్ ఫీచర్లను కలిగి ఉంటుంది.
⦿ Bajaj Chetak Gen 3: 2026 మిడ్ ఇయర్ లో అందుబాటులోకి రానుంది. దీని ధర రూ. 1 లక్ష నుంచి 1.20 లక్షలు ఉంటుంది. 3-3.5 kWh బ్యాటరీ, 150 km రేంజ్, కాస్మెటిక్ అప్‌డేట్స్ (LED టైల్ ల్యాంప్), హబ్ మోటార్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ కలిగి ఉంటుంది.
⦿ Hero Leap Hybrid SES: 2026 ప్రారంభంలో అందుబాటులోకి రానుంది. దీని ధర రూ. 80 వేల వరకు ఉంటుంది. హైబ్రిడ్ (పెట్రోల్+ఎలక్ట్రిక్), 65-90 km ఎలక్ట్రిక్ రేంజ్, డిజిటల్ క్లస్టర్, LED లైటింగ్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ తో వస్తుంది.
⦿ Suzuki Burgman Electricఫ 2026 మిడ్ ఇయర్ లో అందుబాటులోకి వస్తుంది. ధర రూ. 1.20 లక్షల నుంచి రూ. 1.50 లక్షల వరకు ఉంటుంది. ప్రీమియం డిజైన్, 100-120 km రేంజ్, మల్టీ ఫంక్షన్ స్విచ్, ఓవర్ ఛార్జ్ ప్రివెన్షన్ ఫీచర్లను కలిగి ఉంటుంది.
⦿ Hero Electric AE-3ఫ ఈ స్కూటర్ 2026 ప్రారంభంలో అందుబాటులోకి వస్తుంది. రూ. 90 వేల వరకు ధర ఉంటుంది. కాంపాక్ట్ EV, 70-90 km రేంజ్, బడ్జెట్ ఆప్షన్, బేసిక్ ఫీచర్లను కలిగి ఉంటుంది.
పెట్రోల్/CNG/హైబ్రిడ్ మోడల్స్
⦿ Honda Activa 7Gఫ జనవరి 20260లో అందుబాటులోకి రానుంది. రూ. 95 వేల వరకు ఉంటుంది. 110cc అప్‌గ్రేడెడ్ ఇంజిన్, 60 kmpl, డిజిటల్ డిస్ ప్లేతో వస్తుంది.
⦿ TVS Jupiter 125 CNGఫ 2026 మిడ్ ఇయర్ లో అందుబాటులోకి రానుంది. దీని ధర రూ. 1 లక్ష వరకు ఉంటుంది. ఇది ప్రపంచంలోనే తొలి CNG స్కూటర్ గా గుర్తింపు తెచ్చుకోనుంది. 84 km/kg CNG + పెట్రోల్, 226 km టోటల్ రేంజ్ ను కలిగి ఉంటుంది.
⦿Yamaha NMax 155ఫ ఇది మార్చి 2026లో అందుబాటులోకి రానుంది. రూ. 1.30 లక్షల నుంచి రూ. 1.60 లక్షల వరకు ఉంటుంది. 155cc ప్రీమియం ఇంజిన్, 50 kmpl, అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉంటాయి.
⦿Honda Forza 350: 2026 ప్రారంభంలో అందుబాటులోకి రానుంది. ధర రూ.2.50 లక్షల నుంచి రూ. 3.00 లక్షల వరకు ఉంటుంది. 330cc మాక్సీ-స్కూటర్, 30 kmpl, అడ్వాన్స్ డ్ సస్పెన్షన్ ను కలిగి ఉంటుంది.
Read Also: 2026లో విడుదల కానున్న టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవి, ఒక్కోదాని ప్రత్యేకత ఏంటంటే?