E-Paper
Advertisement

Upcoming TATA Cars: అదిరిపోయే ఫీచర్లే, క్రేజీ లుక్.. 2026లో ఎంట్రీ ఇవ్వబోతున్న టాటా కార్లు ఇవే!

Upcoming TATA Cars: అదిరిపోయే ఫీచర్లే, క్రేజీ లుక్.. 2026లో ఎంట్రీ ఇవ్వబోతున్న టాటా కార్లు ఇవే!
Advertisement

Upcoming TATA Cars 2026: టాటా మోటార్స్ గత కొద్ది సంవత్సరాలుగా క్రేజీ కార్లను మార్కెట్లోకి తీసుకొస్తుంది. ఒకప్పుడు బండకార్లను తీసుకొచ్చే ఈ ఆటో మోబైల్ దిగ్గజం ఇప్పుడు అదిరిపోయే లుక్, అద్భుతమైన ఫీచర్లతో సూపర్, డూపర్ కార్లను పరిచయం చేస్తోంది. ఇటీవల టాటా సియెర్రా ICE వెర్షన్ లాంచ్ అయింది. ధర రూ. 11.49 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లోకి అడుగు పెట్టనుంది. ఈ మంత్ ఎండ్ తో పాటు 2026లో టాటా నుంచి అద్భుత కార్లు అందుబాటులోకి రాబోతున్నాయి.  ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

2026లో లాంచ్ కాబోయే టాటా కార్లు

⦿ టాటా సియెర్రా EV

ఈ క్రేజీ కారు  జనవరి 2026 ప్రారంభం. acti.ev ప్లాట్‌ఫాం, 65kWh, 75kWh బ్యాటరీ, 500+ km రేంజ్, RWD & AWD ఆప్షన్లు, లెవెల్ 2 ADAS, 360° కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, ప్రీమియం ఇంటీరియర్ లాంటి ఫీచర్లతో అందుబాటులోకి రానుంది. ఈ కారు అంచనా ధర రూ. 20-30 లక్షలు. ఈ కారు కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో హ్యుందాయ్ క్రెటా EV, మహింద్రా XEV 9e, కియా సెల్టోస్‌ కు పోటీ ఇస్తుంది.

⦿ టాటా సఫారీ EV

Advertisement

ఈ కారు 2026 మధ్యలో లేదంటే చివరలో అందుబాటులోకి రానుంది. 500+ km రేంజ్, AWD ఆప్షన్, లెవెల్-2 ADAS, 7 సీటర్, పెద్ద టచ్‌ స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు, V2L/V2V చార్జింగ్ సదుపాయం లాంటి ఫీచర్లు ఉంటాయి.  అంచనా ధర రూ. 25-35 లక్షలు ఉంటుంది. మైక్రో SUV సెగ్మెంట్‌ లో ఫ్రెష్ లుక్ తో మహింద్రా XUV700 EVతో పోటీ పడనుంది.

⦿ టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్

ఈ కారు 2026 ఫస్ట్ హాఫ్ లో లాంచ్ కానుంది.  కొత్త డిజైన్ (కనెక్టెడ్ LED బార్), 10.25 ఇంచ్ టచ్‌ స్క్రీన్, 6 ఎయిర్‌ బ్యాగ్స్, 360° కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు, CNG ఆప్షన్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. అంచనా ధర రూ. 6-11 లక్షలు.

Advertisement

Read Also: ఎంజీ TO టాటా.. ఇండియాలో చీప్ అండ్ బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

⦿ టాటా ఆల్ట్రోజ్ EV

ఈ కారు 2026 చివరిలో లేదంటే 2027 ప్రారంభం లాంచ్ కానుంది. 300-400 km రేంజ్, ప్రీమియం హ్యాచ్‌ బ్యాక్ ఫీచర్లు అయిన టచ్‌ స్క్రీన్, క్రూజ్ కంట్రోల్, ADASను కలిగి ఉంటుంది. ఈ కారు అంచనా ధర రూ. 12-15 లక్షలు.

Read Also: దేశంలో అత్యంత ఖరీదైన కార్లు ఇవే.. ధర ఎంతో తెలిస్తే మతిపోవాల్సిందే!

⦿ టాటా అవిన్యా

ఈ కారు కూడా 2026 చివరలో లేదంటే 2027 ప్రారంభంలో అందుబాటులోకి రానుంది.  ఫ్యూచరిస్టిక్ డిజైన్, జెన్-3 EV ప్లాట్‌ ఫాం, 500+ km రేంజ్, లౌంజ్ స్టైల్ ఇంటీరియర్, అడ్వాన్స్‌డ్ కనెక్టెడ్ టెక్, ప్రీమియం మెటీరియల్స్ ను కలిగి ఉంటుంది. ఈ ప్రీమియం EV సెగ్మెంట్  కారు అంచనా ధర రూ. 30-60 లక్షలు.

Read Also: ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే, టాప్ ప్లేస్ దక్కించుకున్న కారు ఏదంటే?

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×