E-Paper
Advertisement

New Year Offer 2026: స్కోడా కుషాక్ To మహీంద్రా XUV700.. ఏకంగా రూ.2.5 లక్షల డిస్కౌంట్!

New Year Offer 2026:  స్కోడా కుషాక్ To మహీంద్రా XUV700.. ఏకంగా రూ.2.5 లక్షల డిస్కౌంట్!
Advertisement

ఈ ఏడాది దేశీయ ఆటో మోబైల్ మార్కెట్ మంచి ప్రగతి కనబరిచింది. చాలా వరకు కార్ల అమ్మకాల్లో మంచి పెరుగుదల కనిపించింది. 2025 ఎండింగ్ కు చేరడంతో 2026ను ఇదే జోష్ తోకొనసాగించాని ఆటో మోబైల్ కంపెనీలు భావిస్తున్నాయి. 2026లో ఆయా కంపెనీల నుంచి కొత్త కార్లు అందుబాటులోకి రాబోతున్నాయి. తయారీదారులు కొత్త లాంచ్‌లకు సిద్ధమవుతున్నందున.. ఇప్పటికే ఉన్న ఇన్వెంటరీని క్లియర్ చేయాలని భావిస్తున్నారు. అవుట్‌ గోయింగ్ మోడళ్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తున్నారు. వీటికి వెయిటింగ్ పీరియడ్ కూడా లేదు. 2026లో రిఫ్రెష్ చేయబోయే మోడళ్లపై ఎక్కవ డిస్కౌంట్లు అందిస్తున్నాయి?

⦿ స్కోడా కుషాక్: రూ.2.50 లక్షల డిస్కౌంట్‌

స్కోడా కుషాక్ ఫేస్‌ లిఫ్ట్ అవుట్‌ గోయింగ్ మోడల్ పై మంచి డిస్కౌంట్ అందిస్తుంది. సుమారు రూ.2.50 లక్షల వరకు తగ్గింపుతో అందుబాటులో ఉంచింది. ఈ విషయాన్ని స్కోడా డీలర్‌ షిప్ వర్గాలు ధృవీకరించాయి. ఇందులో రూ.50,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉంది. అయితే, స్కోడా అధికారికంగా కుషాక్ పై రూ. 3.25 లక్షల తగ్గింపును అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో కొన్ని అదనపు కార్పొరేట్, స్క్రాపేజ్ ఆఫర్లు ఉన్నాయి. ప్రస్తుతం, స్కోడా కుషాక్ ధర రూ. 10.61 లక్షల నుంచిరూ. 18.43 లక్షల మధ్య ఉంది.

⦿ కియా సెల్టోస్: రూ. 1.60 లక్షల తగ్గింపు

Advertisement

కొత్త తరం కియా సెల్టోస్ 2026లో లాంచ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో అవుట్ గోయింగ్ సెల్టోస్ రూ. 40,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో సహా దాదాపు రూ. 1.60 లక్షల తగ్గింపు ఆఫర్‌ అందిస్తుంది. సెల్టోస్ ప్రస్తుతం రూ. 10.79 లక్షల నుంచి రూ. 19.81 లక్షల వరకు ఉంది. జనవరి 2న విడుదల కానున్న రాబోయే మోడల్ ధర కొంచెం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.

⦿ మహీంద్రా XUV700: రూ. 80,000 తగ్గింపు

మహీంద్రా ఫేస్‌ లిఫ్టెడ్ XUV700 SUVని టీజ్ చేసింది. దీనిని XUV 7XO అని పిలుస్తున్నారు. జనవరి 5, 2026న ఫేస్‌ లిఫ్ట్ ప్రారంభం కానుండటంతో, కొంతమంది మహీంద్రా డీలర్లు XUV700 పై దాదాపు రూ. 80,000 తగ్గింపును అందిస్తున్నారు. ప్రస్తుతం, మహీంద్రా XUV700 ధర రూ. 13.66 లక్షల నుంచి రూ. 23.71 లక్షల మధ్య ఉంది.

Advertisement

Read Also: 2026లో లాంచ్ కాబోతున్న రెనాల్ట్ కార్లు ఇవే, సరికొత్తగా డస్టర్ రీఎంట్రీ!

⦿ టాటా పంచ్: రూ. 80,000 తగ్గింపు

టాటా కొంతకాలంగా పంచ్ ఫేస్‌ లిఫ్టెడ్ వెర్షన్‌ ను టెస్ట్ చేస్తోంది. మైక్రో-SUV 2026లో మిడ్ సైకిల్ అప్‌ డేట్‌ను పొందే అవకాశం ఉంది. XUV700 లాగానే, పంచ్ కూడా దాదాపు రూ. 80,000 తగ్గింపులతో అందుబాటులో ఉంది. ప్రస్తుతం దీని ధర రూ. 5.50 లక్షల నుంచి రూ. 9.30 లక్షల మధ్య ఉంది.

సో, కొత్త కార్లను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు వెంటనే కొనుగోలు చేస్తే, మంచి తగ్గింపు పొందే అవకాశం ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే నచ్చిన కారును సెలెక్ట్ చేసుకోని, ఇంటికి తెచ్చుకోండి.

Read Also:  సత్తా చాటిన సుజుకి విక్టోరిస్.. ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్- 2026గా గుర్తింపు!

Related News

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×